
ప్రజాసంకల్పయాత్ర బృందం: తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరస్వామి సాక్షిగా సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం హామీ ఇచ్చారనీ, అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా మాట మరిచిపోయారని వై ఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణా కరరెడ్డి తెలిపారు. జిల్లాలో జరుగుతున్న ప్రజాసంకల్పపాదయాత్రలో పాల్గొనేం దుకు వచ్చిన ఆయన ఇక్కడి మీడియాతో బుధవారం మాట్లాడారు. ప్రత్యేక హో దాను భూతంలా చూపించి నాలుగు సంవత్సరాలు బీజేపీతో అంటకాగి ప్రత్యేక హోదా ఊసెత్తకుండా, ఎవరైనా అడిగితే కేసులు పెట్టించడమే కాకుండా ప్రత్యేక ప్యాకేజీకోసం వెంపర్లాడారని మండిపడ్డారు. బీజేపీ పెద్దలకు సన్మానం చేసి, అసెంబ్లీలో తీర్మానాలు చేసి, ఎన్నికలు వచ్చేసరికి ఓటమి పాలవుతానన్న భయంతోనే యూటర్న్ తీసుకుని ప్రత్యేక హోదా కోసం ఇప్పుడు పాకులాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి ఎంతో అవసరమైన ప్రత్యేక హోదా రాకపోవడానికి టీడీపీ, బీజేపీ రెండూ కారణమని, అందులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రధాన పా త్ర వహించారని ఆరోపించారు. రాష్ట్రంలో ఆయన పరిస్థితి పతనావస్థకు చేరుకోవడంతో హోదా కోసం తానే కష్టపడుతున్నట్లు ప్ర జలను మోసం చేస్తున్నారని విమర్శించారు. జాబులివ్వలేదు సరిక దా ఖాళీలు భర్తీ చేయకపోవడం అన్యాయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment