AnnaVastunnadu
-
'చంద్రబాబు అలా చేస్తే అది జగన్‌కే మంచిపేరు'
-
చంద్రబాబు అలా చేస్తే అది జగన్‌కే మంచిపేరు
సాక్షి, ధర్మవరం : చేనేత, ఇతర వృత్తి పనులు చేస్తూ జీవించే కూలీలకు 45 ఏళ్ల వయసు నుంచే పెన్షన్ అందిస్తామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చెప్పారు. మోసకారి చంద్రబాబు పాలన మరొక్క ఏడాదిలో అంతమైపోయి, జనం కోసం ఏర్పాటయ్యే ప్రజాప్రభుత్వం వస్తుందని, అప్పుడు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని తెలిపారు. ముడిపట్టు రాయితీ బకాయిల కోసం 37 రోజులుగా దీక్షలు చేస్తోన్న చేనేత కార్మికులకు సంఘీభావం తెలిపేందుకుగానూ మంగళవారం అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి వచ్చిన వైఎస్ జగన్.. అక్కడి జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే... చివరికి చనిపోయినా పట్టించుకోరా? : ‘‘పట్టువస్త్రాలు, చేనేతకు ఖ్యాతిగాంచిన ధర్మవరంలో గడిచిన 37 రోజులుగా నేతన్నలు నిరాహార దీక్షలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత ఇక్కడ 65 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కనీసం చనిపోయినవారి కుటుంబాలకైనా ప్రభుత్వం సాయం చేయదా! చనిపోయింది 65 మందైదే, జగన్ వస్తున్నాడని ఏదో 11 మందికి, అది కూడా అరకొరగా డబ్బులిచ్చారు. మళ్లీ జగన్ వెళ్లిపోయాక వారిని ఎవరూ పట్టించుకోరు. చంద్రబాబు అధికారంలోకి రాకముందు నేతన్నలకు పట్టు, నూలు మీద కనీసం రూ.600 ఖర్చులు వచ్చేవి. రెండేళ్ల కిందట చేనేత దినోత్సవంలో చంద్రబాబు మాట్లాడుతూ రూ.600 సాయాన్ని రూ.1000కి పెంచుతామని హామీ ఇచ్చారు. మరి ఇన్ని నెలల్లో ఎన్ని వేలు ఆయన కార్మికులకు ఇచ్చారు? బాబు రావడానికి ముందు 13నెలల బకాయిలు రావాల్సి ఉంది. ఆయన వచ్చాక రెండు నెలపాటు రూ.1000 ఖర్చులిచ్చి ఆ తర్వాత మానేశారు. నిజమే, ఆయనకు అబద్ధాలు చెప్పడం కొత్తేమీకాదు. ఎన్నికలప్పుడు రైతులు, మహిళలు, యువత, చివరికి కులవృత్తులు చేసుకునేవారికి సైతం మోసపూరిత హామీలిచ్చి గద్దెనెక్కారు. చేనేత కార్మికుల రుణాలన్నీ మాఫీ చేస్తా, రుణాలు కట్టొద్దు, నేనొస్తున్నాను.. అని ప్రచారం చేయించుకున్నాడు. తీరా అధికారంలోకి వచ్చాక రూ. 390 కోట్ల రుణాలకుగానూ కేవలం రూ.70 కోట్లిచ్చి చేతులెత్తేశారు. నేత కార్మికులకు ఇల్లు కట్టించి, మగ్గం ఏర్పాటుచేస్తామని, ప్రత్యేక నిధి ద్వారా ఏటా రూ.1000 కోట్లు ఖర్చుచేస్తామని, జిల్లాకో చేనేత పార్కు.. అని మోసపూరిత వాగ్ధానాలు చేశారు. ఏడాది తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే : చేనేత కార్మికులు ఇన్ని అవస్థలు పడుతున్నా.. చంద్రబాబు దున్నపోతు మీద వానపడ్డ చందంగా వ్యవహరిస్తున్నారు. ఆ మోసకారి పాలనకు రోజులు దగ్గరపడ్డాయి. ఒకే ఒక్క సంవత్సరం తర్వాత మనం కలుద్దాం. ఒక్కటిగా మన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకుందాం. దీక్షలు చేస్తోన్న చెల్లెమ్మలకు చెబుతున్నా.. ఒక మంచి అన్నయ్య ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటాడు. ఇవాళ రూ.1000 కోసం టెంట్లు వేశారు.. కానీ ప్రతినెలా రూ.2000 వచ్చేలా చేస్తానని హామీ ఇస్తున్నా. చేనేతలు పనిచేస్తే తప్ప కడుపునిండని పరిస్థితి. 45 ఏళ్లకే కీళ్లనొప్పులు మొదలవుతాయి. అందుకే మహానేత రాజశేఖర్‌రెడ్డి వారికి 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేశారు. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే.. చేనేతలు సహా వృత్తిపనులు చేసుకునే బడుగు కూలీలు అందరికీ 45 ఏళ్లకే పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేసుకుందాం. అదికూడా రూ.2000 ఇస్తాం. పేదలందరికీ ఇళ్లు కట్టిస్తాం. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరేది ఒకటే.. ‘అన్న ముఖ్యమంత్రి అవుతాడు’ అని దేవుణ్ని గట్టిగా ప్రార్థించండి. చంద్రబాబు అలా చేస్తే అది జగన్‌కే పేరు : మూడున్నరేళ్లుగా చంద్రబాబు మోసపూరిత పాలన చూశారు. కనీసం ఒక్క చేనేత కుటుంబానికి కూడా ఆయన ఇస్తానన్న రూ.1లక్ష రుణం ఇవ్వలేదు. మన ప్రభుత్వంలో మాత్రం ప్రతి కార్మికుడికి ఇంటింటికీ వెళ్లి రుణం అందేలా చూస్తాం. నేను నవరత్నాలను ప్రకటించినప్పుడు కొందరు నాతో అన్నారు.. అన్నా, మనల్ని చూసి చంద్రబాబు కూడా రూ.2000 పెన్షన్ అంటారేమో అని! అందుకు నేనన్నాను..అలా చేస్తే మంచిదేకదా, అవ్వలు, తాతలకు మేలు జరుగుతుంది కదా, పెన్షన్ పెరగడానికి కారణమైనందుకు మనకే పేరొస్తుంది కదా అన్నారు. మీ అందరికీ భరోసా ఇస్తున్నా.. ఇంకొక్క సంవత్సరం వరకు మనం కలిసికట్టుగా పోరాడుదాం. కడుపులో ఎంత బాధున్నా, చిక్కటి చిరునవ్వులు చిందిస్తున్న ప్రతిఒక్కరికీ పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని వైఎస్ జగన్ ప్రసంగాన్ని ముగించారు. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చంద్రబాబు మోసపూరిత వాగ్ధానాలపై వైఎస్ జగన్ నిలదీత -
'చేనేత, వృత్తి పనుల కూలీలకు 45 ఏళ్లకే పెన్షన్'
-
‘అన్న వస్తున్నాడు’ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన జగన్
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చే అక్టోబర్ చివరివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్ట తలపెట్టిన సాహసోపేతమైన పాదయాత్ర నేపథ్యంలో ఆ పాదయాత్ర వివరాలను ఎప్పటికప్పుడు అందించడానికి ప్రత్యేకంగా ‘అన్న వస్తున్నాడు డాట్ కామ్’ వెబ్ సైట్ ను రూపొందించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఐ.వి.రెడ్డి ప్రత్యేకంగా రూపకల్పన చేసిన ఈ వెబ్‌సైట్‌ను శనివారం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. అక్టోబర్ 27వ తేదీ నుంచి వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా చేయతలపెట్టిన చారిత్రాత్మకమైన పాదయాత్రను పురస్కరించుకుని ఈ వెబ్‌సైట్‌ను రూపొందించామని ఐ.వి.రెడ్డి తెలిపారు. జగన్‌కు సంబంధించిన అన్ని అంశాలు, పాదయాత్ర ప్రారంభించిన తరువాత ఎప్పటికపుడు తాజా వివరాలు ఇందులో పొందుపరుస్తామని పేర్కొన్నారు. వెబ్‌సైట్‌ను రూపొందించినందుకు ఐ.వి.రెడ్డి బృందాన్ని వైఎస్ జగన్ అభినందించారు. -
వైఎస్ జగన్ హామీలపై డిఫెన్స్‌లో టీడీపీ
-
వైఎస్ఆర్సీపీ ప్లీనరీ ఎఫెక్ట్ : రూ. 676 కోట్లు విడుదల
-
వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు
హైదరాబాద్ : ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్, ఒకటో తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటనపై విద్యార్థులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు గురువారం వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ వైఎస్ జగన్ హామీలతో విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. కాగా వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ సమావేశాల్లో వైఎస్ జగన్ తొమ్మిది పథకాలు ప్రకటించిన విషయం తెలిసిందే. విద్యార్థుల చదువుల కోసం అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు పిల్లలకు ఒక్కొక్కరికీ నెలకు రూ. 500 చొప్పున కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలకు రూ. వెయ్యి ఇస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒక్కొక్కరికీ నెలకు రూ. 750 చొప్పున ఇద్దరు పిల్లలకు రూ. 1500 ఇస్తామన్నారు. ఇంటర్ విద్యార్థులకు ఒక్కొక్కరికి నెలకు రూ. వెయ్యి చొప్పున ఇద్దరికి రూ. 2వేలను నేరుగా తల్లులకే ఇస్తామని వెల్లడించారు. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్' పథకంపై వరాల జల్లు కురిపించిన ఆయన, ఇంజినీరింగ్ కాలేజిల ఫీజులను పూర్తి స్ధాయిలో ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు. అలాగే ఈ నెల 15వ తేదీ సాయంత్రం 4 గంటలకు వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్ఆర్ సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. -
మీ కోసం నా తొమ్మిది వాగ్దానాలు: వైఎస్ జగన్ ట్వీట్
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో ఇచ్చిన వాగ్దానాలపై ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ట్విట్ చేశారు. మీ కోసం నా తొమ్మిది వాగ్దానాలు ‘అన్న వస్తున్నాడు - నవరత్నాలు తెస్తున్నాడు’ అని చాటి చెప్పాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్లీనరీలో మాట్లాడిన వీడియోను వైఎస్ జగన్ ట్విట్ చేశారు. కాగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తాము అధికారంలోకి రాగానే తొమ్మిది పథకాలను అమలుచేయనున్నట్టు వైఎస్ జగన్ ప్లీనరీ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. రైతులకు 'వైఎస్ఆర్ భరోసా', డ్వాక్రా మహిళలకు 'వైఎస్ఆర్ ఆసరా', వృద్ధులకు రూ. 2వేల పెన్షన్, కొత్తగా 25 లక్షల ఇళ్ల నిర్మాణం, చదువుల కోసం అమ్మ ఒడి పథకం, ఆరోగ్యశ్రీకి అవసరమైన నిధుల కేటాయింపు, సాగునీరు కోసం జలయజ్ఞం, మద్యనిషేధం.. ఇలా తొమ్మిది పథకాలతో ప్రతి ఒక్కరి జీవితంలోనూ సంతోషాలు నింపుతామని ఆయన భరోసా ఇచ్చారు. 'అన్న వస్తున్నాడు.. మంచిరోజులు వస్తున్నాయ్' అన్న సందేశంతో ఈ తొమ్మిది పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. My 9 promises to you. Spread the word - #AnnaVastunnadu Navaratnalu thestunnadu pic.twitter.com/kpf9Q74szd — YS Jagan Mohan Reddy (@ysjagan) 12 July 2017 -
‘వైఎస్ జగన్‌ను చూసి టీడీపీ భయపడుతోంది’
కాకినాడ: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చూసి టీడీపీ భయపడుతోందని వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వైఎస్ జగన్ పాదయాత్ర పూర్తి చేస్తారని ఆయన తెలిపారు. బుధవారం కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ... ‘చంద్రబాబుకు ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదు. రాజ్యాంగాన్ని తానే రాసినట్లుగా చంద్రబాబు ఫీల్ అవుతున్నారు. తన గొప్పల కోసం పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారు. జ్యోతుల నెహ్రును సంతృప్తి పరిచేందుకే ఆయన కుమారుడికి జెడ్పీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. జ్యోతుల నవీన్ ఇప్పటివరకూ కూడా వైఎస్ఆర్ సీపీ జెడ్పీటీసీ సభ్యుడే. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాల పథకాలను వాడవాడలా తీసుకువెళ్తాం’ అని అన్నారు. -
‘జగన్ హామీలు ప్రజల గుండెను తాకాయి’
హైదరాబాద్: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలతో చంద్రబాబు నాయుడు వెన్నులో వణుకు మొదలైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. అందుకే టీడీపీ శునకాలన్ని మొరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. భూమన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘టీడీపీ నేతలు వరాహాల గుంపులా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. జగన్ హామీలు ప్రజల గుండెను తాకాయి. దాంతో చంద్రబాబు గుండె అదురుతోంది. రైతులను ఆదుకున్న చరిత్ర వైఎస్ రాజశేఖరరెడ్డిది అయితే దాన్ని చిన్నాభిన్నం చేసిన ఘటన చంద్రబాబుది. చంద్రబాబులా ఓట్ల కోసం ప్రకటనలు చేసే వ్యక్తి జగన్ కాదు. 600 హామీలు ఇచ్చి నమ్మకద్రోహం చేసిన చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది.’ అని అన్నారు. -
'విజయవాడ నడిబొడ్డుకు రండి.. తేల్చుకుందాం'
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జాతీయ ప్లీనరీపై చర్చించడానికి, విమర్షించడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అర్హత లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. మూడంచెల్లో ప్లీనరీని సిద్ధం చేసిన గొప్పదార్శనీకుడు వైఎస్ జగన్ అని అన్నారు. కార్యకర్తల నుంచి నాయకుల వరకు అన్ని అంశాలపై చర్చించుకునే అవకాశాన్ని వైఎస్ జగన్ ఇచ్చారని చెప్పారు. ఇచ్చిన హామీలను అమలుచేయడంలో విఫలమవడంతో వాటన్నింటిని కూడా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఖండించి ప్రజల ముందు ఉంచామని, ఈ మాత్రానికి చంద్రబాబు సర్కార్ ఎందుకు భయపడుతోందని నిలదీశారు. దేవీనేని ఉమ, జవహర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అసలు వీరికి ఏం అర్హత ఉందని ప్రశ్నించారు. దళితులను వెలివేస్తే మాట్లాడని జవహర్ ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉమామహేశ్వరరావు కృష్ణా, గుంటూరు జిల్లాలలో పాల్పడుతున్న అవినీతి ప్రతిఒక్కరికీ తెలుసన్నారు. వైఎస్ జగన్‌పై అవాకులు, చవాకులు ఆపి దమ్ముంటే బహిరంగ చర్చకు రండి, విజయవాడ నడిబొడ్డున తేల్చుకుందామని సవాల్ విసిరారు. తమ పార్టీలోని ఏ ఒక్కరు వచ్చైనా సమాధానం చెప్పి తీరుతారన్నారు. రాష్ట్రంలో దళితులను వెలివేస్తుంటే అక్కడకు వెళ్లడం చేతగానీ చంద్రబాబు సర్కార్‌కు ఏం అర్హత ఉందని విమర్శలు చేస్తున్నారని నిలదీశారు. ప్రజా సమస్యలపై వైఎస్ జగన్ నిరంతరం చేస్తున్న పోరాటాన్ని స్వాగతించాలన్నారు. వైఎస్ జగన్ ఇచ్చిన తొమ్మిది వాగ్దానాలను కచ్చితంగా ప్రతి ఇంటికి తీసుకెళతామని స్పష్టం చేశారు. 600 వాగ్దానాలు ఇచ్చి ఆరు కూడా అమలు చేయలేని నిస్సహాయత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిదని ధ్వజమెత్తారు. త్వరలోనే టీడీపీ రథచక్రాలు ఊడగొట్టి పడగొడతామని విశ్వసం వ్యక్తం చేశారు. -
అన్న వస్తున్నాడంటే ఉలుకెందుకు?
విజయవాడ: అన్న వస్తున్నాడన్న వైఎస్ జగన్ నినాదాన్ని అందరూ స్వాగతిస్తున్నారని వైఎస్సార్ సీపీ నాయకుడు కె. పార్థసారధి తెలిపారు. అన్ని వర్గాలకు తమ అధ్యక్షుడు పరిష్కారాన్ని చూపించారని అన్నారు. ముందున్నాయ్ మంచి రోజులు కార్యక్రమాన్ని ఇంటింటికీ తీసుకెళ్తామని చెప్పారు. పార్టీ నేతలు జోగి రమేశ్, మేరుగ నాగార్జునతో కలిసి ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ ప్లీనరీ విజయవంతమవడంతో టీడీపీ నేతల బట్టలు తడిసిపోతున్నాయని ఎద్దేవా చేశారు. ప్లీనరీతో ప్రజలకు భరోసాయిచ్చామని, టీడీపీ నాయకులు ఎందుకు కలవరపడుతున్నారని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు పరిష్కరించే ధైర్యంలేక ప్లీనరీలో అభివృద్ధి కోసం ఏమీ మాట్లాడలేదని తమపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు సర్కారు అవినీతి, అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. ప్రభుత్వ భూములు, ఖనిజ సంపదను దోచుకున్నారని పేర్కొన్నారు. విశాఖలో కొన్ని వేల ఎకరాల భూముల రికార్డులను తారుమారు చేయడం ద్వారా అవినీతి జరిగిందని టీడీపీ వాళ్లే చెప్పారని గుర్తు చేశారు. ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలను సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాయలసీమలో కరువు తాండవిస్తోందని మీ పేపర్లే రాస్తున్నాయని అన్నారు. ప్రశాంత్ కిశోర్‌ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకోవడాన్ని టీడీపీ నాయకులు తప్పుబట్టడం సరికాదని పేర్కొన్నారు. వైఎస్ జగన్ ప్రజాకర్షణ, మహానేత వైఎస్సార్ పథకాల ఆలంబనతో తమ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని పార్థసారధి విశ్వాసం వ్యక్తం చేశారు. -
'30 ఏళ్లు పాలించగల సత్తా వైఎస్ జగన్‌ది'
విజయవాడ: ముప్పై ఏళ్లపాటు నిర్విరామంగా పరిపాలన చేయగల సత్తా ఉన్న నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఆ పార్టీ నేత జోగి రమేష్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ చూసి ముఖ్యంగా నిన్న(ఆదివారం) సాయంత్రం 4.30గంటల నుంచి చంద్రబాబునాయుడికి కళ్లు బైర్లు కమ్ముకున్నాయని చెప్పారు. చంద్రబాబు షాక్‌లోకి వెళితే ఆయన కేబినెట్ సహచరులంతా కూడా మూర్చరోగుల్లా మారిపోయారని, వారు పిచ్చి ప్రేలాపనలు మాని ఎంత త్వరగా ఎక్కడ ఆస్పత్రి ఉంటే అందులో చేరితే వారి వ్యాధి నయం అవుతుందని సూచించారు. చంద్రబాబు అధికారంలోకి రాకముందు మేనిఫెస్టో పెట్టిన ఏ హామీని కూడా అమలుచేయలేదని ధ్వజమెత్తారు. రైతులను, అక్కాచెల్లెమ్మలను, యువతను, నిరుద్యోగులను, బీసీలను, ఎస్సీలను, ఇలా చెప్పుకుంటూ వెళితే మొత్తాన్ని చంద్రబాబు దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు. ప్రత్యేక హోదాతో సహా ప్రతి ఒక్క తీర్మానం పెట్టి వైఎస్ పాలన ఎలా ఉంది? చంద్రబాబు పాలన ఎలా ఉంది? రాబోయే వైఎస్ జగన్ పాలన ఎలా ఉంటుందో చాలా స్పష్టంగా చెప్పామని, ఈ విషయం కోట్లాదిమందిని ఆకట్టుకుందని తెలిపారు. తమ పార్టీకి తద్దినం పెడతారని దేవినేని ఉమ అంటున్నారని, ఆమనకే మైలవరంలో తద్దినం పెట్టడం ఖాయమని, అతి తొందర్లో టీడీపీని, ఆ పార్టీ నేతలను శ్మశానానికి పంపిస్తామని హెచ్చరించారు. ఈ మూడేళ్లలో చంద్రబాబు ఎలా విఫలమయ్యారనే విషయాన్ని చెప్పడమే కాకుండా రాబోయే రోజుల్లో ఏపీ ప్రజల భవిష్యత్ ఎలా ఉంటుందో వైఎస్ జగన్ కూలంకషంగా చర్చించారని అన్నారు. దేశంలో ఎక్కడ కూడా ఇంత చక్కగా ప్లీనరీ నిర్వహించలేదని, మీడియా కూడా ఆశ్చర్యపోయిందన్నారు. ప్లీనరీ చూసి లోకేష్ షాక్‌లోకి వెళ్లి హెరిటేజ్ పాలు తాగుతున్నారని ఎద్దేవా చేశారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేకు వైఎస్ జగన్‌ను విమర్శించే స్థాయి లేదని జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో సీటు కోసేసి ఆయనకు చంద్రబాబు నాయుడు ఝలక్ ఇవ్వడం ఖాయం అని, రోడ్డున పడటం తధ్యం అని హెచ్చరించారు. కాపులను దారుణంగా మోసం చేసిన చంద్రబాబుకు సెంట్రల్ ఎమ్మెల్యేను పక్కన పెట్టడం పెద్ద విషయం కాదని చెప్పారు. -
'టీడీపీ గుండెల్లో అప్పుడే రైళ్లు.. వెన్నులో చలి'
గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లాంటి తొమ్మిది కార్యక్రమాలు ప్రకటించిన తర్వాత తెలుగుదేశం పార్టీ గుండెల్లో రైలు పరుగెడుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ వెన్నులో చలి పుట్టుకొచ్చిందని, టీడీపీ భవిష్యత్, లోకేశ్ భవిష్యత్ నట్టేట మునిగినట్లేనని ఆ పార్టీ మంత్రులంతా మదనపడుతున్నారని చెప్పారు. ఇప్పుడు ఎక్కడ చూసినా వైఎస్ జగన్ ప్రకటించిన కార్యక్రమాల గురించే అద్భుతంగా చర్చించుకుంటున్నారని, ఇది చూసి ఓర్వలేని చంద్రబాబు, ఆయన మంత్రులు, తాబేదార్లు పాతపద్ధతిలోనే వైఎస్ జగన్ మరోసారి జైలు వెళతారంటూ అవాకులు, చవాకులు పేలుతున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ బయట ఉంటే చంద్రబాబు నాయుడికి, ఆయన పార్టీకి పుట్టగతులు ఉండవని, మనుగడ సాగించలేరని ఉద్దేశంతోనే మరోసారి ఆయనను జైలుకు పంపే కుట్రలు చేస్తున్నారా అని నిలదీశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా రెండు రోజులపాటు జాతీయ ప్లీనరీని నిర్వహించిన విషయం తెలిసిందే. యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కేఎస్ జవహర్లాంటి మంత్రులంతా ప్లీనరీపై అవాకులు చవాకులు పేలారు. ఈ నేపథ్యంలో సోమవారం మీడియాతో మాట్లాడిన అంబటి నిప్పులు చెరిగారు. 42వంటకాలతో భోజనాలు వండి వార్చి మహానాడుకు రండహో అని పిలిచినా వచ్చిన ఆ కొద్ది మంది కూడా భోజనాలు చేసి ఎటువాళ్లు అటు వెళ్లారని అన్నారు. కానీ, తాము మాత్రం కేవలం ఆకలి తీర్చే వంటకాలనే చేసినా కనీవినీ ఎరుగని రీతిలో అశేష జనవాహిని ప్లీనరీకి హాజరైందని, ఇది చూసి టీడీపీ అసూయపడిందని చెప్పారు. ప్లీనరీలో వైఎస్ జగన్ ప్రభంజనం చూసి టీడీపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని, వారి భవిష్యత్ ఏమవుతుందో అని ఆందోళన మొదలైందని చెప్పారు. అవినీతి సొమ్ముతో ప్లీనరీ జరిపామని దేవినేని ఉమ ఆరోపణలు చేస్తున్నారని, ఎవరు అవినీతి సొమ్ముతో ఆర్భాటంగా మహానాడు నిర్వహించారో ఆత్మ విమర్ష చేసుకుంటే మంచిదన్నారు. ఇప్పటికే మహానాడుకు వచ్చిన జనాభా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి వచ్చిన జనాభాపై ఇంటెలిజెన్స్‌తో నివేదిక తెచ్చుకున్న టీడీపీ సర్కార్ షాక్‌లోకి వెళ్లిపోయిందని, మున్ముందు అలాంటి షాకులు ఇంకా ఉంటాయన్నారు. నవరత్నాల్లాంటి కార్యక్రమాలు ప్రకటించి డాక్టర్ వైఎస్ఆర్లాగా ప్రజలకు బాసటగా ఉంటానని వైఎస్ జగన్ ప్రకటించడంతో టీడీపీకి ముచ్చెమటలు పడుతున్నాయన్నారు. ఎన్టీఆర్ మద్యం నిషేదం చేస్తే చంద్రబాబు మాత్రం సందుసందుకు బార్, ఇంటింటికి బీరులా పరిస్థితి తయారు చేశారని, కానీ, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం మద్యం నిషేధిస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. వైఎస్ జగన్ పాదయాత్ర ప్రకటించడంతోపాటు తండ్రికి మించిన తనయుడిలా 3000 కిలోమీటర్లు పాదయాత్ర ఉంటుందని చెప్పడంతో టీడీపీ కుసాలు కదిలిపోతున్నాయని అన్నారు. అత్యద్భుతంగా వైఎస్ జగన్ పాదయాత్ర ఉంటుందని స్పష్టం చేశారు. బాబు అవినీతిని రుజువు చేస్తాం.. డేట్, టైం చెప్పండి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అవినీతిని ముమ్మాటికి రుజువు చేసి తీరుతాం అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. తాము చేసిన ఆరోపణలు నిరూపించాలని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అంటున్నారని దానికి తాము సిద్దం అని చెప్పారు. ఎక్కడ? ఎప్పుడు? చర్చకు రమ్మన్నా తాము సిద్ధం అని సవాల్ విసిరారు. తామెదో గాలికి మాటలు అనలేదని, తాము చెప్పిన ప్రతిమాట నిజమని, అందుకే ఆధారాలతో సహా చంద్రబాబు అవినీతి చక్రవర్తి పేరిట ప్రత్యేక పుస్తకాన్ని విడుదల చేశామని, ఆ పుస్తకంలోని దేన్ని నిరూపించేందుకైనా సిద్ధమన్నారు. ఎన్సీఏఆర్ సంస్థ చేసిన సర్వేలో ఏపీ నెంబర్ అవినీతిలో ఉందని చెప్పిందని ఇంతకంటే ఇంకే రుజువు కావాలని అన్నారు. బాబుకు దమ్ముంటే ఆయన అవినీతిపై విచారణ వేయాలని అది ఏ ఐఏఎస్తోనో కాకుండా జ్యుడిషియల్ విచారణ, సీబీఐ విచారణ అయ్యుండాలని సవాల్ విసిరారు. బడ్జెట్ కంటే కూడా ఎక్కువ అవినీతికి పాల్పడిన చరిత్ర చంద్రబాబునాయుడిదని మండిపడ్డారు. రాజధాని భూముల పేరిట, విశాఖపట్నం భూముల పేరిట చంద్రబాబు రెండు లక్షల కోట్లు అక్రమంగా వెనుకేసుకున్నారని స్పష్టం చేశారు. -
ఇక మాకు నవ వసంతం
వైఎస్సార్సీపీ ప్లీనరీ నిర్ణయాలపై అభిమానుల్లో ఆనందం ఆ తొమ్మిది పథకాల ప్రకటనే కడుపు నింపింది.. దశలవారీ మద్య నిషేధం మహిళలకు సంతోషకరం ఎన్నికల కోసమే ఎదురు చూస్తున్నామని వెల్లడి త్వరలో మంచి రోజులు ఖాయమంటున్న దివ్యాంగులు సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లీనరీలో వైఎస్ జగన్ హామీలు.. కార్యకర్తలు, అభిమానుల్లో ఉత్సాహం నింపాయి. రెండవ రోజైన ఆదివారం వైఎస్సార్ ప్రాంగణం జనసందోహంతో కిక్కిరిసింది. యువత కేరింతలు.. రైతుల్లో ఆనందం.. మహిళల్లో నూతనోత్తేజం వెరసి కదనోత్సాహం ఉప్పొంగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని నలుమూలల నుంచి తరలి వచ్చిన వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానుల సందడితో ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన తొమ్మిది పథకాలే రాష్ట్ర ప్రజల బంగారు భవితకు భరోసా అంటూ అభిమానగణం ఆనందపడింది. ఇక ఎన్నికలు వస్తే అధికార పక్షానికి చుక్కలు చూపించి తమ అభిమాన నేత జగన్మోహన్రెడ్డికి పట్టం కట్టేందుకు సిద్ధమని పేర్కొంది. ప్లీనరీ సమావేశాల్లో దివ్వాంగులు మేము సైతం అంటూ సందడి చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఉన్న ప్రేమ ముందు సమస్యలు చాలా చిన్నవని పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడికి చెందిన స్వాతిపత్రిరాజా, కంతేరుకు చెందిన లక్ష్మణ్‌రెడ్డి అన్నారు. పింఛన్ మొత్తం పెంచుతానని జగన్ హామీ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ‘ప్లీనరీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన తొమ్మిది సంక్షేమ పథకాలే ఆయన విజయానికి రక్షగా నిలుస్తాయి. ఆ పథకాలే అమలైతే రామ రాజ్యం వచ్చినట్లే. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా వైఎస్ జగన్ పథకాలు ప్రకటించారు. రైతుకు ఎంతో న్యాయం జరుగుతుంద’ని తిరుపతికి చెందిన విరుపాక్ష జయచంద్రారెడ్డి అన్నారు. మా ఆవేదన అర్థం చేసుకున్నారు.. పచ్చని సంసారాల్లో మద్యం చిచ్చురేపుతోంది. నిన్నటి వరకూ రోడ్ల పక్కన ఉన్న మద్యం దుకాణాలు ఇప్పుడు ఇళ్ల మధ్యకు వచ్చాయి. ఇళ్ల మధ్య షాపులు వద్దంటే కేసులతో భయపెడుతున్నారు. బెల్టు దుకాణాలను నిరోధిస్తానని చెప్పిన చంద్రబాబు మాట తప్పారు. మా ఆవేదనను అర్థం చేసుకున్న జగన్ దశల వారీగా మద్యం నిషేధిస్తానని ఇచ్చిన హామీ చెప్పలేని ఆనందాన్ని నింపింది. కాళ్ల నొప్పులు ఉన్నా రాజన్న బిడ్డను చూసేందుకే వచ్చాం. చంద్రబాబు మూడేళ్ల పాలనలో పచ్చ చొక్కా తొడిగిన వారు దోచుకుతిన్నారు. ఎన్నికల్లో వారికి బుద్ధి చెబుతాం. – భీంరెడ్డి జయలక్ష్మి, నూతక్కి, గుంటూరు జిల్లా ఇంతకంటే ఏం కావాలి? చంద్రబాబు వస్తే డ్వాక్రా రుణాలు మాఫీ అన్నాడు. కానీ రూ.10 వేలు కూడా ఇవ్వలేదు. ప్రతి మహిళను లక్షాధికారి చేస్తానన్న హామీని తుంగలోతొక్కాడు. వైఎస్సార్ సీపీ అధినేత తొమ్మది ప«థకాల్లో వైఎస్సార్ ఆసరా అద్భుతమైన పథకం. ప్రతి మహిళకు వడ్డీలేని రుణాలు అందించి వారికి ఆర్థిక తోడ్పాటు ఇస్తానన్నాడు. ఇంతకంటే ఏం కావాలి? రెండేళ్లుగా డ్వాక్రా మహిళలకు బ్యాంకర్లు రుణాలు కూడా ఇవ్వలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి బతికుంటే మా బతుకులు బాగుండేవి. ఆయన రాజ్యం రావాలంటే జగన్ సీఎం కావాలి. అప్పుడే మాకు న్యాయం జరుగుతుంది. – పి.రంగమ్మ, కోనరాజుపేట, తూర్పుగోదావరి జిల్లా జగన్ సీఎం కావడం తథ్యం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కన్పించిన కళ వైఎస్సార్ సీపీ జాతీయ ప్లీనరీలో కన్పిస్తోంది. ఈ జనాన్ని చూస్తుంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావడం తథ్యం. ఎవరినీ డబ్బులిచ్చి జనాన్ని తరలించలేదు. అందరూ స్వచ్ఛందంగా వచ్చిన వారే. వైఎస్ జగన్ ప్రకటించిన తొమ్మది సంక్షేమ పథకాలు.. ఆయన ఆదర్శమైన పాలన ఎలా ఉంటుందో చెప్పేందుకు నిదర్శనాలు. ఇప్పుడు అందరి లక్ష్యం జగన్ సీఎం కావడమే. – బొక్కా వెంకటలక్ష్మి, వెదురేశ్వరం, రావులపాలెం మండలం, తూర్పుగోదావరి జిల్లా రైతులకిక మంచి రోజులు నా వయస్సు 75 ఏళ్లు. కాళ్లు నొప్పులు వచ్చాయి. నడవలేని పరిస్థితి. జగన్మోహన్రెడ్డిని చూసేందుకే శరీరంలో సత్తువ తెచ్చుకొని ప్లీనరీకి వచ్చా. చంద్రబాబు రైతుల్ని మోసం చేశాడు. రుణమాఫీ పేరుతో దగా చేశాడు. ఆయన మాటలు నమ్మి రుణాలు కట్టకపోవడంతో బ్యాంకర్లు నోటీసులు ఇచ్చారు. మా బిడ్డలూ రైతులే. వారు పడే కష్టాలు మరెవరూ పడకూడదు. అందుకే రైతుకు న్యాయం జరిగేలా రాజన్న బిడ్డ మంచిగా ఆలోచించి ఏటా పెట్టుబడి ఇస్తానన్నాడు. ఇంతకంటే ఆనందం ఏముంటుంది? – జి.సోమసుందర్, ద్రాక్షారామం, తూర్పుగోదావరి జిల్లా పింఛన్‌దారులకు పండుగే నేను దివ్వాంగురాలిని. వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసేందుకు ఇతరుల సాయంతో ప్లీనరీకి వచ్చా. దివంగత నేత వైఎస్సార్ వల్ల లబ్ధిపొందాం. ఆయన తనయుడుగా జగన్ అంటే ఎనలేని అభిమానం. పింఛన్ సొమ్ము రూ.2 వేలకు పెంచుతానని జగన్ హామీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఆ పింఛన్ సొమ్ముతో నెలంతా గడుస్తుంది. పండుగలాంటి ప్రకటన ఇది. – మొఘల్ షాలిబేగ్, డోన్, కర్నూటు జిల్లా