జిల్లా కలెక్టర్పై వీరంగం సృష్టించిన వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణను అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగానికి చెందిన విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ సందర్బంగా వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దాంతో విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా పోలీసులకు వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగానికి చెందిన విద్యార్థుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ నెల్లూరు జిల్లా కలెక్టర్ పై చిందులు తొక్కారు. ఈ నేపథ్యంలో ఆ జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. దాంతో వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం గురువారం ఆందోళన చేపట్టింది.