ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం | YSR Congress May win Andhra says India TV CNX Pre poll Survey | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం

Apr 8 2019 4:19 AM | Updated on Apr 16 2019 2:52 PM

YSR Congress May win Andhra says India TV CNX Pre poll Survey - Sakshi

వైఎస్సార్‌సీపీ 20 పార్లమెంట్‌ స్థానాల్లో ఘన విజయం సాధించి ప్రాంతీయ పార్టీల్లో మూడో అతి పెద్ద పార్టీగా నిలుస్తుందని ఎన్డీటీవీ అంచనా వేసింది.

సాక్షి, అమరావతి: కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో ప్రాంతీయ పార్టీలే కీలకం కానున్నాయని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. 106 ఎంపీ సీట్లలో విజయం సాధించడం ద్వారా ఢిల్లీ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నట్లు జాతీయ చానెల్‌ ఆదివారం అంచనా ఫలితాలను వెల్లడించింది. ఏపీలో 25 ఎంపీ సీట్లకుగానూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 20 పార్లమెంట్‌ స్థానాల్లో ఘన విజయం సాధించి ప్రాంతీయ పార్టీల్లో మూడో అతి పెద్ద పార్టీగా నిలుస్తుందని జాతీయ చానెల్‌ అంచనా వేసింది. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ 30, తమిళనాడులో డీఎంకే 25 ఎంపీ సీట్లలో విజయబావుటా ఎగురవేస్తాయని తెలిపింది. ఒడిశాలో బిజూ జనతాదళ్‌ 16 సీట్లు, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ 15 సీట్లు సాధించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో మొత్తం 106 ఎంపీ సీట్లతో ప్రాంతీయ పార్టీల మద్దతు కేంద్రానికి కీలకం కానుంది. (చదవండి: జాతీయ శక్తిగా వైఎస్‌ జగన్‌)

ఇతర సర్వేల్లోనూ అవే ఫలితాలు..!
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఎన్నికల అనంతరం ప్రబల శక్తిగా ఆవిర్భవించి దేశ రాజకీయాల్లో సైతం కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నట్లు పలు జాతీయ చానెళ్లు ఇప్పటికే తమ సర్వేల ద్వారా అంచనా వేయడం తెలిసిందే. ఏపీలో వైఎస్సార్‌సీపీ స్వీప్‌ చేస్తుందని, తిరుగులేని విజయం సాధించి లోక్‌సభలో నాలుగో అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని ఇండియా టీవీ సర్వేలో తేలింది. ప్రజలు స్పష్టంగా వైఎస్సార్‌సీపీ వైపే మొగ్గు చూపుతున్నారని పేర్కొంది. ఇతర జాతీయ ఛానళ్లు కూడా వైఎస్సార్‌సీపీ 20 – 22 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని తమ సర్వేల్లో వెల్లడైనట్లు ఇప్పటికే ప్రకటించాయి.

టైమ్స్‌ నౌ, సీఎన్‌ఎన్‌ న్యూస్‌ 18, ఇండియా టుడే తదితర జాతీయ చానెళ్లు వైఎస్‌ జగన్‌పై ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేశాయి. ప్రముఖ జర్నలిస్టులు రాజ్‌దీప్‌ సర్దేశాయి, బర్కాదత్, నావికా కుమార్‌ తదితరులు వైఎస్‌ జగన్‌తో సంభాషించి ఏపీతోపాటు దేశ రాజకీయాల్లో ఆయన అనుసరించనున్న వైఖరిని తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. అతి త్వరలోనే వైఎస్‌ జగన్‌ దేశ రాజకీయాల్లో పోషించనున్న కీలక పాత్రకు ఇవన్నీ సంకేతాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement