iv fluids
-
ముద్రగడకు ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తున్నాం
ఆయన డిమాండ్లకు ప్రభుత్వం సానుకూల స్పందన తూర్పుగోదావరి కలెక్టర్, విశాఖ రేంజి డీఐజీల వెల్లడి రాజమండ్రి కాపు రిజర్వేషన్లు, తుని ఘటనలో అరెస్టు చేసినవారిని విడుదల చేయాలన్న డిమాండ్లతో ఏడు రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసిన ముద్రగడ పద్మనాభానికి ప్రస్తుతం ఐవీ ఫ్లూయిడ్లు ఇస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్, విశాఖ రేంజి డీఐజీ శ్రీకాంత్ మీడియాకు తెలిపారు. ప్రభుత్వ సూచనల మేరకు ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరిపామని, తుని ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయన కోరారని, అందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని కలెక్టర్ అరుణ్ కుమార్, డీఐజీ శ్రీకాంత్ తెలిపారు. ఇప్పటివరకు తుని ఘటనలో అరెస్టు చేసిన 13 మందికి బెయిల్ ఇప్పించేందుకు ప్రభుత్వం న్యాయ నిపుణులను సంప్రదిస్తోందని అన్నారు. అయితే ఈ విషయమై కాపు జేఏసీ వైపు నుంచి గానీ, ముద్రగడ కుటుంబ సభ్యుల వైపు నుంచి గానీ ఎలాంటి సమాచారం లేదు. -
నీరసంగానే ఉన్న జగన్
నిమ్స్‌లో ఉన్న వైఎస్ జగన్‌కు ఈ ఉదయం 7 గంటల ప్రాంతంలో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆయనకు ఇంకా ఐవీ ప్లూయిడ్స్ ఎక్కిస్తున్నట్టు సమచారం. జగన్ ఇంకా నీరసంగా ఉన్నట్టు తెలుస్తోంది. కొద్దిసేపట్లో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు. మరోవైపు జగన్ సతీమణి వైఎస్ భారతి ఈ ఉదయం 8 గంటలకు నిమ్స్ చేరుకున్నారు. నిమ్స్ ఆస్పత్రిలో ఉన్నంతకాలం రోజూ 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జగన్‌తో ఉండేందుకు భారతికి సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అన్ని ప్రాంతాల వారికీ సమన్యాయం చేయాలని, అలా చేయలేకుంటే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్‌తో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో నిమ్స్ ఆసుపత్రి వైద్యులు శనివారం ఆయనకు బలవంతంగా ఫ్లూయిడ్స్(గ్లూకోజ్) ఎక్కించారు. దీంతో వారం రోజులుగా ఆయన చేస్తున్న నిరాహార దీక్షను భగ్నం చేసినట్లయింది.