దేవతల నగరంగా రాజధాని నిర్మాణం
అమరావతి: వచ్చే ఎన్నికలనాటికి కొంతైనా రాజధాని నిర్మాణం చేపట్టాలని కోరుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సింగపూర్ కన్సార్టియం-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య శనివారం ఎంవోయు కుదిరింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాజధానిని దేవతల నగరంగా నిర్మిస్తామని, సింగపూర్ కంటే బెస్ట్ సిటీని నిర్మిస్తున్నామని తెలిపారు.
ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఏపీ రాజధాని కోసం 33వేల ఎకరాల భూమిని సేకరించామని చంద్రబాబు తెలిపారు. సింగపూర్ కన్సార్టియం మూడు మాస్టర్ ప్లాన్ అందించేందుకు 2014లో సింగపూర్ ముందుకు వచ్చిందని, ఆరు నెలల వ్యవధిలోనే మాస్టర్ ప్లాన్ అందించిందన్నారు. రాజధాని సింగపూర్‌లా ఉండాలని తాను మొదటి నుంచి కోరుకుంటున్నట్లు తెలిపారు. మూడు దశల్లో అందించిన మాస్టర్ ప్లాన్ తమకు కలిసి వచ్చిందన్నారు. కృష్ణానది మన రాజధానికి అదనపు బలమని, ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల మేరకు అభివృద్ధి చెందుతుందన్నారు.