ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రమైన వడగాడ్పుల ప్రభావం వల్ల ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు పరిహారం అందజేయాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఏపీ ప్రభుత్వానికి వైఎస్ జగన్‌డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రమైన వడగాడ్పుల ప్రభావం వల్ల ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు పరిహారం అందజేయాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన శనివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. వడగాడ్పుల వల్ల రాష్ట్రంలో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. గత రెండు రోజుల్లోనే ఏకంగా 225 మంది ప్రాణాలు పోయాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతోందన్నారు. జూన్ మూడోవారంలోకి అడుగు పెడుతున్నప్పటికీ ఒకవైపు వడగాడ్పులు, ఎండ తీవ్రత తగ్గకపోవడం... మరోవైపు అదే సమయంలో అటు పల్లెల్లో, ఇటు పట్టణాల్లో భారీగా కరెంటు కోత విధిం చడం.. ఈ పరిస్థితికి కారణమవుతోందని జగన్ పేర్కొన్నారు.