దీనజన బాంధవునికి... ఘన నివాళి
చెమర్చిన కళ్లు, ముకులిత హస్తాలు, బరువెక్కిన గుండెలతో ఆయన అభిమానులు తల్లడిల్లిపోయారు....రాజన్న అమలు చేసిన సంక్షేమ పథకాలను, ఆపన్నహస్తం అందించిన తీరును...గుర్తు తెచ్చుకున్నారు. మళ్లీ పుట్టాలని మనసారా కోరుకున్నారు... తమను ఆదుకున్నందుకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. మహానేత దివికేగి ఐదేళ్లు గడిచినా... జనహృదయాలలో ఆయన జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఐదవ వర్ధంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆయన విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేసి, సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
విజయనగరం మున్సిపాలిటీ : మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదవ వర్ధంతి కార్యక్రమాలు మంగళవారం జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున జరిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల పిలుపుమేరకు నియోజకవర్గ సమన్వయకర్తలు, మండల పార్టీ కన్వీనర్లు విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించా రు. విజయనగరం, నెల్లిమర్ల ప్రాంతాల్లో జరి గిన కార్యక్రమాల్లో పార్టీ సీనియర్ నాయకుడు పెనుమత్స సాంబశివరాజు, కురుపాం నియోజకవర్గ ంలో స్థానిక ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి , చీపురుపల్లిలో పార్టీ పార్లమెంటరీ పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్ పాల్గొన్నారు. విజయనగరం పట్టణంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో రింగురోడ్డు షిర్డీ సాయి బాబా ఆలయ నిర్మాణానికి గానూ పార్టీ తరఫున రూ.50 వేలు నగదును అందజేశారు.
అనంతరం పార్టీ నాయకులు వైఎస్‌ఆర్‌సీపీ కేంద్రపాలకమండలి సభ్యులు పెనుమత్స సాంబశివరాజు, కోలగట్ల చేతుల మీదుగా వృద్ధులకు శాలువాలు, బిస్కెట్లు, పండ్లు పంపిణీ చేశారు. అలాగే పూల్‌బాగ్‌లో ఉన్న ద్వారకామయి అంధుల పాఠశాలలో అంధ విద్యార్థులకు బిస్కెట్లు, పండ్లు పంచిపెట్టారు. అంధ విద్యార్థుల సంక్షేమానికి గానూ వైఎస్‌ఆర్ సీపీ తరఫున రూ.25వేలు ఆర్ధికసాయం అందజేశారు. పక్కనే ఉన్న కుసుమ హరనాథ క్షేత్రం ఆవరణలో ఉన్న వాసవీ ఓల్డేజ్ హోమ్‌లో వృద్ధులకు శాలువాలు, బిస్కెట్లు, పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పెనుమత్స సాంబశివరాజు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అవనాపు విజయ్ తదితరులు పాల్గొన్నారు. బొబ్బిలిలో డాక్టర్ వైఎస్‌రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
రాజశేఖరరెడ్డి ఐదవ వర్ధంతిని పురస్కరించుకొని నెల్లిమర్ల మండలంలోని మొయిద, మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమాల్లో పార్టీ సీనియర్ నాయకుడు పెనుమత్స సాంబశివరాజు, ఇతర నేతలు పాల్గొని రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించారు. ఎస్. కోట నియోజకవర్గం సమన్వయకర్త నెక్కల నాయుడుబాబు ఆధ్వర్యంలో కొత్తవలస మండలం కేంద్రంలో గల వైఎస్ ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బెల్లానచంద్రశేఖర్ ఆధ్వర్యంలో చీపురుపల్లి మెయిన్ రోడ్డులో నల్లరిబ్బనులు కట్టుకుని మౌన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మండలం పరిషత్ కార్యాలయం, గాంధీ బొమ్మ జంక్షన్ వద్ద వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
500 మందికి అన్నదాన ం చేశారు. పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త జమ్మానప్రసన్న కుమార్ , పట్టణ అధ్యక్షుడు మజ్జి వెంకటేష్, ఉదయభాను ఆధ్వర్యంలో ఆర్టీసీ కూడలి వద్ద గల వైఎస్‌ఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళురల్పించారు. కురుపాం మండలం కేంద్రంలోని రావాడ కూడలి వద్ద గల వైఎస్‌ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, నియోజకవర్గ సమన్వయకర్త శత్రుచర్ల చంద్రశేఖర్‌రాజు, పరీక్షత్ రాజు , జెడ్పీటీసీ శెట్టి పద్మావతి, ఎంపీపీ ఆనిమి ఇందిరా కుమారీలు క్షీరాభిషేకం చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పళ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. జి య్యమ్మవలస మండలం చినమేరంగిలో ఎమ్మె ల్యే పుష్పశ్రీవాణి నిరుపేదలకు దుప్పట్లు పం పిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన వర్ధంతి కార్యక్రమాల్లో రాజశేఖరరెడ్డి అభిమానులు, వైఎస్‌ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని మహానేతను స్మరించుకున్నారు.