జగన్కు మెడికల్ విద్యార్థుల మద్దతు | Medical students support to YS Jaganmohan Reddy Samaikya sankharavam tour | Sakshi
Sakshi News home page

జగన్కు మెడికల్ విద్యార్థుల మద్దతు

Published Sun, Dec 1 2013 1:29 PM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

జగన్కు మెడికల్ విద్యార్థుల మద్దతు - Sakshi

జగన్కు మెడికల్ విద్యార్థుల మద్దతు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం యాత్రకు విశేష స్పందన వస్తోంది. అన్ని వర్గాల ప్రజలు, యువకులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు తరలివచ్చి మద్దతు తెలియజేస్తున్నారు.

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న జగన్ను మెడికల్ కాలేజీ విద్యార్థులు కలసి సంపూర్ణ మద్దతు తెలిపారు. సమైక్యాంధ్ర కోసం జగన్ చేస్తున్న పోరాటాన్ని వారు ప్రశంసించారు.  రాష్ట్రం విడిపోతే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యల్ని జగన్కు వివరించామని, ఆయన ఓపిగ్గా విన్నారని విద్యార్థులు చెప్పారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విద్యార్థుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పథకాలు సక్రమంగా అమలు కావాలన్నా, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నా జగన్ అధికారంలోకి రావాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని విద్యార్థులు చెప్పారు.

సమైక్యాంధ్ర కోసం జగన్ సమైక్య శంఖారావం యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. తొలిరోజు శనివారం కుప్పంలో జరిగిన భారీ బహిరంగం సభలో పాల్గొన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో జగన్కు అపూర్వ స్వాగతం లభించింది. పార్టీ కార్యకర్తలు, సమైక్యవాదులు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement