‘అన్న వస్తున్నాడు’ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన జగన్‌ | ys jagan mohanreddy launches new web site www.annavastunnadu.com | Sakshi
Sakshi News home page

‘అన్న వస్తున్నాడు’ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన జగన్‌

Published Sun, Jul 16 2017 2:33 AM | Last Updated on Wed, Jul 25 2018 4:45 PM

‘అన్న వస్తున్నాడు’ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన జగన్‌ - Sakshi

‘అన్న వస్తున్నాడు’ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన జగన్‌

సాక్షి, హైదరాబాద్‌ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి వచ్చే అక్టోబర్ చివరివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్ట తలపెట్టిన సాహసోపేతమైన పాదయాత్ర నేపథ్యంలో ఆ పాదయాత్ర వివరాలను ఎప్పటికప్పుడు అందించడానికి ప్రత్యేకంగా ‘అన్న వస్తున్నాడు డాట్‌ కామ్‌’ వెబ్ సైట్ ను రూపొందించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త ఐ.వి.రెడ్డి ప్రత్యేకంగా రూపకల్పన చేసిన ఈ వెబ్‌సైట్‌ను శనివారం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.

అక్టోబర్‌ 27వ తేదీ నుంచి వైఎస్‌ జగన్‌ రాష్ట్ర వ్యాప్తంగా చేయతలపెట్టిన చారిత్రాత్మకమైన పాదయాత్రను పురస్కరించుకుని ఈ వెబ్‌సైట్‌ను రూపొందించామని ఐ.వి.రెడ్డి తెలిపారు. జగన్‌కు సంబంధించిన అన్ని అంశాలు, పాదయాత్ర ప్రారంభించిన తరువాత ఎప్పటికపుడు తాజా వివరాలు ఇందులో పొందుపరుస్తామని పేర్కొన్నారు. వెబ్‌సైట్‌ను రూపొందించినందుకు ఐ.వి.రెడ్డి బృందాన్ని వైఎస్‌ జగన్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement