వైఎస్సార్ కాంగ్రెస్ కమిటీల పునర్‌వ్యవస్థీకరణ | YSR Congress Committee reorganization | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ కాంగ్రెస్ కమిటీల పునర్‌వ్యవస్థీకరణ

Published Sat, Sep 6 2014 1:23 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

వైఎస్సార్ కాంగ్రెస్ కమిటీల పునర్‌వ్యవస్థీకరణ - Sakshi

వైఎస్సార్ కాంగ్రెస్ కమిటీల పునర్‌వ్యవస్థీకరణ

పార్టీ పటిష్టతకు జగన్ కసరత్తు
అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శులుగా సజ్జల, వైవీ నియామకం

 
హైదరాబాద్: పార్టీని పటిష్టం చేసే చర్యల్లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీలను పునర్‌వ్యవస్థీకరించారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఈ మేరకు ఆయా కమిటీల్లో అనేక మార్పులు చేర్పులు చేశారు. ఆయా ప్రాంతాలను, సామాజిక వర్గాలను దృష్టిలో ఉంచుకుని కమిటీల్లో ప్రాతినిధ్యం కల్పించారు. సాధారణ ఎన్నికలు ముగిసిన తరువాత వరుసగా జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించిన అనంతరం కొంత కాలంగా కసరత్తు చేసి ఈ కమిటీలను రూపుదిద్దినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ ఏర్పడిన తరువాత తొలిసారి తనకు అనుబంధంగా ఇద్దరు రాజకీయ కార్యదర్శులను జగన్ నియమించుకున్నారు. రాజకీయ వ్యవహారాల మండలి (పీఏసీ)ని విస్తరించడంతో పాటు కేంద్ర పాలక మండలి (సీజీసీ)లో అనేక మార్పులు చేశారు. సమర్థవంతంగా పార్టీ విధానాలను, వ్యవహారాలను వివరించడానికి వీలుగా అధికారప్రతినిధులు గానూ, టీవీ చర్చల్లో పాల్గొనే ప్రతినిధులుగానూ ఎంపిక చేశారు. ఇప్పటికే పార్టీ పలువురు ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులను నియమించింది. వీరికి అదనంగా శుక్రవారం మరికొందరిని పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులుగా నియమించారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వెలువడిన అధికార ప్రకటనలో పేర్కొన్న నియామకాల వివరాలు కింది విధంగా ఉన్నాయి.

 పార్టీ అధ్యక్షుడికి అనుబంధంగా రాజకీయ కార్యదర్శులు: వై.వి.సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలకూ కలిపి)  ప్రధాన కార్యదర్శులు: వై.ఎస్.అనిల్‌రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, జలీల్‌ఖాన్ (ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే)

కార్యదర్శులు: పిరియా సాయిరాజ్, లావు శ్రీకృష్ణదేవరాయలు, తానేటి వనిత, కంపా హనోకు, పాలవలస విక్రాంత్ (ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే) రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులు: డి.ఎ.సోమయాజులు, కొణతాల రామకృష్ణ, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎం.వి.మైసూరారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జ్యోతుల నెహ్రూ, భూమా నాగిరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, పినిపె విశ్వరూప్, కొడాలి నాని, అంబటి రాంబాబు, జలీల్‌ఖాన్, పేర్ని నాని, ఆదిమూలం సురేష్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలకూ కలిపి)  కేంద్ర పాలక మండలి (సీజీసీ) సభ్యులు: పెనుమత్స సాంబశివరాజు, వై.ఎస్.వివేకానందరెడ్డి, ఎస్.రఘురామిరెడ్డి, బుట్టా రేణుక, వరప్రసాదరావు, ధర్మాన ప్రసాదరావు, జి.ఎస్.రావు, పి.వి.కృష్ణబాబు, వాసిరెడ్డి పద్మ, ఎన్.లక్ష్మీపార్వతి, ఎడ్మ కృష్ణారెడ్డి, గట్టు రామచంద్రరావు, నల్లా సూర్యప్రకాశరావు, ఎన్.అమరనాథరెడ్డి, అయోధ్యరామిరెడ్డి, తోట చంద్రశేఖర్, బాలశౌరి, వంకా రవి, బొడ్డు భాస్కరరామారావు, గిడ్డి ఈశ్వరి (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలకూ కలిపి) అధికార ప్రతినిధులు: ధర్మాన ప్రసాదరావు, జ్యోతుల నెహ్రూ, మోపిదేవి వెంకటరమణారావు, ఆర్.కె.రోజా, భూమన కరుణాకర్‌రెడ్డి, అంబటి రాంబాబు, తమ్మినేని సీతారాం, కిడారి సర్వేశ్వరరావు, జలీల్‌ఖాన్, పేర్ని నాని, వాసిరెడ్డి పద్మ, కె.పార్థసారథి, ఆదిమూలం సురేష్, ఉప్పులేటి కల్పన, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కొడాలి నాని (ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే)

టీవీ చర్చల్లో పాల్గొనే పార్టీ ప్రతినిధులు: గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కోన రఘుపతి, రాజీవ్ కృష్ణ, జోగి రమేష్, ఎ.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మద్దాల రాజేశ్, గొట్టిపాటి రవికుమార్, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే)
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement