భాస్కర్రెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
హైదరాబాద్ : ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎస్ఐ శ్రీనివాసరావు అమానుష ప్రవర్తన కారణంగా మరణించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వైజా విజయ భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులను పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండించిన ఆయన భాస్కరరెడ్డి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. స్థానిక గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డితో మాట్లాడిన జగన్ బాధితులకు అండగా నిలవాలని ఆదేశించారు. ఈ ఘటనపై న్యాయపోరాటం చేయాలని అవసరమైతే మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించాలని ఆయన సూచించారు.