తాటిచెట్లపాలెం జంక్షన్‌లో మహిళలకు అభివాదం చేస్తున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి
ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు)/తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర)/ఎన్‌ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ)/గాజువాక: రక్షణ కొరవడిన తరుణాన మృగాళ్లను వేటాడే క్రమంలో పడతుల చేతిలో పాశుపతాస్త్రం వంటి చట్టాన్ని అందించి ‘దిశ’ చూపిన జగనన్నకు అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలికారు తరుణులు. ఆడపడుచుల్లా ఆదరించాల్సిన అతివలపై అత్యాచారానికి తెగబడితే ఏళ్ల తరబడి విచారణ పేరుతో జాప్యం జరగకుండా 21రోజుల్లోనే దోషులకు కఠిన శిక్ష అమలు చేసేలా రూపొందించిన ‘దిశ’ బిల్లు అసెంబ్లీలో శుక్రవారం ఆమోదం పొందడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తెలంగాణాలో ఘటనకు స్పందించి, మన రాష్ట్రంలో అటువంటి పరిస్థితి తలెత్తకుండా.. కఠిన చట్టాన్ని అమలు చేయాలన్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పంతో రూపొందిన బిల్లు చట్టసభలో ఆమోదం పొందిన రోజునే ఆయన నగరానికి రావడంతో తమ భద్రతకు అత్యంత ప్రాధాన్యమిచ్చిన అన్నకు కృతజ్ఞతా నీరాజనాలు పలికారు మగువలు.
‘థాంక్యూ సీఎం సార్’ నినాదాలతో మార్మోగిన హైవే..
ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు సీఎం విశాఖ రావడంతో థాంక్యూ సీఎం సార్ నినాదాలతో నగరంలోని జాతీయ రహదారి మార్మోగింది. శుక్రవారం సాయంత్రం 4.53 గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకున్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి 5.10 గంటలకు విమానాశ్రయం నుంచి బీచ్‌రోడ్‌లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌కు బయల్దేరారు. దారిపొడవునా ప్లకార్డులను ప్రదర్శిస్తూ మహిళలు నీరాజనాలు పలికారు. ఎన్‌ఏడీ జంక్షన్, బిర్లా, కంచరపాలెం, మర్రిపాలెం, ఆర్ అండ్ బీ, నరసింహనగర్, తాటిచెట్లపాలెం జంక్షన్లతో పాటు బీచ్‌రోడ్డులో సీఎం వాహన శ్రేణి వెళుతున్న సమయంలో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వారికి అభివాదం చేయగా థాంక్యూ సీఎం సార్ అంటూ జేజేలు పలికారు.
విశాఖ విమానాశ్రయంలో సీఎంను కలిసిన మహిళలను అమ్మా బాగున్నారా.. అని ఆప్యాయంగా పలకరించడంతో హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కలవడమే గొప్ప విషయం.. అలాంటిది ఆప్యాయంగా పలకరించడం ఇంకెంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. తాటిచెట్లపాలెం జంక్షన్ వద్ద వైఎస్సార్‌సీపీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో మహిళలు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఆటో డ్రైవర్లు, ఆరీ్పలు, వలంటీర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 34వ వార్డు అ«ధ్యక్షుడు పైడిరమణ, 33వ వార్డు అధ్యక్షుడు దుప్పలపూడి శ్రీనివాసరావు, మహిళా అ«ధ్యక్షురాలు గంటా సుభాíÙణి తదితరులు సీఎంకు స్వాగతం పలికారు. గాజువాకలోని ఎంవీఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ‘థాంక్యూ సీఎం సర్’ అంటూ విద్యార్థినులు ప్లకార్డులను ప్రదర్శించారు. కరస్పాండెంట్ వి.రామారావు, ప్రిన్సిపల్ ఎ.బాలకృష్ణ పాల్గొన్నారు.
జగనన్నకు రాఖీ..
అతివల భద్రతపై ప్రత్యేకంగా దిశ చట్టం తీసుకొచ్చి, మహిళలందరిలో ధైర్యాన్ని నింపిన జగనన్నకు రాఖీ కట్టారు వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు. ఎంపీ గొడ్డేటి మాధవితో పాటు పార్టీ నేతలు వరుదు కల్యాణి, అక్కరమాని విజయనిర్మల, గరికిన గౌరి, పీలా వెంకటలక్ష్మి తదితరులు సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి శాలువా కప్పి, సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment