సాక్షి, ఎస్.కోట(విజయనగరం): రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరంలో అనంతవాహినిలా సాగిపోతోంది. శనివారం ఉదయం జననేత 273వ రోజు పాదయాత్రను లక్కవరపు కోట మండలం కిర్లా నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి జామి మండలంలోని జిడ్డేటివలస క్రాస్, గొడికొమ్ము, అలమండ క్రాస్, గజపతి నగరం నియోజకవర్గ పరిధిలోని అలమండ సంత, లొట్టపల్లి క్రాస్, యాతపాలెం, కొత్త భీమసింగి, పాత భీమసింగి వరకు నేటి ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది.
అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం. దారి పొడవునా మంగళహారతులు. ప్రజా సమస్యల తోరణాలు, వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర శనివారం ప్రారంభమైంది. నైట్‌క్యాంప్ వద్ద రాజన్న బిడ్డను చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల, ప్రజలు ఉదయం నుంచే పెద్దఎత్తున తరలివచ్చారు.
చదవండి:
నడిచేది నేనైనా.. నడిపించేది మీ అభిమానమే
చరిత్రాత్మక ఘట్టం: ప్రజాసంకల్పయాత్ర @3000 కి.మీ.
Comments
Please login to add a commentAdd a comment