నిమ్స్ నుంచి వైఎస్ జగన్ డిశ్చార్జ్ | YS Jagan Mohan reddy discharged from NIMS hospital | Sakshi
Sakshi News home page

నిమ్స్ నుంచి వైఎస్ జగన్ డిశ్చార్జ్

Published Sat, Oct 12 2013 10:12 AM | Last Updated on Wed, Aug 8 2018 5:51 PM

నిమ్స్ నుంచి వైఎస్ జగన్ డిశ్చార్జ్ - Sakshi

నిమ్స్ నుంచి వైఎస్ జగన్ డిశ్చార్జ్

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శనివారం ఉదయం నిమ్స్‌ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ సందర్భంగా జగన్‌ను చూసేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో నిమ్స్కు తరలివచ్చారు. జై జగన్‌  అంటూ నినాదాలతో హోరెత్తించారు.  జగన్ సతీమణి వైఎస్ భారతి, పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పలువురు నిమ్స్కు వచ్చారు.

కీటోన్స్‌ మినహా... చక్కెరస్థాయి తదితరాలన్నీ సాధారణస్థాయికి వచ్చినట్టు  వైద్యపరీక్షల్లో తేలటంతో వైద్యులు...జగన్ను డిశ్చార్జ్‌ చేశారు.  కీటోన్స్‌ సాధారణంగా జీరో శాతం ఉండాలని, ఈ స్థాయికి చేరుకునేందుకు మరో రెండు, మూడురోజులు పట్టే అవకాశముందని వైద్యులు శనివారం తెలిపారు. మూడు రోజుల పాటు విశ్రాంతి  తీసుకోవాలని సూచించారు.

సమైక్యాంధ్ర డిమాండ్‌తో  ఐదు రోజుల పాటు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన జగన్‌ ఆరోగ్యం క్షీణించటంతో ఈనెల 9న అర్ధరాత్రి పోలీసులు బలవంతంగా నిమ్స్‌కు తరలించారు. అయితే జగన్‌ తీవ్రంగా ప్రతిఘటించినా వైద్యులు బలవంతంగా  ఫ్లూయిడ్స్‌ ఎక్కించారు.  ఆయన ఎంత ప్రతిఘటించినా పోలీసులు, వైద్యులు కలసి జగన్‌ దీక్షను భగ్నం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement