254వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం | YS Jagan 254th Day PrajaSankalpaYatra Begins | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 4 2018 8:05 AM | Last Updated on Tue, Sep 4 2018 12:23 PM

YS Jagan 254th Day PrajaSankalpaYatra Begins - Sakshi

సాక్షి, కె.కోటపాడు(విశాఖపట్నం) : రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర విశాఖపట్నంలో అనంతవాహినిలా సాగిపోతోంది. మంగళవారం ఉదయం జననేత 254వ రోజు పాదయాత్రను జోగన్నపాలెం నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి రామచంద్రాపురం, బొట్టవానిపాలెం, కె. సంతపాలెం, చంద్రయ్యపేట, అయ్యన్న పాలెం మీదుగా బుద్దిరెడ్డి పాలెం క్రాస్‌ వరకు వరకు రాజన్నబిడ్డ పాదయాత్ర కొనసాగనుంది. 

అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం. దారి పొడవునా మంగళహారతులు. ప్రజా సమస్యల తోరణాలు, వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర మంగళవారం ప్రారంభమైంది. నైట్‌క్యాంప్‌ వద్ద రాజన్న బిడ్డను చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల, ప్రజలు ఉదయం నుంచే పెద్దఎత్తున తరలివచ్చారు.






 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement