venkatagiri mla
-
మొహం చాటేసిన టీడీపీ ఎమ్మెల్యే
-
మొహం చాటేసిన టీడీపీ ఎమ్మెల్యే
నెల్లూరు: వెంకటగిరి ఎమ్మెల్యే కరుగొండ్ల రామకృష్ణ ‘ఎల్లో ట్యాక్స్’ వ్యవహారం వెలుగులోకి రావడంతో అధికార టీడీపీ ఆత్మరక్షణలో పడింది. నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పార్టీ నేతలతో రోజంతా మంతనాలు జరిపారు. తర్వాత పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే రామకృష్ణ ప్రెస్ మీట్ ఉంటుందని మీడియాకు సమాచారం ఇచ్చారు. ముందుచెప్పినట్టు పార్టీ ఆఫీసులో కాకుండా హోటల్ విలేకరుల సమావేశం నిర్వహించారు. అయితే విలేకరుల సమావేశానికి రామకృష్ణ మొహం చాటేశారు. చివరకు మాంటెకార్లో కంపెనీ మాజీ ఉద్యోగి రామును మీడియా ముందుకు తీసుకొచ్చారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తంటాలు పడ్డాడు. ఫోన్ ఆడియోలో ఉన్న గొంతు తనదేనని ఒప్పుకున్నాడు. ఓబులవారిపల్లి-కృష్ణపట్నం రైల్వే లైన్ నిర్మాణం పనులకు రూ.5 కోట్లు ఇవ్వాలని ఎమ్మెల్యే రామకృష్ణ బెదిరించినట్టు మాంటెకార్లో కంపెనీ ప్రతినిధులు సోమవారం వెల్లడించారు. ఎమ్మెల్యే బెదిరింపుల ఆడియో సీడీలు మీడియాకు విడుదల చేశారు. ఎమ్మెల్యే దాష్టీకంపై రైల్వే మంత్రికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని వాపోయారు. రంగంలోకి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఎల్లో ట్యాక్స్ దందాపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగింది. ఓబులవారిపల్లి-కృష్ణపట్నం రైల్వే లైన్ నిర్మాణం పనులు నిలిచిపోవడంపై ఆరా తీసింది. ఎమ్మెల్యే రామకృష్ణ రూ. 5 కోట్ల లంచం డిమాండ్ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ వివరాలు సేకరించింది. మాంటెకార్లో కంపెనీ ప్రతినిధులతో ఇంటెలిజెన్స్ అధికారులు మాట్లాడినట్టు సమాచారం. -
బెయిల్ తీసుకున్న వెంకటగిరి ఎమ్మెల్యే
వెంకటగిరి ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు కె.రామకృష్ణ నెల్లూరు పట్టణ వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో బెయిల్ తీసుకున్నారు. రామకృష్ణపై నమోదు అయిన నాన్‌బెయిల్‌బుల్ కేసులో నగర పోలీసులు సెక్షన్లు మార్చారు. దాంతో ఆయన బెయిల్ తీసుకోవడం సులువైంది. నాన్ బెయిల్‌బుల్ కేసు నమోదైన ఎమ్మెల్యేకు బెయిల్ ఇచ్చారంటూ వైఎస్ఆర్ సీపీ నాయకలు పోలీసులను ప్రశ్నించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే సెక్షన్లు మార్చామని పోలీసులు వెల్లడించారు. -
అజ్ఞాతం వీడిన ఎమ్మెల్యే ... అరెస్ట్ చేయని పోలీసులు
పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే కె.రామకృష్ణ అజ్ఞాతం వీడారు. శనివారం ఆయన నెల్లూరు పట్టణం చేరుకున్నారు. అయితే రామకృష్ణ నెల్లూరు చేరుకున్నారన్న సమాచారం తెలిసిన ఆయన్ని అరెస్ట్ చేసేందుకు మాత్రం పోలీసులు జంకుతున్నారు. ఎమ్మెల్యే రామకృష్ణను వెంటనే అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పోలీసులను డిమాండ్ చేశారు. ఆయనపై నాన్‌బెయిల్‌బుల్ కేసు ఉన్న పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయకపోవడంపై వైఎస్ఆర్ సీపీ నేతలు పోలీసులపై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా జడ్పీ ఛైర్మన్ ఎన్నికలు స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో గత శనివారం ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. ఆ ఎన్నికకు జిల్లా కలెక్టర్ హాజరైయ్యారు. జడ్పీ ఛైర్మన్ ఎన్నికకు టీడీపీకి తగినంత సంఖ్య బలం లేదు. దాంతో జిల్లాలోని వెంకటగిరికి చెందిన అధికార టీడీపీ ఎమ్మెల్యే కె.రామకృష్ణ వీరంగం సృష్టించారు. కలెక్టర్‌పై నానాదుర్బిషలాడి.. అక్కడే ఉన్న మైక్‌ను విరిచేశారు. దాంతో ఆ ఎన్నిక రసభాసగా మారి వాయిదా పడింది. జెడ్పీ ఛైర్మన్ ఎన్నిక ఈ నెల 13న నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా కలెక్టర్‌పై ఎమ్మెల్యే వీరంగం సృష్టించడంపై రెవెన్యూ సిబ్బంది ఆగ్రహాం వ్యక్తం చేసి... ఎమ్మెల్యే రామకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఎమ్మెల్యే రామకృష్ణపై నాన్‌బెయిల్ కేసు నమోదు అయింది. ఈ నేపథ్యంలో రామకృష్ణ అజ్ఞాతంలోకి వెళ్లారు. రేపు నెల్లూరు జిల్లా ఛైర్మన్ ఎన్నికల జరగనుంది. దాంతో రామకృష్ణ మళ్లీ నెల్లూరు చేరుకున్నారు. ఇదిలా ఉండగా నెల్లూరు జిల్లాలో జడ్పీ ఛైర్మన్ ఎన్నిక సజావుగా జరిగేలా చూడాలంటూ నగరానికి చెందిన వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. దాంతో జిల్లా జడ్పీ ఛైర్మన్ ఎన్నికకు పరిశీలకుడిని పంపడంతో పాటు... ఎన్నికల ప్రక్రియ అంతా కెమెరాలో చిత్రీకరించాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
'టీడీపీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలి'
జిల్లా కలెక్టర్‌పై వీరంగం సృష్టించిన వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణను అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగానికి చెందిన విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ సందర్బంగా వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దాంతో విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగానికి చెందిన విద్యార్థుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ నెల్లూరు జిల్లా కలెక్టర్ పై చిందులు తొక్కారు. ఈ నేపథ్యంలో ఆ జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. దాంతో వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం గురువారం ఆందోళన చేపట్టింది. -
ఎమ్మెల్యే కురుగొండ్ల కోసం పోలీసుల గాలింపు
నెల్లూరు: జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా వీరంగం సృష్టించిన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించిన ఆయనపై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆదివారం నెల్లూరులోని ఆయన నివాసంలో గాలించారు. అయితే ఈ విషయం ముందే తెలుసుకున్న ఆయన అప్పటికే హైదరాబాద్ చేరుకోవడంతో పోలీసులు వెనుదిరిగారు. కేసు నమోదైన సమయంలో ఎమ్మెల్యే నెల్లూరులో ఉన్నా పట్టించుకోని పోలీసులు తీరా ఆయన హైదరాబాద్ వెళ్లిన 15 గంటల తర్వాత ఎమ్మెల్యే ఇంటికి వెళ్లడం గమనార్హం. జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా కురుగొండ్ల రామకృష్ణ దౌర్జన్యానికి దిగారు. కలెక్టర్ ఎదుట ఉన్న మైకును తోసివేసి, నామినేషన్, ప్రమాణ స్వీకార పత్రాలను చించివేశారు.