
సాక్షి, విజయనగరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 276వ రోజు షెడ్యూల్ ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. మంగళవారం జననేత విజయనగరం నియోజకవర్గంలోని కొత్తపేట నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి సంకేటి వీధి, కుమ్మరి వీధి, వైఎస్సార్ నగర్, కొండ కరకాం వరకు సాగనుంది. అక్కడ వైఎస్ జగన్ భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి నెల్లిమర్ల నియోజకవర్గంలోని కొండవెలగాడ వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment