విశాఖ: విశాఖపట్టణం 3 వ టౌన్ ఎంవీఎస్ కాలనీకి చెందిన ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికంగా నివాసం ఉంటున్న కోసూరి శ్రీలలిత(30) సోమవారం సాయంత్రం హఠాత్తుగా ఇంట్లో పడిపోవడంతో ఆస్పత్రిలో చేర్చామని, చికిత్సపొందుతూ మంగళవారం మధ్యాహ్నం మృతి చెందిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
అయితే ఆమె మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ బంధువులు చెబుతుండడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆరా తీస్తున్నారు. శ్రీలలిత భర్త రమేష్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.