IKP animators
-
ఐకేపీ యానిమేటర్ల అరెస్టు
-
ఐకేపీ యానిమేటర్లకు వైఎస్ జగన్ మద్దతు
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన జీతం బకాయిల కోసం ఆందోళన చేస్తున్న ఇందిరా క్రాంతి పథకం (ఐకేపీ) ఉద్యోగులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు ప్రకటించారు. పోలీసులు అరెస్ట్ చేసిన ఐకేపీ నాయకురాలు ధనలక్ష్మితో సోమవారం ఆయన ఫోన్ లో మాట్లాడారు. ఐకేపీ ఉద్యోగుల పోరాటానికి మద్దతు తెలిపారు. ప్రసుత్తం ఆమె బొల్లారం పోలీసు స్టేషన్ లో ఉన్నారు. కాగా, ఐకేపీ యానిమేటర్ల అరెస్ట్ ను నిరసిస్తూ శాసనసభ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసింది. ఐకేపీ యానిమేటర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసింది. ఛలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టిన ఐకేపీ యానిమేటర్లను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పలువురు నాయకులను అరెస్ట్ చేశారు. -
గుర్రాలతో తొక్కించిన బాబు...మళ్లీ అదే దమననీతి
-
గుర్రాలతో తొక్కించిన బాబు...మళ్లీ అదే దమననీతి
హైదరాబాద్ : కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే అంశంపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఐకేపీ యానిమేటర్ల అరెస్ట్‌కు నిరసనగా వైఎస్ఆర్ సీపీ సోమవారం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. అనంతరం ఎమ్మెల్యేలు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ ఐకేపీ యానిమేటర్లు వంద రోజులుగా నిరసన దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. హైదరాబాద్ ధర్నా చౌక్‌కు వస్తున్న యానిమేటర్లను ఎక్కడికక్కడే అరెస్ట్‌లు చేస్తూ ఎమర్జెన్సీని తలపించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. గతంలో అంగన్వాడీ మహిళలను గుర్రాలతో తొక్కించిన చంద్రబాబు సర్కార్ ...మళ్లీ అదే దమననీతిని కొనసాగిస్తుందన్నారు. బాబు వస్తే జాబు వస్తుంది అన్నారు కానీ..ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీ ఉన్నా భర్తీ చేయటం లేదన్నారు. ఇంటికో ఉద్యోగం అన్న హామీని ప్రభుత్వం విస్మరించిందని, దీంతో ఉద్యోగం లేక నిరుద్యోగులు, ఉన్న ఉద్యోగం కాపాడుకోవటం కోసం చిరుద్యోగులు భయపడుతున్నారన్నారు. ఉపాధి కోసం అన్నివర్గాల ప్రజలు రోడ్డెక్కుతున్నారని, దీంతో రాష్ట్రం ధర్నాంధ్రప్రదేశ్గా మారిపోయిందని, ఈ అంశంపై ప్రభుత్వ నిర్లక్ష్యపు వైఖరికి నిరసనగా సభ నుంచి వాకైట్ చేశామని ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సర్వేశ్వరరావు, వై. విశ్వేశ్వరరెడ్డి, ఐజయ్య, శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. -
అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్ సీపీ వాకౌట్
-
అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్ సీపీ వాకౌట్
హైదరాబాద్ : ఐకేపీ యానిమేటర్ల అరెస్ట్‌కు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోమవారం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు శాసనసభాపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. బాబు వచ్చారు...జాబులు ఊడబీకారు అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిరుద్యోగులు..నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేస్తున్న యానిమేటర్లను రాత్రికి రాత్రి అరెస్ట్ చేశారని ఆయన మండిపడ్డారు. -
ఐకేపీ యానిమేటర్లంటే బాబుకు చులకనా?
-
ఐకేపీ యానిమేటర్లంటే బాబుకు చులకనా?
ఇందిరా క్రాంతిపథం (ఐకేపీ) యానిమేటర్లను ఉద్దేశించి చంద్రబాబు హేళనగా మాట్లాడటం బాధాకరమని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. వాళ్లకు ఇచ్చేది కేవలం 2 వేల రూపాయల గౌరవ వేతనం మాత్రమేనని, వాళ్ల ఆవేదన, ఆక్రోశం చంద్రబాబుకు కనిపించడం లేదా అని ఆమె అడిగారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని, లేనిపక్షంలో వారికి నిరుద్యోగ భృతి ఇస్తామని కూడా చెప్పారని గుర్తుచేశారు. ఇప్పుడు 30 వేల మంది ఐకేపీ యానిమేటర్ల ఆందోళనపై చంద్రబాబు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వారికి మద్దతుగా తాము ఆందోళన చేస్తామని తెలిపారు. తమ పార్టీని ఉద్దేశించి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ నేత అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆమె ఆరోపించారు. పాలెం బస్సు దుర్ఘటన కేసు నుంచి తప్పించుకోడానికే మీరు చంద్రబాబు పంచన చేరిన విషయం నిజం కాదా అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ఏ శిక్ష నుంచి తప్పించుకోడానికి చంద్రబాబు కాళ్లు పట్టుకున్నారో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. -
వీవోఏలపై పోలీసుల లాఠీచార్జి
చిలకలపూడి (మచిలీపట్నం) : కలెక్టరేట్ రణరంగమైంది. తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనకు దిగిన ఐకేపీ యానిమేటర్ల(వీవోఏ)పై పోలీ సులు లాఠీ ఝళిపించారు. 48 గంటలుగా దీక్ష చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో కలెక్టరేట్ గేటు దాటి లోపలకు వెళ్లిన వారిని విచక్షణారహితంగా తోసివేశారు. మహిళలని కూడా చూడకుండా మగ పోలీసులే వీవోఏల్లోకి జొరబడి తోసివేసి, లాఠీచార్జ్ చేయడం గమనార్హం. ఈ ఘటనలో నలుగురు మహిళలు స్వల్పంగా గాయపడ్డారు. ఓవైపు వీవోఏల అరుపులు, మరో వైపు పోలీసుల బూతుపురాణంతో కలెక్టరేట్ మారుమోగింది. మహిలళపై లాఠీచార్జి చేసి వారిని బయటకు నెట్టివేసిన పోలీసులు దీక్ష కోసం ఏర్పాటు చేసిన టెంట్‌ను సైతం కూల్చివేశారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు కలెక్టరేట్‌లోకి వెళ్లనివ్వాలని కోరిన వీవోఏలను పోలీసులు రోప్ పార్టీతో అడ్డుకున్నారు. రోప్‌పార్టీ, పోలీసులను నెట్టివేసిన వీవోఏలు కలెక్టరేట్‌లోకి వెళ్లడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. దీంతో ఆగ్రహించిన వీవోఏలు ‘మీ అక్కచెల్లెళ్లు, భార్యలను ఇలాగే కొడతారా? మహిళా పోలీసులను తీసుకురాకుండా మగ పోలీసులే దాడికి పాల్పడతారా?’ అంటూ వీవోఏలు ఎదురు తిరి గారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్.సీహెచ్.శ్రీనివాస్‌ను పోలీసులు కాళ్లు, చేతులు పట్టుకుని వంద గజాల దూరం మేర తీసుకువెళ్లి అక్కడి నుంచి గూడూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీక్ష చేస్తున్న వీవోఏలను చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశారు. దీంతో వీవోఏలు ఎదురుతిరగటంతో తీవ్ర తోపులాట జరి గింది. ఈ తోపులాటలో మహిళలను కూడా చూడకుండా నెట్టివేయటంతో బొల్లి వెంకటలక్ష్మి స్పృహతప్పి పడిపోయింది. మరో వీవోఏ అలేఖ్య కాలు గ్రిల్లో ఇరుక్కుపోవటంతో ఆమె విలవిల్లాడింది. వీవోఏలు రజని, అన్నపూర్ణ గాయపడ్డారు. పరిస్థితి చేయిదాటడంతో ఓఎస్డీ వృషి కేశవరెడ్డి, బందరు డీఎస్పీ కె.శ్రీనివాసరావుతోపాటు పట్టణంలోని అన్ని పోలీస్స్టేషన్ల సీఐలు, ఎస్ఐలు, రిజర్వు పోలీసులు భాష్పావాయువు గోళాలు ప్రయోగించే పోలీసులు కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన వీవోఏలు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి మైక్‌లో పోలీసుల దౌర్జన్యం నశించాలి అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహం చెందిన బందరు డీఎస్పీ శ్రీనివాసరావు పని, పాటా లేదా అంటూ వారిపై విరుచుకపడి మైక్ లాగి దూరంగా విసిరేశారు. అయినప్పటికీ దీక్ష విరమించేది లేదని వీవోఏలు భీష్మించారు. వీవోఏలపై దాడి విషయం తెలుసుకున్న సీపీఎం పట్టణ కార్యదర్శి కొడాలి శర్మ, సీఐటీయూ అధ్యక్షుడు రమణ, పట్టణ కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం వీవోఏలు, పోలీసులతో మాట్లాడి పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నంచేశారు. డీఎస్పీ కలెక్టరేట్ బీ-సెక్షన్ సూపరింటెండెంట్ డి.కోటేశ్వరరావుకు వద్ద కొంత మంది వీవోఏలను తీసుకువచ్చి వారి సమస్యలను వివరించారు. అనంతరం గేటు బయట దీక్ష చేస్తున్న వారి వద్దకు వచ్చి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని హామీ ఇవ్వటంతో వారు దీక్ష విరమించారు. ధర్నాలో జిల్లా శ్రామిక మహిళా జిల్లా కన్వీనరు ఎన్.సీహెచ్.శ్రీనివాస్, వీవోఏల సంఘ జిల్లా గౌరవాధ్యక్షురాలు ఎ.కమల, ప్రధాన కార్యదర్శి ఎం.ఆదిలక్ష్మి, 39 మండలాల వీవోఏలు పాల్గొన్నారు. -
చంద్రబాబు సభ వద్ద ఆందోళన
విశాఖపట్నం: ఆరిపాకలో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న సభ వద్ద డ్వాక్రా మహిళలు, ఐకేపీ యానిమేటర్లు ఆందోళనకు దిగారు. రుణాలు మాఫీ చేయమని డ్వాక్రా మహిళలు డిమాండ్ చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. అదే సభలో తమ సమస్యలు పరిష్కరించాలని ఐకేపీ యానిమేటర్లు కూడా ఆందోళన చేశారు. చీపురుపట్టిన చంద్రబాబు ఇదిలా ఉండగా, సబ్బవరం జంక్షన్లో స్వచ్ఛభారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. చీపురుపట్టుకొని రోడ్లు ఊడ్చారు. ** -
చాలా చూశా.. పక్కకు నెట్టండి!
-
చాలా చూశా.. పక్కకు నెట్టండి!
ఐకేపీ యానిమేటర్లపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం ‘పశ్చిమ’లో జన్మభూమి- మా ఊరు కార్యక్రమం రసాభాస సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘ఏయ్ పోలీస్.. వాళ్లను పక్కకు నెట్టండి. లేదంటే పక్కన కూర్చోబెట్టండి. ఇలాంటివి చాలా చూశా. ఖాళీ, పనికిమాలిన పార్టీలు చేసే రాజకీయాలకు నేను భయపడను’ పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం కలవపూడిలో శనివారం జన్మభూమి సభ సందర్భంగా జీతాల కోసం నినదించిన ఇందిరా క్రాంతిపథం(ఐకేపీ) యానిమేటర్లను ఉద్దేశించి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలివి. సీఎం ఆదేశాలతో రెచ్చిపోయిన ఖాకీలు మహిళలని కూడా చూడకుండా ఐకేపీ యానిమేటర్లను ఈడ్చిపారేశారు. కలవపూడిలో జరిగిన జన్మభూమి కార్యక్రమం లో చంద్రబాబు మైక్ తీసుకుని మాట్లాడటం మొదలు పెట్టగానే గ్యాలరీలో కూర్చున్న ఐకేపీ యానిమేటర్లు 16 నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలు ఇవ్వాలని నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో చంద్రబాబు వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో రెచ్చిపోయిన పోలీసులను యానిమేటర్లు ప్రతిఘటించడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. కొందరు టీడీపీ కార్యకర్తలు యానిమేటర్లపై దాడికి యత్నించ డంతో యానిమేటర్ల జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి శ్యామలారాణి స్పృహ కోల్పోయారు. అయినా యానిమేటర్లు వెనక్కు తగ్గలేదు. వీరికి డ్వాక్రా మహిళలు మద్దతుగా నిలిచారు. ఎస్పీ రఘురామిరెడ్డి ఇద్దరు యానిమేటర్లను సీఎం వద్దకు పంపినా శాంతించలేదు. సభను చెడగొట్టడానికే వచ్చారంటూ సీఎం వారిపై మండిపడ్డారు. ఒకవైపు ఐకేపీ యానిమేటర్ల ఆందోళన జరుగుతున్నా సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని కొనసాగించారు. అనంతరం పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం దొడ్డిపట్లలో జన్మభూమి సభలో పాల్గొన్నారు. సీఎం వెంట కార్యక్రమంలో మంత్రులు మాణిక్యాలరావు, సుజాత, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.