సాక్షి, హైదరాబాద్: వైసీపీ యువజన, విద్యార్థి, మైనారిటీ ఆంధ్రప్రదేశ్ విభాగాలకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలు నియామకాలు చేపట్టారు. పార్టీ ఏపీ విద్యార్థి విభాగం అడ్‌హాక్ కమిటీ అధ్యక్షుడుగా షేక్ సలాంబాబు (కడప), ప్రధాన కార్యదర్శిగా రెడ్డిగారి రాకేష్‌రెడ్డి (కర్నూలు), ఏపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శులుగా భవనం భూషణ్ (గుంటూరు), ఎన్.హరీష్‌కుమార్ (కడప), మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శిగా ఐహెచ్ ఫరూఖీ (విశాఖపట్టణం) నియమితులైనట్లు వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం మంగళవారం పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫరూఖీ ఉభయగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో పార్టీ మైనారిటీ విభాగం వ్యవహారాల ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారు.