అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు దగాకోరు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, గుర్నాథరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, శ్రీనివాసులు మాట్లాడారు. ఈ సందర్బంగా చంద్రబాబుకు సిగ్గుంటే... ఎన్టీఆర్ వర్ధంతి అయిన ఈ రోజు సమైక్యవాదో, విభజన వాదో తన వైఖరిని స్పష్టం చేయాలి వారు డిమాండ్ చేశారు. చంద్రబాబు నోట సమైక్యమన్న మాట ఎందుకు రావడం లేందటూ మీడియా ఎదుట ప్రశ్నించారు.
అసెంబ్లీలో కాంగ్రెస్, టీడీపీలు కలిసి దౌర్భాగ్య రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. సమైక్యమనే ముసుగులో ఉన్న విభజన వాది శైలజానాథ్ టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, అందుకే ఆయన ఆ పార్టీని విమర్శించడం లేదన్నారు. సమైక్యసింహమని శైలజానాథ్ చెప్పుకుంటున్నారు, అలాంటి నేత ఇంటి చుట్టు ముళ్లకంచెలు... పోలీసుల పహారా ఎందుకుని శైలజానాథ్ను సూటిగా ప్రశ్నించారు. సభలో స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు.