సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజి మహిళల కబడ్డీ టోర్నమెంట్‌లో కోఠి మహిళా యూనివర్సిటీ కాలేజి జట్టు సత్తా చాటింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో టైటిల్‌ను కైవసం చేసుకుంది. గురువారం జరిగిన ఫైనల్లో యూనివర్సిటీ కాలేజి జట్టు 43–30తో కస్తూర్బా గాంధీ జట్టుపై ఘనవిజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో యూనివర్సిటీ కాలేజి 42–11తో ఆంధ్ర మహిళా సభపై, కస్తూర్బా జట్టు 57–15తో భవన్స్ సైనిక్‌పురి జట్టుపై విజయం సాధించాయి.
మూడో స్థానం కోసం జరిగిన పోరులో భవన్స్ జట్టుపై ఆంధ్రమహిళా సభ గెలుపొందింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజి టోర్నమెంట్ (ఐసీటీ) డైరెక్టర్ బి. సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ప్రశాంత ఆత్మ, కబడ్డీ సాయ్ కోచ్ కె. శ్రీనివాస్ రావు, ఓయూసీడబ్ల్యూ కార్యనిర్వాహక కార్యదర్శి వి. దీపిక రావు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment