వైఎస్ఆర్ సీపీ ప్రచార షెడ్యూల్ విడుదల | ysr congress party election campaign shedule Released | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ ప్రచార షెడ్యూల్ విడుదల

Published Wed, Mar 12 2014 6:04 PM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

ysr congress party election campaign shedule Released

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, షర్మిల రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. వైఎస్ జగన్ ప్రచార పర్యటన ఈ నెల 14న నరసాపురంలో ప్రారంభమవుతుంది.

వైఎస్ విజయమ్మఈ నెల 16  అనంతపురం జిల్లా కదిరి నుంచి ప్రచారం ప్రారంభిస్తారు. షర్మిల ఈ నెల 17న నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పర్యటనను ఆరంభిస్తారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ ప్రోగ్రామ్స్‌ కోఆర్డినేటర్ తలశిల రఘరాం పర్యటన షెడ్యూల్‌ను విడుదల చేశారు.

వైఎస్ జగన్ ప్రచార పర్యటన వివరాలు :

మార్చి 14 నర్సాపురం నుంచి వైఎస్సార్ జనభేరి, సా 4. గంకు బహిరంగ సభ
15న ఉ 9 గ.కు పాలకొల్లులో 20 కి.మీ  రోడ్డు షో,  భీమవరంలో 20 కి.మీ రోడ్డు షో, తాడేపల్లిగూడెం, తణుకు జగన్ టూర్
16న ఉదయం 9 గ.కు కొవ్వూరులో రోడ్డు షో, సా. 5 గం.కు రాజమండ్రిలో బహిరంగ సభ
17న ఉ 9 గ.కు అమలాపురంలో రోడ్డు షో , మ. 1 గ.కు ముమ్మిడివరంలో రోడ్డు షో
సా. 5 గ.కు రామచంద్రాపురంలో రోడ్డు షో, బహిరంగ సభ, సా. 7 గ.కు మండపేటలలో వైఎస్ జగన్ రోడ్డు షో

 వైఎస్ విజయమ్మ ప్రచార పర్యటన వివరాలు:

అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వైఎస్ విజయమ్మ ప్రచారం
మార్చి 16న మ. 12 గ.కు కదిరిలో రో్డ్డు షో, సా. 4 గ.కు  పుట్టపర్తిలో రోడ్డు షో, సా. 6 గ.కు హిందూపురంలో బహిరంగ సభ
17న ఉ. 9 గ.కు  మడకశిరలో రోడ్డు షో, సా. 4 గ.కు ధర్మవరంలో రోడ్డు షో, సా. 6 గ.కు అనంతపురంలో బహిరంగ సభ
18న ఉ. 9 గ.కు కళ్యాణదుర్గంలో రోడ్డు షో, సా. 5 గ.కు రాయదుర్గంలో బహిరంగ సభ
20న ఉ. 9 గ.కు గుంతకల్ లో 98 కి. మీ  రోడ్డు షో, సా 4 గ.కు గుత్తిలో రోడ్డు షో, సా. 6 గ,కు పామిడిలో బహిరంగ సభ
21న ఉ 9 గ.కు తాడిపత్రిలో రోడ్డు షో, సా. 4 గ.కు బనగానపల్లెలో రోడ్డు షో, సా. 6 గ.కు ఆళ్లగడ్డలో బహిరంగ సభ
22న ఉ. 10 గ.కు నంద్యాలలో రోడ్డు షో, సా. 4 గ.కు ఆత్మకూరులో రోడ్డు షో, సా 6 గ.కు నందికొట్కూరులో బహిరంగ సభ
23న ఉ. 9 గ.కు డోన్ లో 80 కి.మీ రోడ్డు షో, ఆదోని, ఎమ్మిగనూరుల్లో రోడ్డు షో
కర్నూలు జిల్లా అనంతరం మార్చి 24 నుంచి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్న వైఎస్ విజయమ్మ
 

వైఎస్ షర్మిల ప్రచార పర్యటన వివరాలు :

నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వైఎస్ షర్మిల ప్రచారం
మార్చి 17న మధ్యాహ్నం 3 గంటలకు ఆత్మకూరులో వైఎస్ షర్మిల బహిరంగ సభ
18న  వెంకటగిరిలో ఉదయం 9 గం.కు బహిరంగ సభ, నాయుడుపేటలో రోడ్డు షో, సూళ్లూరుపేటలో బహిరంగ సభ
19న గూడురులో రోడ్డు షో, నెల్లూరులో బహిరంగ సభ
20న ఉదయం 9 గం.కు కావలిలో రోడ్డు షో,  మ. 2 గం.కు చీమకుర్తిలో 95 కి.మీ రోడ్డు షో, సా. 6 గ.కు చీరాలలో బహిరంగ సభ
21న ఉదయం 9 గం.కు అద్దంకిలో రోడ్డు షో, మ. 12 గం.కు కనిగిరిలో రోడ్డు షో, సా. 6 గం.కు గిద్దలూరులో బహిరంగ సభ
22న ఉ. 9 గ.కు  మార్కాపురంలో రోడ్డు షో

ప్రకాశం జిల్లా అనంతరం నల్లగొండ జిల్లాలో షర్మిల పర్యటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement