వైఎస్ జగన్కు ఇంటి భోజనానికి కోర్టు అనుమతి
హైదరాబాద్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంటి భోజనం తీసుకునేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఇంటి భోజనం తీసుకోవాలని నిమ్స్ వైద్యుల సూచన మేరకు ఆయన సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. దాంతో జగన్ నాలుగు వారాల పాటు ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు న్యాయస్థానం మంగళవారం అనుమతి ఇచ్చింది.
అన్ని ప్రాంతాల వారికీ సమన్యాయం చేయాలని, అలా చేయలేకుంటే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్‌తో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చంచల్ గూడ జైల్లో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో నిమ్స్ ఆసుపత్రి వైద్యులు శనివారం ఆయనకు బలవంతంగా ఫ్లూయిడ్స్ (గ్లూకోజ్) ఎక్కించిన సంగతి తెలిసిందే. అయితే జగన్ ఆరోగ్యం కోలుకునేందుకు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచించారు.