
అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్ సీపీ వాకౌట్
హైదరాబాద్ : ఐకేపీ యానిమేటర్ల అరెస్ట్కు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోమవారం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు శాసనసభాపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. బాబు వచ్చారు...జాబులు ఊడబీకారు అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిరుద్యోగులు..నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేస్తున్న యానిమేటర్లను రాత్రికి రాత్రి అరెస్ట్ చేశారని ఆయన మండిపడ్డారు.