ఇక మీ భూమి మీ చేతుల్లో! | Your Earth Portal | Sakshi
Sakshi News home page

ఇక మీ భూమి మీ చేతుల్లో!

Published Mon, Aug 10 2015 11:29 PM | Last Updated on Mon, Apr 8 2019 6:46 PM

ఇక మీ భూమి మీ చేతుల్లో! - Sakshi

ఇక మీ భూమి మీ చేతుల్లో!

రెవెన్యూలో విప్లవాత్మక సంస్కరణలు వస్తున్నాయి. ఒకప్పుడు తహశీల్దార్, వీఆర్‌ఓల దగ్గర మాత్రమే ఉండే రెవెన్యూ రికార్డులు ఇటీవలి కాలంలో మీ సేవ కేంద్రాలలోకి వచ్చాయి. తాజాగా ప్రభుత్వం  అందుబాటులోకి తెచ్చిన మీ భూమి పోర్టల్ ద్వారా రెవెన్యూ రికార్డులు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఇళ్లలోనే కంప్యూటర్ ద్వారా భూములకు సంబంధించిన అన్ని విషయాలు చూసుకోవచ్చు. రాబోయో రోజుల్లో భూముల వివరాల్లో ఎకరం తగ్గినా, జమ అయిన సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చే సదుపాయం కూడా అందుబాటులోకి రానుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మీ భూమి పోర్టల్‌లో భూముల వివరాలలో ఉన్న తప్పులను సరిచేసేందుకు సోమవారం నుంచి ప్రారంభమైన  రెవెన్యూ సదస్సులు ఈ నెల 31 వరకు అన్ని రెవెన్యూ గ్రామాల్లో నిర్వహిస్తారు.          - సాక్షి, విశాఖపట్నం
 
పట్టాదారులందరికి 1-బీ ఖాతా నకళ్లు
జిల్లాలో 6,36,660 మంది పట్టాదారులు ఉన్నారు. రెవెన్యూ గ్రామం వారీగా జరిగే గ్రామసభల్లో రైతు లందరికి 1-బీ ఖాత నకళ్లు పంపిణీ చేస్తారు. వాటిల్లో ఉన్న భూముల వివరాలు పరిశీలించి ఏమైనా తప్పులు ఉంటే సరిచేసుకునేందుకు అక్కడే దరఖాస్తులు ఇస్తారు. వాటిని పూర్తి చేసి తగిన డాక్యుమెంట్లు జత చేసి ఇస్తే వెంటనే తగిన రసీదు ఇస్తారు. నిర్ణీత వ్యవధిలోగా సరిచేస్తారు. వివరాలు అన్నీ సక్రమంగా ఉంటే కరక్టుగా ఉన్నాయని పట్టాదారులు సర్టిఫై చేయాల్సింది. ప్రతి మండలంలో రోజుకొక గ్రామం చొప్పున రెవెన్యూ సద స్సులు జరుగుతాయి.

పాత  వాటిస్థానంలో కొత్త ఈ- పాస్ పుస్తకాలు..
 రైతులు పట్టాదారు పాసుపుస్తకాలు పొందువిధానం 1989 నుంచి అంటే 25 సంవత్సరాలుగా ఉంది. ప్రస్తుతం రైతుల పాసుపుస్తకాలు శిథిలావస్థలో ఉన్నాయి. వాటి స్థానంలో 15రకాల భద్రతతో కూడిన ఈ-పాస్‌పుస్తకాలు పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దెబ్బతిన్నపాత పట్టాదారు పాసుపుస్తకాల స్థానంలో కొత్తగా ఈ-పట్టాదారు పాసుపుస్తకాలు పొందేందుకు మీ సేవ కేంద్రాలను దరఖాస్తు చేసుకోవాలి. రెవెన్యూ రికార్డుల పరిశీలన అనంతరం ఈ- పాసుపుస్తకాలు జారీ అవుతాయి.
 
పట్టాదారు మరణిస్తే..
 అతని వారుసుడు అంటే భార్య సంతానం, మరణించిన వ్యక్తికి చెందిన భూమిని భాగపరిష్కారం ద్వారా పంచుకోవాలన్నా వేరువేరుగా ఈ-పట్టాదారు పాసుపుస్తకాలు పొందవచ్చు. అవసరమైన డాక్యుమెంట్లతో మీ సేవా కేంద్రాలలో దరఖాస్తు దాఖలు చేసుకోవాలి. = పట్టాదారు మరణ ధృవపత్రం, ఇసి.ఎంక్యూంబరెన్స్ ధృవపత్రం కుటుంబసభ్యుల మధ్య భాగపరిష్కారం చేసుకొని డాక్యుమెంటు (100 రూపాయలస్టాంపు నోట రీ ద్వారా) పట్టాదారు పాసుపుస్తకం టైటిల్‌డీడ్ (వరిజినల్), మండల సర్వేయర్ భూమి సర్వే నివేదికతోపాటు భూమి హద్దుదారుల నుంచి తీసుకున్న స్టేట్‌మెంట్, 4 ఫోటోలు అవసరమవుతాయి.
 
 మీ భూమి పోర్టల్ ఇలా చెక్‌చేసుకోవాలి
 = ఇంటర్నెట్‌లో meebhoomi.apgov.in అనే సైట్ ద్వారా మీ భూమి-భూమి రికార్డుల వివరాలు.. ప్రజాపోర్టర్ ఓపెన్ అవుతుంది. అందులో హోమ్, అడంగల్, 1-బి, ఆధార్ లింకింగ్, ఎఫ్‌ఎంబీ, గ్రామ పటం అనే లింకులు కనబడుతాయి. = అడంగల్ మీద క్లిక్ చేస్తే మీ అడంగల్, గ్రామ అడంగల్ అని, 1బీ మీద క్లిక్ చేస్తే మీ 1బీ, గ్రామ 1బీ కనపడుతాయి. మీకు సంబంధించిన వివరాలు మాత్రమే కావాలనుకుంటే మీ అడంగల్, మీ 1బీ ద్వారా చూడవచ్చు. గ్రామం మొత్తానికి సంబంధించిన వివరాలను గ్రామ అడంగల్, గ్రామ 1బీ ద్వారా చూడవచ్చు. = మీ భూమికి సంబంధించి వివరాలు నాలుగు మార్గాల ద్వారా అంటే సర్వే నంబరు, ఖాతా నంబరు, ఆధార్ నంబరు, పట్టాదారుపేరు సెలక్టు చేసి, తదుపరి జిల్లా పేరు, మండలం పేరు, గ్రామం పేరు ఎంచుకొని మీ వద్ద ఉన్న పై తెల్పిన సెలెక్టు చేసిన వివరాలు నమోదు చేసి అందు చూపిన కోడ్ ఎంటర్ చేస్తే  వివరాలు కనబడుతాయి. = రెవెన్యూ సదస్సుల్లో వివిధ సందర్భాల్లో  ఈ.పట్టాదారు పాసుపుస్తకాలు పొంద డానికి ఏమి చేయాలనే దానిపై అవగాహనకల్పిస్తారు.
 
కొనుగోలు ద్వారా భూమిని పొందినపుడు
 కొనుగోలు ద్వారా భూమి పొందినపుడు కూడా ఈ-పాస్‌పుస్తకం పొందవచ్చు. రిజిష్టరైన విక్రయ దస్తావేజు, లింకు డాక్యుమెంటు, పూర్తిగా అమ్మినచో పట్టాదారు పాసుపుస్తకం, టైటిల్‌డీడ్ (వరిజినల్) కొంతభాగం అమ్మితే జిరాక్స్ ప్రతులు, నాలుగు ఫోటోలను దరఖాస్తుకు జతచేసి మీ సేవ కేంద్రాలలో దాఖలు చేసుకుంటే 40 రోజులలో చర్యలు తీసుకుంటారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement