సాక్షి, నరసరావుపేట
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మార్చి ఆరో తేదీన నరసరావుపేట రానున్నట్టు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆళ్ల అయోధ్యరామిరెడ్డి తెలిపారు. ఆ రోజు నరసరావుపేటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు కానుందని, ఆ సందర్భంగా తాను పార్టీలో అధికారికంగా చేరనున్నట్టు వెల్లడించారు.నరసరావుపేట బ్యాంకు స్ట్రీట్‌లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. నరసరావుపేటలో జరిగే సభకు భారీగా కార్యకర్తలు తరలి రావాలని ఆయన కోరారు. కార్యకర్తలు, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేందుకే తాను ఇక్కడ కార్యాలయాన్ని ఏర్పాటు చేశాననీ, ఇక్కడినుంచే ఎన్నికల జైత్రయాత్ర కొనసాగిస్తానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించుకుని జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడమే ధ్యేయంగా పనిచేయాలని కోరారు. తద్వారా వైఎస్ ఆశయాలను సాధించుకుందామని పిలుపునిచ్చారు.
నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పట్టణంలో కార్యాలయం ఏర్పాటు ద్వారా తాము ఎన్నికలకు పూర్తిగా సన్నద్ధమైనట్టేనని చెప్పారు. సమావేశంలో పార్టీ నియోజకవర్గ నాయకులు డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి, డాక్టర్ పరమేశ్వరరెడ్డి, డాక్టర్ కరుణాకరెడ్డి, డాక్టర్ ఓరుగంటి శేషిరెడ్డి, వైఎస్సార్‌సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సర్తాజ్‌ఆలీ, జిల్లా ప్రచార కార్యదర్శి జి.ఉత్తమరెడ్డి, వైఎస్సార్ టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.వెంకటేశ్వరరెడ్డి, యువజన విభాగ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి.గాబ్రియేలు తదితరులు పాల్గొన్నారు.
6న నరసరావుపేటకు జగన్
Published Tue, Feb 25 2014 12:39 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM
Advertisement
Advertisement