
సాక్షి, విజయనగరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 305వ రోజు ఆదివారం ఉదయం కురుపాం నియోజకవర్గం తురకనాయుడు శివారు నుంచి ప్రారంభమైంది. వైఎస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. జననేతను చూసేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, వారికి నేనున్నానంటూ వైఎస్ జగన్ భరోసా ఇస్తున్నారు.
అక్కడి నుంచి నగురు, దట్టివలస క్రాస్ రోడ్డు, చిలకం క్రాస్ రోడ్డు, రావివలస క్రాస్ రోడ్డు మీదుగా.. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు. అక్కడి నుంచి కెల్ల, నడిమికెల్ల వరకు వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగనుంది. తమ సమస్యలను తెలుసుకునేందుకు జిల్లాకు వైఎస్ జగన్‌కు ఘనంగా స్వాగతం పలికేందుకు శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సమాయత్తం అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment