నీరసంగానే ఉన్న జగన్ | ys jaganmohan reddy in nims hospital | Sakshi
Sakshi News home page

నీరసంగానే ఉన్న జగన్

Published Sun, Sep 1 2013 8:23 AM | Last Updated on Wed, Aug 8 2018 5:51 PM

నీరసంగానే ఉన్న జగన్ - Sakshi

నీరసంగానే ఉన్న జగన్

నిమ్స్లో ఉన్న వైఎస్ జగన్కు ఈ ఉదయం 7 గంటల ప్రాంతంలో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆయనకు ఇంకా ఐవీ ప్లూయిడ్స్ ఎక్కిస్తున్నట్టు సమచారం. జగన్ ఇంకా నీరసంగా ఉన్నట్టు తెలుస్తోంది. కొద్దిసేపట్లో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు.

మరోవైపు జగన్ సతీమణి వైఎస్ భారతి ఈ ఉదయం 8 గంటలకు నిమ్స్ చేరుకున్నారు. నిమ్స్ ఆస్పత్రిలో ఉన్నంతకాలం రోజూ 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జగన్తో ఉండేందుకు భారతికి సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే.

అన్ని ప్రాంతాల వారికీ సమన్యాయం చేయాలని, అలా చేయలేకుంటే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్‌తో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో నిమ్స్ ఆసుపత్రి వైద్యులు శనివారం ఆయనకు బలవంతంగా ఫ్లూయిడ్స్(గ్లూకోజ్) ఎక్కించారు. దీంతో వారం రోజులుగా ఆయన చేస్తున్న నిరాహార దీక్షను భగ్నం చేసినట్లయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement