
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జగన్
తిరుమలలో శ్రీవేంకటేశ్వరుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున విఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమలేశుడిని దర్శించుకున్న సమయంలో ఆ పార్టీ నేతలు రోజా, కరుణాకర్ రెడ్డి తదితరులు వైఎస్ జగన్ వెంట ఉన్నారు. ఆ తర్వాత వైఎస్ జగన్ రేణుగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి విమానంలో హైదరాబాద్ బయలుదేరారు.