తప్పకుండా వస్తాం తప్పులన్నీ సరిచేస్తాం | YS Jaganmohan Reddy assured to the vamsadhara residence | Sakshi
Sakshi News home page

తప్పకుండా వస్తాం తప్పులన్నీ సరిచేస్తాం

Published Sat, May 20 2017 1:30 AM | Last Updated on Tue, May 29 2018 4:37 PM

తప్పకుండా వస్తాం తప్పులన్నీ సరిచేస్తాం - Sakshi

తప్పకుండా వస్తాం తప్పులన్నీ సరిచేస్తాం

వంశధార నిర్వాసితులకు ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా
- 2013 చట్టం ప్రకారం అందరికీ న్యాయం చేస్తాం..
- వైఎస్‌ హయాంలోనే వంశధార పనులు 90శాతం పూర్తి
- నిర్వాసితులందరికీ వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది..
- ఏడాదిన్నరలో వచ్చేది మనందరి ప్రభుత్వమే.. ధైర్యంగా ఉండండి


సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘‘వంశధార ఫేజ్‌–2, స్టేజ్‌–2 ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి టీడీపీ ప్రభుత్వం మూడేళ్లలో చేసిందేమీ లేదు. తన బినామీలుగా ఉన్న కాంట్రాక్టర్ల కోసం నిర్మాణ వ్యయం పెంచుకొని 30 శాతం కమిషన్లు దండుకో వడం తప్ప. లక్షలాది మంది రైతుల విశాల ప్రయోజ నాల కోసం నిర్వాసితులు చేసిన త్యాగం వెలకట్టలేని ది. అధైర్య పడవద్దు. చంద్రబాబు పాలన ఎంతో కాలం కొనసాగదు. మరో ఏడాదీ ఏడాదిన్నరలోగా మన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం వస్తుంది. భూసేకరణ చట్టం –2013 ప్రకారం వంశధార నిర్వాసిత కుటుంబాలన్నింటికీ పూర్తి న్యాయం జరిగేలా చేద్దాం.

ఈ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులన్నీ సరిచేస్తాం. అందరికీ అండగా నిలబడతాం’’  అని  శ్రీకాకుళం జిల్లా హిరమండలం లో శుక్రవారం సాయంత్రం జరిగిన ‘వంశధార నిర్వా సితులతో ముఖాముఖి’ కార్యక్రమంలో ప్రతి పక్షనేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం జగన్‌ శుక్రవారం ఉదయం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు రణస్థలం వచ్చారు. సాయంత్రం ఆరు గంటలకు హిరమండలంలో వరలక్ష్మి థియేటర్‌ వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకున్నారు. వంశధార నిర్వాసితులతో నిర్వహిం చిన ముఖాముఖిలో జగన్‌ వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..

కమీషన్లు దండుకోవడం కోసమే..
‘‘జిల్లాను సస్యశ్యామలం చేయడానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా వంశధార ప్రాజెక్టును రూ.934 కోట్లతో నిర్మించేందుకు సంకల్పించారు. ఆ మహానేత హయాంలోనే ప్రాజెక్టు పనులను దాదాపుగా 90 శాతం వరకు పూర్తి చేశారు. మిగిలిన పది శాతం పనులు సుమారు రూ.53 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యేవి. ఏ ముఖ్యమంత్రికైనా రైతులంటే కొంచెం ప్రేమ ఉన్నా ఒక్క ఏడాదిలోనే ఈ ప్రాజెక్టు పూర్తిచేసేవారు.  కానీ మన ముఖ్యమంత్రికి మాత్రం రైతుల మీద ప్రేమ లేదు. ఆయనకు కాంట్రాక్టర్ల మీద మాత్రం వ్యామోహం ఉంది.  అందుకే ఈపీసీ విధానంతో పూర్తి స్థాయిగా పనులు పూర్తి చేయాల్సిన కాంట్రాక్టర్‌కు మేలు జరిగేలా వ్యవహరించారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంచనా వ్యయాన్ని ఏకంగా 400 కోట్ల రూపాయలకు చంద్రబాబు పెంచేశారు.

ఆయన అధికారంలోకి వచ్చేసరికి వంశధార ప్రాజెక్టు పనులకు రూ.875 కోట్లు ఖర్చు కాగా, కేవలం 53 కోట్ల పనులు మాత్రమే మిగిలాయి. ఈపీసీ విధానం ద్వారా పూర్తి స్థాయిగా ఖచ్చితంగా పనులు చేయాల్సిన కాంట్రాక్టర్‌ ఈ పది శాతం పనులను వదిలేసినప్పుడు ఆ కాంట్రాక్టర్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలి. కేసులు నమోదు చేయించాల్సి ఉంది. అయితే అలా కాకుండా...ఈ పనులను తన అనుయాయుడు, రాజ్యసభ ఎంపి సిఎం రమేష్‌కు ఇప్పించారు.  అలాగే ఈ కాంట్రాక్ట్‌ పనుల అంచనా లను భారీగా పెంచి లాభాలు తెచ్చేలా ప్రత్యేక జీవో కూడా జారీ చేసారు. ఈ వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు ఓ వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తే అన్ని ప్రా జెక్టులు పూర్తయ్యేవి కదా...! ఈ జిల్లాలో వంశధార, తోటపల్లి ప్రాజెక్టులు ఎవరైనా చేసారా.. అంటే అది కేవలం దివంగత నేత వైఎస్‌ఆర్‌ మాత్రమే.

యువతను బుజ్జగించడానికే ప్యాకేజీ..
గట్టిగా డిమాండ్‌ వస్తుండడంతో యూత్‌ ప్యాకేజీ అని యువతను బుజ్జగించడానికి ప్రయత్నిస్తూనే మరోవైపు అవకతవకలకు పాల్పడుతున్నారు. 2015 డిసెంబర్‌ 31 నాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఇంటి స్థలం ఇవ్వాలనేది ప్రభుత్వ హామీ. కానీ ఇల్లు లేదా ఇంటి స్థలం ఇవ్వలేమంటూ ఇపుడు రూ. 5 లక్షలు ఇస్తామని చెబుతున్నారు. రకరకాల షరతులతో అదీ అందరికీ దక్కకుండా చేస్తున్నారు. అసలు నిర్వాసితులకు ప్యాకేజీ ఇవ్వడానికి ఈ షరతులేమిటి? యూత్‌ లేకపోవడం ఆ కుటుంబాలు చేసిన నేరమా? యువత ధర్నాలు చేస్తారు కాబట్టి వాళ్లను మంచి చేసుకోవడానికి ఏదో ఇస్తామన్నారు గానీ అవి కూడా సరిగా ఇవ్వడం లేదు. మొత్తం 11 వేల నిర్వాసిత కుటుంబాలకు యూత్‌ ప్యాకేజీ అమలు చేయాలి.

నిర్వాసితులకు పూర్తి స్థాయి న్యాయం చేస్తా..
వంశధార ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలు ప్రత్యక్షంగా 19, పాక్షికంగా 14 గ్రామాల్లో మొత్తం 11 వేల మంది బాధితులున్నారు. గత పదేళ్ల క్రితం ఎకరా భూమికి లక్షో, లక్షా ఇరవై వేల రూపాయలే ఇచ్చి వదిలేసారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయండని ప్రభుత్వాన్ని నిర్వాసితులు డిమాండ్‌ చేస్తుంటే మాత్రం పోలీసులు, అధికారులతో బెదిరింపులకు దిగుతున్నారు. జిల్లాలో కొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్రం నిర్మాణానికి భూసేకరణలో భాగంగా ఎకరాకు రూ.18 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే, అదే జిల్లాలో ఉన్న వంశధార నిర్వాసితులకు మాత్రం ఈ విధానం, చట్టం అమలు చేయడం లేదు. గట్టిగా డిమాండ్‌ వస్తుండడంతో యూత్‌ ప్యాకేజీ అని యువతను బుజ్జగించడానికి ప్రయత్నిస్తూనే మరోవైపు అవకతవకలకు పాల్పడుతున్నారు.

కేవలం అధికార పార్టీ నేతలు, జన్మభూమి కమిటీల సిఫారసులున్న వారికి మాత్రమే ప్యాకేజిలు అందేలా చేస్తున్నారు. అందులో కూడా ఎమ్మెల్యేకి కూడా కమీషన్‌ ఇవ్వాలి. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు వస్తాయి. ఈసారి ఖచ్చితంగా మన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. రాగానే ఈ ప్రాజెక్టు నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పూర్తి స్థాయి న్యాయం చేస్తాం. ధైర్యంగా ఉండండి. మరో ఏడాదిన్నర లోగానే ఎన్నికలు వస్తాయి. మీ అందరి ఉసురుతో టీడీపీ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసి పోతుంది’’ అని జగన్‌మోహన్‌రెడ్డి నిర్వాసితులకు భరోసా ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement