
బద్వేలు: ‘‘మాకు మరో ఏడాదిలో ఓటు హక్కు వస్తుంది.. మా కష్టాలు తీర్చేది జగనన్న మాత్రమే.. అందుకే వచ్చే ఎన్నికల్లో మేమంతా వైఎస్సార్‌సీపీకే ఓటేస్తాం’’ అని అక్షర జూనియర్ కళాశాల విద్యార్థినులు శపథం చేశారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా మంగళవారం వైఎస్ జగన్ వేంపల్లె అడ్డ రోడ్డు నుంచి బైపాస్ రోడ్డుకు వెళుతుండగా దారిలోని అక్షర జూనియర్ కళాశాల విద్యార్థినులు ఆయన్ను చూసేందుకు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ విద్యార్థినులను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం విద్యార్థినులు మాట్లాడుతూ వైఎస్ జగన్ సీఎం కావాలన్నదే తమ ఆశ అన్నారు.