పసుపు విత్తన విక్రయూల జోరు
రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో పసుపు పంట సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. దీంతో పసుపు విత్తన మార్కెట్‌గా ప్రసిద్ధి చెందిన తూములూరులో విక్రయూలు జోరందుకున్నారుు. ఆదివారం ఒక్క రోజే 750 పుట్ల విత్తనాలను రైతులు కొనుగోలు చేశారు. ఇక్కడి విత్తనాలను ఒడిశా రాష్ట్ర రైతులూ పెద్దఎత్తున కొనుగోలు చేస్తుండటం విశేషం. ఇప్పటివరకు ఆ రాష్ట్రానికి 10 వేల పుట్ల విత్తనాలను ఎగుమతి చేశారు.
కొల్లిపర: రెండు రోజులుగా వర్షాలు పడుతుండటంతో పసుపు సాగుకు వాతావరణం అనుకూలంగా మారింది. దీంతో పసుపు విత్తనాల కేంద్రంగా ప్రసిద్ధి చెందిన తూములూరులో విక్రయూలు జోరందుకున్నారుు. ఆదివారం ఒక్కరోజే 750 పుట్ల విత్తనాలను రైతులు కొనుగోలు చేశారు. వీటి విలువ రూ.22.50 లక్షలు. ఒక పుట్టి పసుపు విత్తనాల బరువు 225 కిలోలు కాగా ధర రూ.3000 పలికింది. తెనాలి డివిజన్‌లోని మండలాలతోపాటు సత్తెనపల్లి, నర్సారావుపేట, పిడుగురాళ్ల, మాచర్ల, కృష్ణా జిల్లా నూజివీడు, నందిగామ తదితర ప్రాంతాలు, ఒడిశా రాష్ట్రానికి చెందిన రైతులు విత్తనాలను కొనుగోలు చేశారని వ్యాపారులు చెప్పారు. పసుపు విత్తనాలకు ఒడిశా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుండటంతో అక్కడి రైతులు పెద్దఎత్తున కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు ఆ రాష్ట్రానికి 10 వేల పుట్ల విత్తనాలను ఎగుమతి చేశామని వెల్లడించారు.
వైఎస్‌ఆర్ జిల్లా నుంచి
విత్తనాల రాక
వైఎస్‌ఆర్ జిల్లాలోని కడప, మైదుకూరు, బద్వేలు తదితర ప్రాంతాలకు చెందిన రైతులు ఏటా పసుపు విత్తనాలను తూములూరు తీసుకొచ్చి విక్రరుుంచటం ఆనవారుుతీ. ఇప్పటివరకు వారు 17,500 పుట్ల విత్తనాలను తీసుకువచ్చారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఇంకా 7,500 పుట్ల విత్తనాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నారుు.
పసుపు విత్తనాల్లో రకాలు
పసుపు విత్తనాల్లో పలు రకాలు ఉన్నాయి. సుగంధ, టేకూరుపేట, బాక్రాపేట, సేలం, కడప, ప్రగడవరం వంటి రకాలు ఇక్కడకు దిగుమతి అవుతాయి. సుగంధ రకం ఎక్కువగా గుంటూరు జిల్లాలోని పల్నాడు, కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతాలకు ఎగుమతి ఆవుతుంది. సేలం రకాన్ని లంక గ్రామాలతోపాటు కొల్లిపర మండల పరిసర ప్రాంతాల్లో విస్తారంగా పండిస్తారు. ప్రగ డవరం రకం ఏలూరు, ద్వారకాతిరుమల పరిసర ప్రాంతాలకు వెళుతుంది.
సాగు పనులు ప్రారంభం..
వాస్తవానికి పసుపు సాగు పనులు ఈసరికే పూర్తికావాలి. కానీ ఈ ఏడాది వర్షాలు సకాలంలో పడకపోవడంతో జాప్యం జరిగింది. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో సాగు పనులకు రైతులు శ్రీకారం చుడుతున్నారు. కొల్లిపర, దుగ్గిరాల, కొల్లూరు మండలాల పరిధిలోని రైతులు విద్యుత్ మోటార్ల సాయంతో సాగు పనులను వారం కిందటే ప్రారంభించారు. ఇప్పుడు మిగిలిన ప్రాంతాల్లోనూ సాగు పనులు ప్రారంభమయ్యూరుు. ఎకరానికి 8 పుట్ల విత్తనాలు అవసరం. దీంతో రైతులు భారీగా పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. దిగుబడులు బాగుంటేనే రైతుల కష్టానికి తగిన ప్రయోజనం దక్కుతుంది.