భానుడి ప్రతాపానికి మరో ఉపాధి కూలి మృత్యువాత పడింది.
విజయనగరం : భానుడి ప్రతాపానికి మరో ఉపాధి కూలి మృత్యువాత పడింది. ఈ సంఘటన శుక్రవారం విజయనగరం జిల్లా బోగాపురం మండలం రావాడ గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన దువ్వు అప్పలకొండ(55) అనే మహిళ గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. శుక్రవారం ఉపాధి హామి కూలీకి వెళ్లిన ఆమె వడదెబ్బతో మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.
(భోగాపురం)