Samaikya sankharavam tour
-
జగన్‌కు మెడికల్ విద్యార్థుల మద్దతు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం యాత్రకు విశేష స్పందన వస్తోంది. అన్ని వర్గాల ప్రజలు, యువకులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు తరలివచ్చి మద్దతు తెలియజేస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న జగన్‌ను మెడికల్ కాలేజీ విద్యార్థులు కలసి సంపూర్ణ మద్దతు తెలిపారు. సమైక్యాంధ్ర కోసం జగన్ చేస్తున్న పోరాటాన్ని వారు ప్రశంసించారు. రాష్ట్రం విడిపోతే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యల్ని జగన్‌కు వివరించామని, ఆయన ఓపిగ్గా విన్నారని విద్యార్థులు చెప్పారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విద్యార్థుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పథకాలు సక్రమంగా అమలు కావాలన్నా, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నా జగన్ అధికారంలోకి రావాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని విద్యార్థులు చెప్పారు. సమైక్యాంధ్ర కోసం జగన్ సమైక్య శంఖారావం యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. తొలిరోజు శనివారం కుప్పంలో జరిగిన భారీ బహిరంగం సభలో పాల్గొన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో జగన్‌కు అపూర్వ స్వాగతం లభించింది. పార్టీ కార్యకర్తలు, సమైక్యవాదులు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు పలికారు. -
చిత్తూరు జిల్లాలో రెండో రోజు జగన్ పర్యటన ప్రారంభం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు, సమైక్య శంఖారావం యాత్ర రెండో రోజు చిత్తూరు జిల్లాలో ప్రారంభమైంది. ఆదివారం ఉదయం శెట్టిపల్లి మెడికల్ కాలేజీ సెంటర్ నుంచి జగన్ పర్యటన ఆరంభమైంది. శెటిపల్లె, పోడూరు, కడపల్లె, కనుమలదొడ్డి, తమిశల మీదుగా శాంతిపురం చేరుకుని అక్కడ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని జగన్ ఆవిష్కరిస్తారు. తర్వాత మఠం, గుండశెట్టిపల్లె, నాయనపల్లె, రాజుపేట, మిట్టపల్లె మీదుగా రామకుప్పం చేరుకుంటారు. అక్కడ వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఎం.సముద్రం, బియ్యపు రెడ్డిపల్లె కాలనీ, అన్నవరం, కరకుంట, గంధమాకుల పల్లె మీదుగా సాయంత్రం 4 గంటలకు వి.కోట చేరుకుని సభలో ప్రసంగిస్తారు. అనంతరం దొడ్డిపల్లె, మార్నేపల్లె, మద్దికాల, కృష్ణాపురం, కొమ్మర మడుగులో జగన్ రోడ్ షో నిర్వహిస్తారు. సమైక్యాంధ్ర కోసం జగన్ సమైక్య శంఖారావం యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. తొలిరోజు శనివారం కుప్పంలో జరిగిన భారీ బహిరంగం సభలో పాల్గొన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో జగన్‌కు అపూర్వ స్వాగతం లభించింది. పార్టీ కార్యకర్తలు, సమైక్యవాదులు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు పలికారు. -
కుప్పం నుంచి వైఎస్ జగన్ `సమైక్య శంఖారావం`
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగే బహిరంగ సభ ద్వారా సమైక్య శంఖారావం పూరించనున్నారు. ఆయన శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లి, అక్కడ్నుంచి కుప్పం చేరుకుంటారు. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి శుక్రవారం అనుమతి మంజూరు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు కుప్పంలో జరిగే బహిరంగ సభ నుంచి జగన్ సమైక్య శంఖారావం ప్రారంభించనున్నారు. ఇటీవల ప్రతిపక్ష నేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన సమయంలో ఆశించిన మేరకు జనం నుంచి స్పందన రాని నేపథ్యంలో జగన్ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వైఎస్ మరణవార్త విని అసువులు బాసిన వారి కుటుంబాలను పరామర్శించడానికి గతంలో ఓదార్పు యాత్ర చేసిన జగన్మోహన్రెడ్డి.. చిత్తూరులో ఈ యాత్ర చేయలేదు. ఇప్పుడు సమైక్య శంఖారావంతోపాటు ఓదార్పు యాత్ర కూడా నిర్వహించనున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు జగన్ కుప్పం నియోజకవర్గంలోని పైపాళ్యం చేరుకుంటారు. అక్కడ వైఎస్ మరణవార్త విని గుండెపోటుతో మరణించిన వెంకటేష్ కుటుంబాన్ని ఓదార్చుతారు. తర్వాత ఎడుంగపల్లెలో, మల్లానూరు క్రాస్‌లో మహానేత విగ్రహాలను ఆవిష్కరిస్తారు. 2 గంటలకు కుప్పం చేరుకుని బస్డాండ్ కూడలిలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం అదే ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. సాయంత్రానికి గుడుపల్లె మండలం కంచిబందార్లపల్లెకు చేరుకుని లక్ష్మి కుటుంబాన్ని ఓదార్చుతారు. -
రేపటి నుంచి జగన్ సమైక్య శంఖారావం
-
రేపటి నుంచి జగన్ సమైక్య శంఖారావం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సమైక్య శంఖారావం యాత్ర చిత్తూరు జిల్లాలో శనివారం నుంచి ప్రారంభంకానుంది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం జిల్లా వరకూ సమైక్య శంఖారావం సభలు నిర్వహించడంతో పాటు వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబ సభ్యులను కూడా జగన్ ఓదారుస్తారు. 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు జగన్ కుప్పం నియోజకవర్గంలోని పైపాలెం గ్రామానికి చేరుకుని అక్కడ వెంకటేష్ కుటుంబాన్ని ఓదారుస్తారు. అనంతరం కుప్పం చేరుకుని మధ్యాహ్నం 2 గంటలకు బస్టాండ్ సెంటర్లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తరువాత కంచి బందార్లపల్లె గ్రామానికి చేరుకుని అక్కడ లక్ష్మి కుటుంబ సభ్యులను ఓదారుస్తారు. రాత్రికి కుప్పంలో బస చేస్తారని వైఎస్సార్ సీపీ కార్యక్రమాల కమిటీ రాష్ట్ర కన్వీనర్ తలశిల రఘురాం ఒక ప్రకటనలో తెలియజేశారు. బెంగళూరు మీదుగా కుప్పం వెళ్లేందుకు అనుమతించండి చిత్తూరు జిల్లా కుప్పంలో ఈనెల 30న నిర్వహించనున్న ‘సమైక్య శంఖారావం’ సభలో పాల్గొనే నిమిత్తం బెంగళూరు మీదుగా వెళ్లేందుకు అనుమతించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు. అలాగే డిసెంబర్ 2న కుప్పం నుంచి బెంగళూరు మీదుగా హైదరాబాద్‌కు తిరిగి వచ్చేందుకూ అనుమతించాలని అభ్యర్థించారు. ఈ మేరకు జగన్ తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి గురువారం పిటిషన్ దాఖలు చేశారు. విమానంలో బెంగళూరు చేరుకొని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కుప్పం వెళ్లాల్సి ఉందని, ఈ దృష్ట్యా బెయిల్ షరతును సడలించాలని కోరారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి... సీబీఐ అభిప్రాయాన్ని కోరుతూ విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా, వృత్తిపరమైన కార్యకలాపాల నిమిత్తం డిసెంబర్ నుంచి మార్చి నెల వరకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పాటు కర్ణాటక, తమిళనాడు వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి కూడా సీబీఐ ప్రత్యేక కోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సీబీఐ అభిప్రాయాన్ని కోరుతూ తదుపరి విచారణను న్యాయమూర్తి డిసెంబర్ 2కు వాయిదా వేశారు. -
కుప్పం నుంచి శ్రీకారం...