చిత్తూరు జిల్లాలో రెండో రోజు జగన్ పర్యటన ప్రారంభం | YS Jaganmohan Reddy Samaikya sankharavam tour begins 2nd day in Chittor district | Sakshi
Sakshi News home page

చిత్తూరు జిల్లాలో రెండో రోజు జగన్ పర్యటన ప్రారంభం

Published Sun, Dec 1 2013 10:44 AM | Last Updated on Mon, Aug 13 2018 3:11 PM

చిత్తూరు జిల్లాలో రెండో రోజు జగన్ పర్యటన ప్రారంభం - Sakshi

చిత్తూరు జిల్లాలో రెండో రోజు జగన్ పర్యటన ప్రారంభం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు, సమైక్య శంఖారావం యాత్ర రెండో రోజు చిత్తూరు జిల్లాలో ప్రారంభమైంది. ఆదివారం ఉదయం శెట్టిపల్లి మెడికల్ కాలేజీ సెంటర్ నుంచి జగన్ పర్యటన ఆరంభమైంది.

శెటిపల్లె, పోడూరు, కడపల్లె, కనుమలదొడ్డి, తమిశల మీదుగా శాంతిపురం చేరుకుని అక్కడ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని జగన్ ఆవిష్కరిస్తారు. తర్వాత మఠం, గుండశెట్టిపల్లె, నాయనపల్లె, రాజుపేట, మిట్టపల్లె మీదుగా రామకుప్పం చేరుకుంటారు. అక్కడ వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఎం.సముద్రం, బియ్యపు రెడ్డిపల్లె కాలనీ, అన్నవరం, కరకుంట, గంధమాకుల పల్లె మీదుగా సాయంత్రం 4 గంటలకు వి.కోట చేరుకుని సభలో ప్రసంగిస్తారు. అనంతరం దొడ్డిపల్లె, మార్నేపల్లె, మద్దికాల, కృష్ణాపురం, కొమ్మర మడుగులో జగన్ రోడ్ షో నిర్వహిస్తారు.

సమైక్యాంధ్ర కోసం జగన్ సమైక్య శంఖారావం యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. తొలిరోజు శనివారం కుప్పంలో జరిగిన భారీ బహిరంగం సభలో పాల్గొన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో జగన్కు అపూర్వ స్వాగతం లభించింది. పార్టీ కార్యకర్తలు, సమైక్యవాదులు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement