
ఐకేపీ యానిమేటర్లకు వైఎస్ జగన్ మద్దతు
ఇందిరా క్రాంతి పథకం (ఐకేపీ) ఉద్యోగులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు ప్రకటించారు.
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన జీతం బకాయిల కోసం ఆందోళన చేస్తున్న ఇందిరా క్రాంతి పథకం (ఐకేపీ) ఉద్యోగులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు ప్రకటించారు. పోలీసులు అరెస్ట్ చేసిన ఐకేపీ నాయకురాలు ధనలక్ష్మితో సోమవారం ఆయన ఫోన్ లో మాట్లాడారు. ఐకేపీ ఉద్యోగుల పోరాటానికి మద్దతు తెలిపారు. ప్రసుత్తం ఆమె బొల్లారం పోలీసు స్టేషన్ లో ఉన్నారు.
కాగా, ఐకేపీ యానిమేటర్ల అరెస్ట్ ను నిరసిస్తూ శాసనసభ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసింది. ఐకేపీ యానిమేటర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసింది. ఛలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టిన ఐకేపీ యానిమేటర్లను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పలువురు నాయకులను అరెస్ట్ చేశారు.