
ప్రజావంచకులారా.. క్విట్ ఏపీ: వైఎస్ జగన్
హైదరాబాద్: భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన 'క్విట్ ఇండియా' ఉద్యమస్ఫూర్తిని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తుచేసుకున్నారు. 75 ఏళ్ల క్విట్ ఇండియా ఉద్యమానికి ఒక భారతీయుడిగా తాను సెల్యూట్ చేస్తున్నట్టు ఆయన బుధవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆ ఉద్యమం నిరంతరం మనకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని గుర్తుచేశారు. మోసగాళ్లారా, దోపిడీ పాలకులారా, ప్రజావంచకులారా క్విట్ ఏపీ అంటూ మనం ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.
క్విట్ ఇండియా ఉద్యమానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ విధంగా ట్వీట్ చేశారు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) 9 August 2017