కాకినాడ (తూర్పుగోదావరి జిల్లా) : రాష్ట్రస్థాయి మహిళా కబడ్డీ పోటీలను ఈ నెల 30, 31, జూన్ 1 తేదీల్లో తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం ముక్కొల్లులో నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉపనేత, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. పోటీల పోస్టర్‌ను కాకినాడలో ఆదివారం ఆయన ఆవిష్కరించారు. బస్వా చినబాబు స్మారకార్థం ఈ పోటీలను పార్టీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ప్రారంభిస్తారన్నారు. రోజూ సాయంత్రం 4 గంటల నుంచి ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పోటీలు జరుగుతాయన్నారు.
పోస్టర్ ఆవిష్కరణలో ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు అనంత ఉదయ్ భాస్కర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్రి పాపారాయుడు, నాయకులు శెట్టిబత్తుల రాజబాబు, జెడ్పీ ప్రతిపక్షనేత జ్యోతుల నవీన్, పోటీల ఆహ్వాన కమిటీ అధ్యక్షులు వీవీబీ ప్రసాద్, సెక్రటరీ గంధం ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
30 నుంచి రాష్ట్ర మహిళా కబడ్డీ పోటీలు
Published Sun, May 24 2015 8:28 PM | Last Updated on Sun, Sep 3 2017 2:37 AM
Advertisement
Advertisement