వైఎస్సార్‌సీపీలో 70 కుటుంబాల చేరిక
Published Mon, Sep 23 2013 3:11 AM | Last Updated on Fri, May 25 2018 9:10 PM
కె. ములగ (పార్వతీపురం రూరల్), న్యూస్‌లైన్ : ములగ పంచాయతీలోని కె. ములగ, ఎన్. ములగ గ్రామాలకు చెందిన 70 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. కె. ములగ గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు మడక రామ్మూర్తినాయుడు ఆధ్వర్యంలో వీరందరూ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్ పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా జమ్మాన మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పోరాడుతున్నది ఒక్క వైఎస్సార్‌సీపీయేనని స్పష్టం చేశారు. అంతేకాకుండా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు మాత్రమే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాలు చేశారని చెప్పారు. రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు తిప్పికొడతారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ చుక్క లక్ష్ముంనాయుడు, నాయకులు తీళ్ల పోలినాయుడు, అప్పలస్వామి, అక్కేన సత్యనారాయణ, పి. గోవిందరావు, నర్సింహనాయుడు, కె. రాంబాబు, జయంతి, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement