walkout
-
వాకౌట్.. వాయిదాలు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాల రెండో రోజు సోమవారం బీఆర్ఎస్ నిరసన లు, వాకౌట్, అధికారపక్ష సభ్యుల విమర్శల మధ్య శాసనసభ అర్ధంతరంగా ముగిసింది. ఈ నెల 9న అసెంబ్లీ సమావేశాలు లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆ ఒక్క రోజే భేటీ నిర్వహించి, 16వ తేదీకి (సోమవారానికి) వాయిదావేశారు. ఈమేరకు సోమవారం ఉదయం 10 గంటలకు శాసనసభ సమావేశం ప్రారంభమైనా.. ప్రశ్నోత్తరా లు, సంతాప తీర్మానాలు, ప్రభుత్వ బిల్లుల ప్రతిపాదనకే పరిమితమైంది.మాజీ సర్పంచ్‌లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వం నిర్దిష్ట హామీ ఇవ్వలేదని నిరసన తెలుపుతూ బీఆర్ఎస్ ప్రశ్నోత్తరాల సమయంలో సభ నుంచి వాకౌట్ చేసింది. ప్రశ్నోత్తరాలు, టీ విరామం తర్వాత సభ తిరిగి సమావేశంకాగానే.. ‘లగచర్ల’అంశంపై చర్చకోసం బీఆర్ఎస్ పట్టుబట్టింది. ఈ గందరగోళంతో స్పీకర్ సభ ను మంగళవారం ఉదయానికి వాయిదా వేశారు. నిర్దేశిత సమయంలోనే ప్రశ్నోత్తరాలు సోమవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలకు సంబంధించి స్పీకర్ ప్రకటన చేశారు. రోజూ గంటపాటు జరిగే ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో.. పది ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు ఆరు నిమిషాల సమయం లభిస్తోందని తెలిపారు. కానీ నిర్దేశిత సమయంలో పూర్తి చేయకపోవడం, కొన్ని ప్రశ్నలు మిగిలిపోవడంతో సభ్యులు అసంతృప్తి చెందుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో సభ్యులు, మంత్రులు ప్రశ్నలు, సమాధానాలు సూటిగా, క్లుప్తంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. సంతాప తీర్మానాలు.. బిల్లులు.. ⇒ ఉమ్మడి ఏపీ శాసనసభలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించిన ముగ్గురు దివంగత సభ్యులకు శాసనసభ రెండు నిమిషాల పాటు సంతాపం ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యేలు కొమిరెడ్డి జ్యోతిదేవి (మెట్పల్లి), ఊకె అబ్బయ్య (బూర్గంపాడు, ఇల్లందు), డి.రామచంద్రారెడ్డి (దొమ్మాట) మరణం పట్ల స్పీకర్ ప్రసాద్‌కుమార్ సంతాప తీర్మానం ప్రతిపాదించారు. ⇒ ‘యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ బిల్లు 2024’ను సీఎం రేవంత్ పక్షాన మంత్రి శ్రీధర్‌బాబు సభకు సమరి్పంచారు. ‘తెలంగాణ యూనివర్సిటీస్ (సవరణ) బిల్లు–2024’ను సీఎం తరఫున మంత్రి దామోదర రాజనర్సింహ సభలో ప్రవేశపెట్టారు. వాయిదా తీర్మానాలన్నీ తిరస్కరించిన స్పీకర్ ⇒అసెంబ్లీ సమావేశాల రెండో రోజున బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ సభ్యులు ఇచి్చన పలు వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. ⇒ ‘లగచర్ల’అంశంపై చర్చించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, విజయుడు, మర్రి రాజశేఖర్‌రెడ్డి వాయిదా తీర్మానం ప్రతిపాదించారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి దాడులను అరికట్టడం, బాధితులకు పరిహారం అందించే అంశంపై బీజేపీ ఎమ్మెల్యేలు పాల్వాయి హరీశ్, పాయల్ శంకర్ వాయిదా తీర్మానం ఇచ్చారు. ⇒ మూసీ ప్రక్షాళన, హైడ్రాపై చర్చించాలంటూ సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వాయిదా తీర్మానం ఇచ్చారు. -
అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ నేతలు వాకౌట్
-
శాసన మండలి నుంచి వాకౌట్ చేసిన YSRCP
-
Parliament Session: చినికి చినికి గాలివానగా... జయ వర్సెస్ ధన్‌ఖడ్!
న్యూఢిల్లీ: పేరులో ఏముందంటారు. కానీ పేరు పెను వివాదానికి దారి తీయగలదని, అంతకుమించి రాజకీయ సంక్షోభానికీ కారణం కాగలదని రాజ్యసభ సాక్షిగా రుజువైంది. సమాజ్‌వాదీ ఎంపీ జయాబచ్చన్ పేరు విషయమై శుక్రవారం రాజ్యసభలో రాజుకున్న రగడ నాటకీయ మలుపులు తిరిగి చివరికి రాజకీయ దుమారంగా మారింది. ఏకంగా రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్‌ను ఉపరాష్ట్రపతి పదవి నుంచి తొలగించాలంటూ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని విపక్ష ఇండియా కూటమి నిర్ణయించుకునే దాకా వెళ్లింది! దాంతో విపక్ష సభ్యులకు, ఆయనకు మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాలు కీలక మలుపు తిరిగాయి. వేడెక్కిన రాజ్యసభ జయాబచ్చన్ ‘పేరు’ అంశం శుక్రవారం రాజ్యసభను అమాంతం వేడెక్కించింది. విపక్ష నేత మల్లికార్జున ఖర్గేపై గత వారం బీజేపీ సభ్యుడు ఘన్‌శ్యాం తివారీ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేయడంతో రగడకు బీజం పడింది. ఇది ముగిసిపోయిన అంశమని ధన్‌ఖడ్ బదులివ్వడంతో విపక్ష ఎంపీలంతా గొడవకు దిగారు. దీనిపై జయ మాట్లాడతాననడంతో ధన్‌ఖడ్ అనుమతించారు. ‘జయా అమితాబ్ బచ్చన్! మాట్లాడండి’ అన్నారు. ఆయన తన పేరును పిలిచిన తీరులో వ్యంగ్యం ధ్వనిస్తోందంటూ జయ తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ‘‘నేను నటిని. హావభావాలను ఇట్టే అర్థం చేసుకోగలను. మీ మాటతీరు ఏమాత్రం అంగీకారయోగ్యంగా లేదు. మీరు సభాధ్యక్ష స్థానంలో ఉండొచ్చు గాక. కానీ మీరు మా తోటి సభ్యులు మాత్రమే’’ అన్నారు. దాంతో ధన్‌ఖడ్ తీవ్రంగా ఆగ్రహించారు. ‘ఇక చాలు’ అంటూ మధ్యలోనే కలి్పంచుకున్నారు. ‘‘మీకు గొప్ప పేరుండొచ్చు. కానీ నటీనటులు దర్శకుడు చెప్పినట్టు చేయాల్సిందే. సభాధ్యక్ష స్థానం నుంచి నేను చూసేది మీకు కని్పంచకపోవచ్చు. నా మాటతీరునే తప్పుబడతారా? నేనేం చేయాలో మీరు నిర్దేశించలేరు’’ అంటూ ఆక్షేపించారు. ఇందుకు విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలపడంతో ధన్‌ఖడ్ మరింతగా మండిపడ్డారు. ‘‘మీరు సెలబ్రిటీ అయినా, మరెవరైనా సరే! నథింగ్ డూయింగ్. నిబంధనలను అర్థం చేసుకోవాల్సిందే. సభా మర్యాదలు పాటించి తీరాల్సిందే’’ అని బచ్చన్‌కు స్పష్టం చేశారు. విపక్ష ఎంపీలంతా తీవ్ర అభ్యంతరం తెలిపినా, మూకుమ్మడిగా నినాదాలకు దిగినా లెక్కచేయలేదు. ఈ అంశంపై మాట్లాడేందుకు ఎవరికీ అనుమతివ్వబోనని స్పష్టం చేశారు. ‘‘పేరు ప్రఖ్యాతులు మీకే ఉంటాయనుకోకండి. మనమంతా ఇక్కడికొచ్చేది మన బాధ్యతలు సరిగా నిర్వర్తించి పేరు సంపాదించేందుకే. పేరు ప్రఖ్యాతులకు తగ్గట్టుగా నడుచుకోవాలి’’ అంటూ క్లాసు తీసుకున్నారు. ‘‘సీనియర్ సభ్యులైనంత మాత్రాన సభాపతి స్థానాన్ని అవమానించేందుకు సభాపతి మాటతీరుకు ఉద్దేశాలు ఆపాదించేందుకు ఎవరికీ హక్కు లేదు. పరిస్థితిని బట్టి ప్రతిస్పందించాల్సి వచ్చింది. నా సొంత స్క్రిప్టునే అనుసరిస్తాను తప్ప ఎవరో చెప్పినట్టు నడుచుకునే ప్రసక్తే లేదు’’ అంటూ కుండబద్దలు కొట్టారు. విపక్ష సభ్యుల వ్యాఖ్యలేవీ రికార్డుల్లోకి వెళ్లబోవని స్పష్టం చేశారు. జయ పేరుపై రాజ్యసభలో ఆమెకు, ధన్‌ఖడ్‌కు సంవాదం జరగడం వారం రోజుల్లో ఇది మూడోసారి. మేం స్కూలు పిల్లలమా?: జయ ధన్‌ఖడ్ తీరుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్టు విపక్ష సభ్యులు ప్రకటించారు. దాంతో ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ‘‘మీరు దేశం మొత్తాన్నీ అస్థిరపరిచే ప్రయత్నంలో ఉన్నారని నాకు బాగా తెలుసు. సభలో గందరగోళం సృష్టించడమే మీ ఉద్దేశం. అందుకు ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించబోను. మీరంతా మీ బాధ్యతల నుంచి పారిపోతున్నారు’’ అంటూ ఆక్షేపించారు. ‘‘రాజ్యాంగాన్ని పణంగా పెట్టయినా ఖర్గే తన మాట నెగ్గించుకోవాలనుకుంటున్నారు. ఇది రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే’’ అంటూ తప్పుబట్టారు. అనంతరం సోనియాగాంధీ తదితరులతో కలిసి జయాబచ్చన్ సభ నుంచి వాకౌట్ చేశారు. సభా ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ‘‘క్రమశిక్షణలో పెట్టేందుకు మేమేమీ స్కూలు పిల్లలం కాదు. ధన్‌ఖడ్ మాటతీరుతో చాలా కలత చెందాను. అధికార పక్ష సభ్యులు నిండు సభలో మా పట్ల అమర్యాదకరమైన మాటలు వాడుతున్నారు’’ అని ఆరోపించారు.87 మంది ఎంపీల సంతకాలుఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ అభిశంసనకు తీర్మానం ప్రవేశపెట్టాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ఈ మేరకు నోటీస్‌పై 87 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేసినట్టు సమాచారం. ‘‘నోటీసు ఎప్పుడివ్వాలో త్వరలో నిర్ణయిస్తాం. ఇది తీర్మానం దాకా వెళ్లకపోయినా, చైర్మన్‌గా ధన్‌ఖడ్ అనుసరిస్తున్న ఏకపక్ష పోకడలను దేశ ప్రజల ముందు ఎత్తి చూపడమే మా ఉద్దేశం’’ అని విపక్షాలు స్పష్టం చేశాయి.ముందస్తు నోటీసు తప్పనిసరి రాజ్యాంగంలోని ఆరి్టకల్ 67(బి) ప్రకారం ఉపరాష్ట్రపతిని తొలగించాలని కోరుతూ మహాభిశంసన తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. మెజారిటీ సభ్యుల మద్దతు లభిస్తే తీర్మానం నెగ్గి ఆయన పదవీచ్యుతుడవుతారు. అయితే మహాభిశంసన కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టబోతున్నామంటూ కనీసం 14 రోజుల ముందస్తు నోటీసివ్వడం తప్పనిసరి. -
బీఆర్ఎస్ వాకౌట్
సాక్షి, హైదరాబాద్: పౌర సరఫరాల శాఖలో సన్న బియ్యం కొనుగోళ్లలో రూ.1,100 కోట్ల స్కాం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. ధాన్యం అమ్మకాలు, సన్నబియ్యం కొనుగోళ్లలో జరిగిన కుంభకోణంపై సభాసంఘాన్ని నియమించా లన్న తమ డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించనందున, ప్రభుత్వ తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి తమ పార్టీ సభ్యు లతో కలిసి మంగళవారం రాత్రి శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి తెలియకుండా సివిల్ సప్లయ్స్ శాఖలో చాలా జరుగుతున్నాయని ఆరోపించారు.రేషన్ కార్డులు, రైతులకు పంటలకు సంబంధించిన బోనస్ విషయంలో తమ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమా ధానం చెప్పకుండా బుల్డోజ్ చేస్తోందంటూ మండిపడ్డారు. ప్రతిపక్షం ఏం చెప్పినా ప్రభుత్వానికి రుచించటం లేదని దుయ్యబట్టారు. దీనిలో మంత్రి హస్తం లేకపోయినా పెద్దల హస్తం ఉందన్నారు. దీనిపై ప్రభుత్వం సమాధానం ఇస్తున్న తీరుపై కేటీఆర్ మండిపడ్డారు. ఈ కుంభకోణంపై హౌజ్ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ తీరుకు నిరసనగా అసెంబ్లీ నుంచి బాయ్‌కాట్ చేస్తున్నామని చెప్పారు. అంతకుముందు సభా సంఘాన్ని నియమించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు వెల్‌లో బైఠాయించి చప్పట్లు కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలో కలి్పంచుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వారిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సన్న బియ్యం కొనలేదు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందిస్తూ.. సన్నబియ్యం ఒక్క గింజకూడా కొనుగోలు చేయలేదని స్పష్టం చేశారు. తన శాఖలో ఏమి జరిగినా అందుకు తాను పూర్తి బాధ్యత వహిస్తానని, ఏదీ జరగకుండానే జరిగినట్లు ఆరోపించడం తగదని చెప్పారు. మీ హయాంలో రబీలో సేకరించిన ధాన్యం మిల్లుల్లో లేదన్నారు. అప్పట్లో ప్రభుత్వం ధాన్యం విక్రయానికి టెండర్లు పిలిస్తే క్వింటాల్‌కు రూ. 1700 మాత్రమేనని, కానీ తమ ప్రభుత్వం వచ్చాక దొడ్డు బియ్యానికి రూ.2007, సన్నధాన్యానికి రూ.2400 ఇచి్చనట్లు గుర్తు చేశారు. పారిపోయారు: శ్రీధర్‌బాబు పౌరసరఫరాల పద్దుపై విపక్ష సభ్యులు అడిగిన అన్ని ప్రశ్నలకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పూర్తిగా సమాధానం ఇచ్చినా కూడా వారు సభ నుంచి పారిపోయారని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు ఎద్దేవా చేశారు. వారి హయాంలో అన్ని అవకతవకలేనని దుయ్యబట్టారు. పదేళ్లలో ఒక్క రైతుకైనా పంట నష్టపరిహారం ఇచ్చారా అని ప్రశ్నించారు. సభనా..? బస్టాండా..?: భట్టి విక్రమార్క ‘ఇది సభనా? బస్టాండా? సభలో వెల్‌లోకి వచ్చి చప్పట్లు కొట్టడం ఏంటి..? వీరు మంత్రులుగా పనిచేశారు.. ఇదేం పద్ధతి? పదేళ్లు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఒక్క రోజైనా మేము ఇలా సభామర్యాదలను అగౌరవపరిచేలా చేశామా? వెల్‌లోకి వచ్చి చప్పట్లు కొట్టడం, ప్లకార్డులు ప్రదర్శించడం సబబు కాదు. సభాసంప్రదాయాలను మంట కలిపేలా వ్యవహరించడం సరికాదు. ప్రజలు ఇప్పటికే వారికి (బీఆర్ఎస్) బుద్ధి చెప్పారు. బుద్ధి తెచ్చుకొని వారిని సీట్లలోకి వెళ్లి కూర్చోమనండి అధ్యక్షా..! సభాసంప్రదాయాలు పాటించే వారే ఈ సభలో ఉండాలి’ అంటూ భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అపనమ్మకంతో అభివృద్ధి ఎలా?
వికసిత భారత్ లక్ష్యమనీ, అందుకు వికసిత రాష్ట్రాలు కీలకమనీ కేంద్రం మాట. అందుకు అవరోధంగా రాజకీయంగా వివక్ష కొనసాగుతోందని రాష్ట్రాల ఆరోపణ. అందుకే, రాష్ట్రాల అభివృద్ధి, నిధుల కేటాయింపునకు కీలకమైన నీతి ఆయోగ్ సమావేశంలో బహిష్కరణల పర్వం కొనసాగడం ఆశ్చర్యం అనిపించదు. ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం సాగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ 9వ భేటీకి ఒకటీ రెండు కాదు... ఏకంగా పది ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ప్రతినిధులు గైర్హాజరయ్యారు. గత వారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2024–25 కేంద్ర బడ్జెట్లో తమ రాష్ట్రాల్లో ప్రాజెక్ట్‌లకు తగినన్ని నిధులు కేటాయించలేదంటూ తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల సీఎంలు భేటీని బహిష్కరిస్తే, పశ్చిమ బెంగాల్ పక్షాన హాజరైన ఏకైక ప్రతిపక్ష పాలిత సీఎం మమతా బెనర్జీ సైతం మాట్లాడనివ్వకుండా మైకు ఆపేశారంటూ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. అనుకున్నట్టే ఆ భేటీ కేంద్రం, రాష్ట్రాల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. నీతి ఆయోగ్ ప్రాథమిక లక్ష్యాలు, పనితీరు పైన చర్చకు పురిగొల్పింది. కేంద్ర, రాష్ట్రాలు పరస్పర నిందారోపణలు మాని, నిజమైన సమాఖ్య స్ఫూర్తిని పాటించాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది. ఈ నీతి ఆయోగ్ వ్యవస్థ ఎన్డీఏ తెచ్చిపెట్టినదే. తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు 2014లో కేంద్ర ప్రణాళికా సంఘం స్థానంలో దీన్ని ప్రవేశపెట్టారు. అలా 2015 జనవరి నుంచి ఇది అమలులోకి వచ్చింది. ప్రణాళికా సంఘమైతే పైన కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఏకపక్షంగా విధాన నిర్ణయాలు బట్వాడా చేస్తుందనీ, దానికి బదులు కింది అందరినీ కలుపుకొనిపోతూ, రాష్ట్రాల ఆలోచనలకు పెద్దపీట వేసేందుకు ఉపకరిస్తుందనే ఉద్దేశంతో నీతి ఆయోగ్‌ను పెట్టారంటారు. కానీ, ఆచరణలో అందుకు విరుద్ధంగా జరుగుతోందన్నది ప్రధాన విమర్శ. వరుసగా మూడోసారి ఎన్డీఏ సర్కారు ఏర్పడిన తర్వాత ఈ జూలై 16న నీతి ఆయోగ్ మేధావి బృందాన్ని ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ప్రధానమంత్రి మోదీ ఛైర్‌పర్సన్‌గా ఉండే ఈ బృందంలో నలుగురు పూర్తికాలిక సభ్యులతో పాటు, ఎన్డీఏలో భాగస్వాములైన బీజేపీ, దాని మిత్రపక్షాలకు చెందిన 15 మంది కేంద్ర మంత్రుల్ని ఎక్స్–అఫిషియో సభ్యులుగా చేర్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోమ్ మంత్రి అమిత్‌షా తదితరులు అందులో సభ్యులే. ఒకప్పటి ప్రణాళికా సంఘంలోనూ లోపాలున్నా... గ్రాంట్ల విషయంలో గతంలో రాష్ట్రాలతోసంప్రతింపులకు వీలుండేది. కానీ, ఇప్పుడు గ్రాంట్లపై ఆర్థికశాఖదే సర్వంసహాధికారం. ప్రణాళికా సంఘం ఉసురు తీసి వచ్చిన నీతి ఆయోగ్ కేవలం సలహా సంఘమైపోయింది. ఎంతసేపటికీ రాష్ట్రాల స్థానాన్ని మదింపు చేయడానికి కీలకమైన సూచికల సృష్టి మీదే దృష్టి పెడుతోంది. రాష్ట్రాలకూ, ఇతర సంస్థలకూ వనరుల పంపిణీ, కేటాయింపులు జరిపే అధికారం లేని వట్టి ఉత్సవ విగ్రహమైంది. వెరసి, కేంద్ర సర్కార్ జేబుసంస్థగా, పాలకుల అభీష్టానికి తలాడించే సవాలక్ష ఏజెన్సీల్లో ఒకటిగా దాన్ని మార్చేశారు. చివరకు ‘సహకార సమాఖ్య’ విధానానికి బాటలు వేస్తుందంటూ తెచ్చిన వ్యవస్థ అనూహ్యంగా ‘పోటాపోటీ సమాఖ్య’ పద్ధతికి దారి తీసింది. చివరకు మేధావి బృందపు పాత్ర ఏమిటన్న దానిపైనా ప్రశ్నలు తలెత్తాయి. వాటికీ సరైన జవాబు లేదు. అపనమ్మకం పెరిగితే వ్యవస్థలో చిక్కులు తప్పవని నీతి ఆయోగ్ భేటీ మరోసారి తేటతెల్లం చేసింది.అభివృద్ధికి సంబంధించిన వైఖరుల్లో పరస్పరం తేడాలున్నా, ప్రధానంగా భౌతిక ప్రాథమిక వసతుల నిర్మాణంపైనే అధికంగా ఖర్చు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ భావనకు సరిపోలేలా రాష్ట్రాలు కృషి చేయాలంటూ నీతి ఆయోగ్ తాజా భేటీలో 20 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతి నిధుల్ని ఉద్దేశించి ప్రధాని నొక్కిచెప్పారు. ఆర్థిక కార్యకలాపాలు చురుకుగా సాగాలంటే ప్రాథమిక వసతుల నిర్మాణం ప్రాధమ్యాంశమని కేంద్రం ఆలోచన. అందుకే, జాతీయ అభివృద్ధి లక్ష్యాల సాధనకు కేంద్రంతో రాష్ట్రాలు చేతులు కలిపి అటు వసతులకూ, ఇటు సంక్షేమానికీ వనరులు అందు కోవాలని ప్రధాని అంటున్నారు. అయితే, రాష్ట్రాల స్థానిక అవసరాలు, ప్రాధాన్యాలు ఎక్కడికక్కడ వేర్వేరు కాబట్టి, చెప్పినంత సులభం కాదది! పైగా, రాష్ట్రాలన్నిటికీ పెద్దపీటనే మాటకు భిన్నంగా ఆచరణలో పాలకపక్షం తమ ప్రభుత్వాలు ఉన్నచోటనే ప్రేమ చూపిస్తోందనే విమర్శ ఉండనే ఉంది.కేంద్ర బడ్జెట్‌ను సైతం అదే సరళిలో రాజకీయమయం చేశారని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఆరోపి స్తున్నాయి. తమిళనాట చెన్నై మెట్రో రైల్, కేరళలో విళింజమ్ పోర్ట్ సహా పలు కీలక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లకు నిధులివ్వలేదని ఎత్తిచూపుతున్నాయి. ఈ అనుమానాలు, ఆరోపణలకు సంతృప్తికరమైన సమాధానాలు కేంద్రం వద్ద లేవు. అదే సమయంలో తాగునీరు, విద్యుచ్ఛక్తి, ఆరోగ్యం, పాఠశాల విద్య తదితర అంశాలే అజెండాగా సాగిన ఓ భేటీని బహిష్కరించడం వల్ల రాష్ట్రాలకూ, ప్రజానీకానికే నష్టం. ఆ సంగతి రాష్ట్రాలు గుర్తించాలి. బహిష్కరణను తప్పుబడుతున్న కేంద్ర పెద్దలు కూడా పరి స్థితి ఇంత దాకా ఎందుకు వచ్చిందో ఆత్మపరిశీలన చేసుకోవాలి. నీతి ఆయోగ్‌ను రద్దు చేసి, మునుపటి ప్రణాళికా సంఘమే మళ్ళీ తేవాలనే వాదన వినిపిస్తున్న వేళ వ్యవస్థాగతంగానూ, పని తీరులోనూ పాతుకున్న లోపాలను తక్షణం సవరించాలి. నిధులను సక్రమంగా, సమానంగా పంచ డంలో కేంద్ర ఆర్థిక మంత్రి, బడ్జెట్లు విఫలమవుతున్న తీరును మాటలతో కొట్టిపారేస్తే సరిపోదు. పెద్దన్నగా అన్ని రాష్ట్రాలనూ కలుపుకొనిపోతేనే వికసిత భారత లక్ష్యం సిద్ధిస్తుంది. పన్నుల రూపంలో భారీగా కేంద్రానికి చేయందిస్తున్న ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలూ ఇదే భారతావనిలో భాగమని గుర్తిస్తేనే అది కుదురుతుంది. అందుకు రాజకీయాలను మించిన విశాల దృష్టి అవసరం. -
Mamata Banerjee: ఘోరంగా అవమానించారు
న్యూఢిల్లీ/కోల్‌కతా/పటా్న: నీతి ఆయోగ్ సమావేశం రాజకీయ దుమారానికి కారణంగా మారింది. శనివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో జరిగిన ఈ భేటీలో తనకు ఘోర అవమానం జరిగిందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మండిపడ్డారు. తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ భేటీ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం ఢిల్లీలో, ఆ తర్వాత కోల్‌కతా విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఇతర సీఎంలకు 10 నుంచి 20 నిమిషాలు సమయమిచ్చి తనకు మాత్రం 5 నిమిషాలకే మైక్ కట్ చేశారని ఆరోపించారు. ‘‘కేంద్రంపై పెద్దగా ఆశలు లేకపోయినా సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేయాలనే సదుద్దేశంతో భేటీకి వచ్చా. విపక్ష పాలిత రాష్ట్రాల నుంచి హాజరైన ఏకైక సీఎంను నేనే. ఆంధ్రప్రదేశ్ సీఎంకు 20 నిమిషాలిచ్చారు. గోవా, అసోం, ఛత్తీస్‌గఢ్ తదితర సీఎంలకు కూడా 10 నుంచి 12 నిమిషాల దాకా ఇచ్చారు. నన్ను మాత్రం ఐదు నిమిషాల కంటే మాట్లాడనివ్వలేదు. పైగా ఆ ఐదు నిమిషాల్లోనూ పదేపదే బెల్లు కొడుతూ దారుణంగా అవమానించారు. భేటీని పర్యవేక్షించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పదేపదే బెల్లు కొట్టారు. పక్కనే కూర్చున్న మోదీ, కేంద్ర హోం మంత్రి సూచన మేరకే ఆయనలా చేశారు. దీనికి నిరసనగా వాకౌట్ చేశా’’ అని వివరించారు. ఇకపై నీతి ఆయోగ్ భేటీలకు ఎప్పటికీ హాజరు కాబోనని ప్రకటించారు. మైక్ కట్ చేయలేదు: నిర్మల మమత ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. ఆమెకు కేటాయించిన సమయం మేరకు పూర్తిగా మాట్లాడారని పేర్కొంది. ‘‘నిజానికి అక్షరక్రమంలో మమత లంచ్ అనంతరం మాట్లాడాల్సింది. కానీ ఆమె అర్జెంటుగా కోల్‌కతా తిరిగి వెళ్లాల్సి ఉందన్న బెంగాల్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అంతకుముందే ఏడో వక్తగా అవకాశమిచ్చాం. మమతకు కేటాయించిన సమయం పూర్తయిందని కేవలం అందరి ముందూ ఉన్న స్క్రీన్లపై కని్పంచింది. అంతే తప్ప టైం అయిపోయిందంటూ ఎవరూ బెల్ కూడా మోగించలేదు’’ అని వివరణ ఇచి్చంది. మమత పూర్తి సమయం మేరకు మాట్లాడారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ‘‘మధ్యలో మైక్ కట్ చేయడం నిజం కాదు. ఎవరెంతసేపు మాట్లాడుతున్నదీ మా ముందున్న స్క్రీన్లపై కనిపిస్తూనే ఉంది. కొందరు సీఎంలు కేటాయించిన సమయం కన్నా ఎక్కువగా మాట్లాడారు. వారి విజ్ఞప్తి మేరకు అదనపు సమయం కేటాయించాం. అంతే తప్ప ఎవరికీ, ముఖ్యంగా బెంగాల్ సీఎంకు మైకు కట్ చేయలేదు’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కేంద్రానిది రాజకీయ వివక్ష విపక్ష పాలిత రాష్ట్రాల పట్ల కేంద్రం దారుణమైన రాజకీయ వివక్ష కనబరుస్తోందని మమత ఆరోపించారు. ‘‘ఈ వివక్ష కేంద్ర బడ్జెట్లో కూడా కొట్టొచి్చనట్టు కని్పంచింది. ఈ వైనాన్ని భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలోనే లేవనెత్తా. వారికి కొన్ని రాష్ట్రాల పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉంటే ఉండొచ్చు. వాటికి ఎక్కువ నిధులు కేటాయించడంపైనా నాకు అభ్యంతరం లేదు. కానీ బెంగాల్ తదితర రాష్ట్రాలపై మాత్రం ఎందుకిలా వివక్ష చూపు తున్నారని ప్రశ్నించా. దీనిపై సమీక్ష జరగాలని డిమాండ్ చేశా. అన్ని రాష్ట్రాల తరఫునా భేటీలో మాట్లాడా’’ అని తెలిపారు. ‘‘నీతి ఆయోగ్‌కు ఎలాంటి ఆర్థిక అధికారాలూ లేవు. దానికి అధికారాలన్నా ఇవ్వాలి. లేదంటే ప్రణాళిక సంఘాన్నే పునరుద్ధరించాలి’’ అని డిమాండ్ చేశారు. ‘‘ఉపాధి హామీ వంటి పలు కీలక కేంద్ర పథకాల అమలును బెంగాల్లో మూడేళ్లుగా నిలిపేయడాన్ని భేటీలో ప్రస్తావించా. స్వపక్షం, విపక్షాల మధ్య కేంద్రం ఇలా వివక్ష చూపుతుంటే దేశం ఎలా నడుస్తుంది? అధికారంలో ఉన్నప్పుడు అందరి మేలూ పట్టించుకోవాలి’’ అన్నారు. అధికార, విపక్షాల పరస్పర విమర్శలు కాంగ్రెస్‌తో పాటు పలు విపక్షాలు మమతకు సంఘీభావం ప్రకటించాయి. విపక్ష నేత అ న్న ఒకే ఒక్క కారణంతో ఏకంగా ముఖ్యమంత్రినే ఇంతగా అవమానించడం దారుణమని మండిపడ్డాయి. దీన్ని ఎంతమాత్రమూ అంగీకరించలేమని కాంగ్రెస్ పేర్కొంది. కేంద్రం తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్టు స్టాలిన్ (తమిళనాడు) సహా విపక్ష పాలిత రాష్ట్రాల సీఎంలు అన్నారు. ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచి్చంది. కేవలం మీడియాలో పతాక శీర్షికల్లో నిలిచేందుకే ముందుగా నిర్ణయించుకుని మరీ మమత ఇలా వాకౌట్ చేశారని కేంద్ర మంత్రులు అర్జున్‌రాం మేఘ్వాల్, ప్రహ్లాద్ జోషీ తదితరులు విమర్శించారు. బెంగాల్ పీసీసీ చీఫ్ అ«దీర్ రంజన్ చౌధరి మాత్రం మమత కావాలనే డ్రామా చేశారంటూ కొట్టిపారేయడం విశేషం.‘‘సహకారాత్మక సమాఖ్య వ్యవస్థ అంటే ఇదేనా? సీఎంతో ప్రవర్తించే తీరిదేనా? మన ప్రజాస్వామ్యంలో విపక్షాలు కూడా అంతర్గత భాగమని కేంద్రంలోని బీజేపీ సర్కారు అర్థం చేసుకోవాలి. శత్రువుల్లా చూడటం ఇకనైనా మానుకుంటే మంచిది’’ – తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‘‘మన దేశంలో పతాక శీర్షికలకు ఎక్కడం చాలా తేలిక. ఏకైక నీతి ఆయోగ్ భేటీలో పాల్గొన్న ఏకైక విపక్ష సీఎం నేనే అని ముందుగా చెప్పాలి. బయటికొచ్చి, ‘నా మైక్ కట్ చేశారు. అందుకే బాయ్‌కాట్ చేశా’ అని చెప్పాలి. ఇక రోజంతా టీవీలు దీన్నే చూపిస్తాయి. పని చేయాల్సిన, చర్చించాల్సిన అవసరం లేదు. ఇదీ దీదీ తీరు!’’ – బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ -
నీట్ మంటలు.. విపక్షాల వాకౌట్..
-
మొయిత్రా వాకౌట్
న్యూఢిల్లీ: పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు నగదు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ మహిళా ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంట్ నైతిక విలువల కమిటీ ముందు హాజరై తర్వాత వాకౌట్ చేశారు. కమిటీ భేటీలో తీవ్ర అభ్యంతర, వ్యక్తిగత వివరాలు అడుగుతున్నారంటూ ఆమె మధ్యలోనే బయటికొచ్చారు. ఆమెకు మద్దతు పలుకుతూ విపక్ష ఎంపీలు సైతం అర్ధంతరంగా బయటికొచ్చారు. కాగా, ‘ఎథిక్స్ కమిటీని మొయిత్రా తప్పుదోవ పట్టించే ప్రయత్నంచేశారు. కమిటీ తప్పుడు విధానాలను అవలంబిస్తోందంటూ, కమిటీ నిర్వహణ పద్ధతిని మొయిత్రా తప్పుగా చిత్రించే దుస్సాహసం చేశారు’ అని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఆరోపించారు. ‘నగదుకు ప్రశ్నలు’ ఆరోపణలుసహా తన పార్లమెంట్ లాగిన్ వివరాలను పారిశ్రామికవేత్త దర్శన్ హీరానందానీకి మొయిత్రా ఇచ్చారని, దుబాయ్ నుంచి చాలాసార్లు లాగిన్ అయ్యా, విదేశాల్లో లాగిన్ అవడంతో దేశభద్రత ప్రమాదంలో పడిందని దూబే తీవ్ర ఆరోపణలు చేయడం తెల్సిందే. లోక్‌సభ స్పీకర్ బిర్లాకు దూబే ఫిర్యాదుచేయడంతో వివరణ కోరుతూ పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ మొయిత్రాను గురువారం పిలిచింది. ఈ భేటీ దాదాపు నాలుగు గంటలపాటు సాగింది. అసభ్యమైన ప్రశ్నలు వేస్తున్నారు: మొయిత్రా ‘అసలు అవేం ప్రశ్నలు?. తీవ్ర అభ్యంతరకరమైన, అసభ్యమైన ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకే బయటికొచ్చేశా’ అని అక్కడ ఉన్న మీడియాతో అన్నారు. ‘మీ కళ్లలో నీళ్లు తిరుగుతున్నట్లు ఉన్నాయిగా’ అని అక్కడున్న ఒక విలేకరి ప్రశ్నించగా.. ‘ఏమిటా చెత్త ప్రశ్న. చూడు నా కళ్లలో నీళ్లు కనిపిస్తున్నాయా?’ అంటూ మొయిత్రా తన రెండు కళ్లను చూపించారు. ‘అసలు ఇది ఎథిక్స్ కమిటీయేనా?. ముందే సిద్దంచేసిన స్క్రిప్ట్‌ను చదువుతున్నారు’ అంటూ కమిటీపై మొయిత్రా ఆరోపణలు చేశారు. ‘‘కమిటీలో చైర్మన్ నన్ను మాటలతో ‘వ్రస్తాపహరణం’ చేశారు’’ అని ఫిర్యాదుచేస్తూ స్పీకర్ బిర్లాకు మొయిత్రా ఒక లేఖ రాశారు. మొయిత్రా, కమిటీ చైర్మన్, సభ్యులు ఏమన్నారు? మొయిత్రా వాకౌట్ తర్వాత ఎథిక్స్ కమిటీ చైర్మన్, బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోంకార్ మీడియాతో మాట్లాడారు. ‘ నిజానికి కమిటీ విధివిధానాలు, నిర్వహణ పద్ధతిపై మొయిత్రా తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. తర్వాత ఆమె, విపక్ష సభ్యులు చర్చ జరుగుతుండగానే మధ్యలో బయటికొచ్చేశారు’ అని చెప్పారు. ‘ మొయిత్రాను అడిగిన ప్రశ్నలు అగౌరవనీయం, అనైతికంగా ఉన్నాయి. ఎక్కడెక్కడ తిరిగారు. ఎవరితో మాట్లాడారు. మీ ఫోన్ రికార్డింగ్‌లు ఇవ్వాలని కమిటీ అడిగింది’ అని కాంగ్రెస్ ఎంపీ, ప్యానెల్ సభ్యుడు అయిన ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. ‘రాత్రిళ్లు ఎవరితో మాట్లాడతారు? ఎలాంటి విషయాలు మాట్లాడతారు? అని ఆమెను ప్రశ్నించారు. మహిళా ఎంపీని చైర్మన్ ప్రశ్నలు అడిగే పద్దతి ఇదేనా? ద్రౌపది వస్త్రాపహరణం తరహాలో విచారణ కొనసాగింది’ అని కమిటీ సభ్యుడు డ్యానిష్ అలీ ఆరోపించారు. ఆ లాయర్ వల్లే ఇదంతా ! బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబేకు బలమైన సాక్ష్యాలు ఇచ్చారంటూ వార్తల్లో నిలిచిన న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్ గతంలో మొయిత్రాకు బాగా తెలుసు. వీరిద్దరూ కొన్నాళ్లు సహజీవనం చేసి విడిపోయారు. విడిపోయేటపుడు జరిగిన గొడవకు ప్రతీకారంగానే జై అనంత్ ఇవన్నీ చేస్తున్నారని మీడియాలో వార్తలొచ్చాయి. కమిటీ ముందు ఇవే అంశాలను మొయిత్రా ప్రస్తావించారని తెలుస్తోంది. అయితే, దేహద్రాయ్‌తో బంధం విడిపోయిన విషయం పక్కనబెట్టి ‘నగదుకు ప్రశ్నలు’ అంశంపై వివరణ ఇవ్వాలని కోరినా ఆమె పట్టించుకోలేదని బీజేపీ ఎంపీ, కమిటీ సభ్యుడు విష్ణుదత్ శర్మ ఆరోపించారు. -
లారెన్స్ సినిమా నుంచి వాకౌట్?
లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయనతార లేడీ ఓరియంటెడ్ మూవీస్‌తో పాటు రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో హీరోల సరసన నటిస్తుంటారు. దక్షిణాదిన సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న నయన ‘జవాన్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్‌తో హిందీ పరిశ్రమలోనూ విజయవంతంగా కెరీర్ ఆరంభించారు. ఇక ప్రస్తుతం ‘ది టెస్ట్’ చిత్రంతో పాటు మరో చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు నయనతార. కాగా, రత్నకుమార్ దర్శకత్వంలో లారెన్స్ హీరోగా రూపొందనున్న చిత్రంలో ఈ బ్యూటీ హీరోయిన్గా ఖరారయ్యారనే వార్త వినిపించింది. తాజాగా ఈ చిత్రం నుంచి ఆమె తప్పుకున్నారని టాక్. డేట్స్ సర్దుబాటు చేయలేక నయన ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. -
వరుసగా సినిమాల నుంచి తప్పుకుంటున్న టాప్ హీరోయిన్స్.. అసలేంటీ కథ!
ఒక్క ఛాన్స్ వచ్చేవరకే ఎవరైనా ఆ చాన్స్ కోసం కష్టపడాలి. ఆ ఒక్క చాన్స్ బంపర్ చాన్స్ అయితే ఆ తర్వాతి చాన్సులు అవే వస్తాయి. ఇందుకు ఓ ఉదాహరణ పూజా హెగ్డే, రష్మికా మందన్నా. స్టార్ హీరోయిన్లుగా ఈ ఇద్దరూ తెలుగు, తమిళ, హిందీ చిత్రాలు చేస్తూ దూసుకెళుతున్నారు. చివరికి ఈ ఇద్దరూ డేట్స్ సర్దుబాటు చేయలేక సినిమాలు వదులుకునేంత బిజీ. అటు హిందీకి వెళితే ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్ కూడా ఈ మధ్య ఒక సినిమా వదులుకున్నారు. ‘నో డేట్స్.. ఐ వాన్న వాకౌట్’ అంటూ ఈ నలుగురూ వదులుకున్న చిత్రాల గురించి, పూజ–రష్మిక వాకౌట్ చేయడం వల్ల ఆ ప్లేస్‌ని రీప్లేస్ చేయడానికి దర్శక–నిర్మాతలు పరిశీలిస్తున్న హీరోయిన్ గురించి తెలుసుకుందాం. గుంటూరు కారం మిస్ ‘ఒక లైలా కోసం’తో (2014) తొలిసారి తెలుగు తెరపై మెరిశారు పూజా హెగ్డే. ఆ తర్వాత వరుస సినిమాలతో ఇక్కడ ఫుల్ బిజీ. అటు తమిళ, హిందీ నుంచి అవకాశాలు దక్కించుకున్నారు. ఇలా బిజీగా ఉన్న పూజ ఇటీవల డేట్స్ సర్దుబాటు చేయలేక ‘గుంటూరు కారం’ నుంచి తప్పుకున్నారని ఆమె వ్యక్తిగత సిబ్బంది పేర్కొన్న విషయం తెలిసిందే. మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. త్రివిక్రమ్‌తో ‘అరవింద సమేత వీర రాఘవ’, ‘అల.. వైకుంఠపురములో’ వంటి హిట్ చిత్రాల్లో నటించారు పూజ. ‘గుంటూరు కారం’ నుంచి వాకౌట్ చేయకపోయి ఉంటే ఈ ఇద్దరి కాంబోలో ఇది మూడో సినిమా అయ్యుండేది. అలాగే ‘మహర్షి’ వంటి హిట్ తర్వాత మహేశ్‌బాబు–పూజ కాంబోలో రెండో సినిమా అయ్యుండేది. అయితే ‘గుంటూరు కారం’ నుంచి పూజ తప్పుకున్నప్పటికీ సూర్యదేవర నాగవంశితో కలిసి త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మించనున్న చిత్రంలో ఈ బ్యూటీ నటించే చాన్స్ ఉందట. సాయిధరమ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందించనున్న చిత్రానికి పూజని హీరోయిన్గా తీసుకోవాలని నాగవంశి, సాయి సౌజన్య అనుకున్నారట. పూజని సంప్రదించారని సమాచారం. అయితే ఇంకా ఆమె కథ వినలేదట. నితిన్ సినిమా మిస్ ‘ఛలో’తో తెలుగుకి పరిచయమయ్యారు రష్మికా మందన్నా. ఈ సినిమాలో సింపుల్ గాళ్‌గా ఎంట్రీ ఇచ్చి, స్టార్‌గా ఎదిగారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ సినిమాలు చేస్తున్నారీ బ్యూటీ. ప్రస్తుతం ‘పుష్ప 2’, ‘రెయిన్ బో’తో పాటు మరో తెలుగు సినిమా, హిందీ చిత్రాలతో రష్మిక ఫుల్ బిజీ. అందుకే నితిన్ సరసన ఒప్పుకున్న చిత్రానికి కాల్షీట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయారట. నిజానికి ‘భీష్మ’ సినిమాతో నితిన్–రష్మిక హిట్ పెయిర్ అనిపించుకున్నారు. ఒకవేళ రష్మిక డేట్స్ అడ్జెస్ట్ చేయగలిగితే మరోసారి ఈ జంట సిల్వర్ స్క్రీన్‌పై కనిపించేది. తెలుగులో రష్మిక ఎంట్రీ ఫిల్మ్ ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. తొలి హిట్ ఇచ్చిన దర్శకుడితో ‘భీష్మ’ వంటి రెండో హిట్ కూడా అందుకున్నారు రష్మిక. సో... వెంకీ కుడుములతో మూడో సినిమాని రష్మిక మిస్ అయ్యారు. రీప్లేస్ చేసేది ఎవరు? బాలీవుడ్లో ఈ మధ్య ప్రకటించిన చిత్రాల్లో ‘జీ లే జరా’ అందరి దృష్టినీ ఆకర్షించింది. దానికి కారణం ఇది లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ కావడం, చిత్రదర్శకుడు ఫర్హాన్ అక్తర్ కథానాయికలుగా ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, ఆలియా భట్లను ఎన్నుకోవడం. అయితే హాలీవుడ్ ప్రాజెక్ట్స్ వల్ల ఈ చిత్రాన్ని 2024లో ఆరంభించాలని ఫర్హాన్‌ని ప్రియాంక కోరారట. ఫర్హాన్ ఓకే చెప్పారని టాక్. ఈలోపు కత్రినా వేరే ప్రాజెక్ట్స్ ఒప్పుకోవడంతో ఈ చిత్రానికి డేట్స్ సర్దుబాటు చేయలేనన్నారట. కాగా ‘సిటాడెల్ 2’ స్టార్ట్ అయ్యే చాన్స్ ఉన్నందున టోటల్‌గా ఈ సినిమా నుంచి వాకౌట్ చేయాలని ప్రియాంక నిర్ణయించుకున్నారట. కత్రినా కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఒకరు వదులుకున్న చాన్స్ ఆటోమేటిక్‌గా వేరొకరికి దక్కడం సహజం. అలా ‘గుంటూరు కారం’ నుంచి పూజా హెగ్డే తప్పుకోవడం శ్రీలీలకి, మీనాక్షీ చౌదరికి ప్లస్ అయింది. ముందు ఈ చిత్రంలో శ్రీలీలను రెండో హీరోయిన్గా అనుకున్నారు. కానీ పూజ తప్పుకోవడంతో ఆమె మెయిన్ హీరోయిన్ అయ్యారు. శ్రీలీల స్థానంలోకి మీనాక్షీ చౌదరి వచ్చారు. అలాగే నితిన్ సినిమా నుంచి రష్మికా మందన్నా తప్పుకోవడంతో ఆ చాన్స్ కూడా శ్రీలీలకే వెళ్లనుందని టాలీవుడ్ టాక్. అటు హిందీ ‘జీ లే జరా’ విషయానికొస్తే.. ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్ తప్పుకోవాలనుకోవడంతో అనుష్కా శర్మ, కియారా అద్వానీ వంటి నాయికల పేర్లను పరిశీలిస్తున్నారట ఫర్హాన్ అక్తర్. -
అర్థరహితమైన వివాదం
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి స్వల్ప వ్యవధిలోనే మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి ఆ రాష్ట్ర అసెంబ్లీ అందుకు వేదికైంది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో సభనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. సభా సంప్రదాయానికి అనుగుణంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన ప్రసంగ పాఠాన్ని ఆయన చదవాల్సివుండగా అందులోని కొన్ని వాక్యాలనూ, పదాలనూ ఆయన విడిచి పెట్టారు. పైగా కొన్నింటిని సొంతంగా చేర్చారు. దాంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గవర్నర్ తీరును నిరసిస్తూ ముఖ్యమంత్రి తీర్మానాలు ప్రవేశపెట్టడం, సభ వాటిని ఆమోదించటం అయి పోయింది. ఆ దశలో రవి అర్ధంతరంగా సభ నుంచి నిష్క్రమించారు. తమిళనాట ద్రవిడ ఉద్యమ ప్రభావం ఇప్పటికీ ఎంత బలంగా ఉన్నదో అందరికీ తెలుసు. కేరళ క్యాడర్ ఐపీఎస్ మాజీ అధికారి అయిన రవికి దీనిపై పూర్తి అవగాహన ఉంటుందనటంలో సందేహం లేదు. మరి ‘ద్రవిడ మోడల్ ప్రభుత్వం’ ప్రస్తావన, పెరియార్ రామస్వామి, అన్నాదురై వంటి తమిళ దిగ్గజాలతోపాటు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రస్తావన సైతం రవికి ఎందుకు రుచించలేదో అనూహ్యం. ఒక పౌరుడిగా ఈ దిగ్గజాలపైనా, మొత్తంగా ద్రవిడ ఉద్యమంపైనా రవికి సొంతా భిప్రాయాలేవో ఉండివుండొచ్చు. అంతమాత్రాన తనకిచ్చిన ప్రసంగపాఠంలో ఆ ప్రస్తావనలను మినహాయించటం హర్షించదగ్గదికాదు. అసలు తమిళనాడు అనటంపైనే ఆయనకు అభ్యంతరం ఉన్నట్టుంది. ఈమధ్య రాజ్‌భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమం సందర్భంగా ఆయన ‘తమిళనాడు’కు బదులు ‘తమిళగం’ అని అన్నారు. ఆ వెంటనే దానిపై పెద్ద వివాదం రాజుకుంది. ‘నాడు’ అంటే సార్వభౌమాధికారం ఉండే ఒక రాజ్యంగా ధ్వనిస్తూ వేర్పాటువాద భావన కలగజేస్తున్నదని రవి అభిప్రాయంగా కనబడుతోంది. తమిళ సాహితీవేత్తల వివరణ ప్రకారం ‘నాడు’ అంటే ‘గడ్డ’, ‘ప్రాంతం’ అనే తప్ప వేరే అర్థం లేదు. అసలు తమిళనాడు అనే పేరు రాజ్యాంగానికి అనుగుణ మైనదైనప్పుడు దానిపై పట్టింపులకు పోవటం సరైంది కాదు. అదింకా సద్దుమణగక మునుపే తాజా వివాదం తలెత్తింది. మన ఫెడరల్ వ్యవస్థలో గవర్నర్ల పాత్రపై వివాదాలు చెలరేగడం ఇది మొదటిసారి కాదు... చివరిసారి కూడా కాకపోవచ్చు. నిజానికి అలాంటి సందర్భాల్లో తప్ప గవర్నర్ల వ్యవస్థపైనా, దాని అవసరంపైనా ఎవరూ ప్రశ్నలు లేవనెత్తడం లేదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఇప్పటివరకూ ఎన్నో వ్యవస్థలపై చర్చలు సాగాయి. కొన్నింటి రూపురేఖలు కూడా మారాయి. కానీ సుప్రీంకోర్టు, కొన్ని హైకోర్టులూ తమముందుకొచ్చే కేసుల విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు, నిర్దేశించిన మార్గదర్శకాల పర్యవసానంగా ఏదోమేరకు మారింది తప్ప మొత్తంగా గవర్నర్ల వ్యవస్థ మునుపటి కాలంలో ఉన్నట్టే మిగిలిపోయింది. అందుకే సమస్యలు తప్పడం లేదు. అత్యంత ప్రజాస్వామ్య వాదిగా ముద్రపడిన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూయే గవర్నర్ల వ్యవస్థపై తొలి మరక పడటానికి, ఫెడరల్ వ్యవస్థ మనుగడపై సందేహాలు ముసురుకోవటానికి కారకుడు కావటం ఒక వైచిత్రి. ఆనాటి కేరళ గవర్నర్ ద్వారా తనకు కావలసిన నివేదిక తెప్పించుకుని రాజ్యాంగంలోని 356 అధికరణ కింద 1959లో నంబూద్రిపాద్ నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వాన్ని సాగనంపేవరకూ నెహ్రూ విశ్రమించలేదు. అనంతరకాలంలో ప్రధాని అయిన ఆయన కుమార్తె ఇందిరాగాంధీ రికార్డు స్థాయిలో 50 సార్లు ఆ అధికరణాన్ని ఉపయోగించుకుని తనకు గిట్టని రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేశారు. అటు తర్వాత వచ్చిన సంకీర్ణ రాజకీయ యుగంలో దాన్ని పెద్దగా ఎవరూ ఉపయోగించ లేదు. విపక్ష ఏలుబడిలో ఉంటున్న రాష్ట్రాల్లో గవర్నర్లకూ, సీఎంలకూ వివాదం ఏర్పడే ధోరణి తరచు కనబడటం మాత్రం వాస్తవం. అలాగని అన్నిచోట్లా అలా లేదు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బిహార్ గవర్నర్‌గా ఉన్నకాలంలో అప్పటికి బీజేపీ వ్యతిరేక కూటమిలో ఉన్న నితీశ్ కుమార్ ముఖ్య మంత్రిగా ఉన్నా ఆ ఇద్దరి మధ్యా పొరపొచ్చాలు రాలేదు. ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కూడా గవర్నర్‌గా పనిచేసినప్పుడు పెద్దగా వివాదాల్లోకెక్కలేదు. కానీ కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, తెలంగాణ గవర్నర్ తమిళసైలకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలతో పొరపొచ్చాలు ఎడతెగకుండా సాగు తూనే ఉన్నాయి. తమిళనాడు గవర్నర్ తన వ్యవహారశైలితో ఏం చెప్పదల్చుకున్నారో అర్థంకాదు. ఆయన బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు ప్రోత్సాహంతోనే ఇలా చేస్తున్నారని డీఎంకే నేతలు ఆరోపించటం వల్ల ఆ రాష్ట్రంలో బీజేపీకి రాజకీయంగా నష్టమే తప్ప లాభం ఉండదు. పైగా తమిళనాట నీరాజ నాలందుకునే పెరియార్, అన్నాదురైల పేర్లూ...అన్నిటికీ మించి అంబేడ్కర్ వంటి మహనీయుడి ప్రస్తావన ససేమిరా సమ్మతం కాదని పరోక్షంగా తెలియజెప్పటం ఏమేరకు సబబో రవి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒక రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికీ, అక్కడ గవర్నర్‌గా నియమితులైనవారికీ మధ్య ఆధిపత్య పోరు ఎడతెగకుండా సాగటం వల్ల ఏమాత్రం ప్రయోజనం లేకపోగా ప్రజాస్వామ్య వ్యవస్థకు తీరని నష్టం కలగజేస్తుంది. ఇలాంటి వివాదాలు చెలరేగినప్పుడల్లా పరస్పరం విమర్శలు చేసుకోవటం, రాజ్యాంగ సంక్షోభం తలెత్తటం, ఆ తర్వాత మరో కొత్త తగువు బయల్దేరేవరకూ మౌనం వహించటం కాక... గవర్నర్ల అధికారాలు, వారి పరిధులు, పరిమితులపై సరైన దిశగా చర్చ జరిగి వర్తమాన కాలానికి అనుగుణమైన విధానం రూపుదిద్దుకోవటం శ్రేయస్కరం. -
ఇమ్రాన్‌కు భంగపాటు
-
అమెజాన్‌లో కరోనా అలజడి
సాక్షి, న్యూఢిల్లీ : ఈశాన్య లండన్‌లోని డార్లింగ్టన్లోని ఆన్లైన్ రిటేల్ మార్కెట్ దిగ్గజం ‘అమెజాన్’ గిడ్డంగిలో అలజడి మొదలయింది. కరోనా వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలను కూడా కంపెనీ యాజమాన్యం పట్టించుకోవడం లేదంటూ ప్యాకర్లు ఆందోళన చేపట్టారు. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవడానికి శానిటైజర్లు, ముఖానికి మాస్క్‌లు, చేతులకు గ్లౌజులు సరఫరా చేయక పోవడమే కాకుండా కార్మికుల మధ్య కనీస దూరాన్ని పాటించే పరిస్థితి లేదని, అందుకు యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. (కరోనా : అమెజాన్‌లో 75 వేల ఉద్యోగాలు) అమెజాన్ గిడ్డంగిలో కొన్ని వందల మంది కాంట్రాక్ట్ కార్మికులు పని చేస్తున్నారు. వారంతా తమకు కరోనా బారిన పడకుండా తగిన రక్షణ కావాలంటూ కాసేపు పనులు నిలిపేసి వాకౌట్ చేయడంతో వారిపైన కంపెనీ యాజమాన్యం మండిపడిందట. ఆందోళన చేసిన వారిని తక్షణమే విధుల నుంచి తొలగించి కొత్త వారిని తీసుకుంటామంటూ బెదిరించిందట. ఈ విషయంలో కార్మికులు డార్లింగ్టన్ బొరోగ్ కౌన్సిల్‌కు కూడా ఫిర్యాదు చేశారు. కంపెనీ క్యాంటీన్ కూడా కిక్కిర్సిపోతుందని వారు ఆరోపించారు. వెంటనే స్పందించిన కౌన్సిల్, కార్మికుడికి, కార్మికుడికి మధ్యన రెండు మీటర్ల దూరం ఉండేలా చర్యలు తీసుకోవాల్సిందిగా అమెజాన్ గిడ్డంగి నిర్వాహకులను ఆదేశించింది. (నిత్యావసరాలకు మాత్రమే ఓకే..) అయినప్పటికీ గ్లౌజులు, మాస్క్‌ల లాంటివి సరఫరా చేయక పోవడంతో కార్మికులు గత రాత్రి పని వేళల్లో యాజమాన్యం వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని కొంత మంది కార్మికులు మీడియాకు తెలియజేశారు. ఇది వరకు ఇదే డిమాండ్‌పై ఆందోళన చేసిన కొంతమంది కాంట్రాక్టు కార్మికులను యాజమాన్యం తొలగించినట్లు వారు చెప్పారు. కంపెనీ సామాజిక దూరం పాటించాల్సిందిగా తామే కాకుండా కాంట్రాక్టర్లు ఇచ్చిన మార్గదర్శకాలను గిడ్డంగిలో పని చేస్తున్న కొంత మంది కార్మికులు పాటించక పోవడం శోచనీయమని అమెజాన్ అధికార ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. (అమెజాన్, ఫేస్‌బుక్‌కు కరోనా సెగ) -
విశ్వాసం పొందిన ఉద్ధవ్
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వం లోని ‘మహా వికాస్ ఆఘాడి’ విశ్వాస పరీక్షలో నెగ్గింది. శనివారం జరిగిన ప్రత్యేక భేటీలో శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం సభ విశ్వాసం పొందింది. 288 మంది సభ్యులున్న అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 145 కాగా 169 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు పలికారు. కాషాయ తలపాగాతో ఉద్ధవ్ రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాలకు సీఎం ఉద్ధవ్‌తోపాటు సేన ఎమ్మెల్యేలంతా కాషాయ రంగు తలపాగా ధరించి సభకు వచ్చారు. ఉద్ధవ్ వెనుక ఆయన కొడుకు, ఆదిత్య ఠాక్రే మిగతా సేన ఎమ్మెల్యేలతోపాటు కూర్చున్నారు. ముందుగా ప్రొటెం స్పీకర్ కొలాంబ్కర్‌ను తొలగించి ఎన్సీపీకి చెందిన వల్సే పటిల్‌ను అధికార పక్షం ఎన్నుకుంది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సభలో విశ్వాస పరీక్ష కార్యక్రమం మొదలైంది. పరీక్షలో నెగ్గినట్లు స్పీకర్ ప్రకటించగానే ఉద్ధవ్ లేచి సభ్యులకు, రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ వాకౌట్ ఠాక్రే ప్రభుత్వంపై కాంగ్రెస్‌కు చెందిన మాజీ సీఎం అశోక్ చవాన్ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానాన్ని సీనియర్ ఎన్సీపీ, సేన సభ్యులు బలపరిచారు. బీజేపీకి చెందిన 105 మంది సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయగా వేర్వేరు పార్టీలకు నలుగురు ఎమ్మెల్యేలు తటస్థంగా దూరంగా ఉన్నారని ప్రొటెం స్పీకర్ దిలీప్ వల్సే సభలో ప్రకటించారు. అనంతరం సభలో ఉన్న సభ్యులను లెక్కించి ఉద్ధవ్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గినట్లు స్పీకర్ ప్రకటించారు. ప్రభుత్వానికి 169 మంది అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. మద్దతు తెలిపిన ఎమ్మెల్యేల్లో.. శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44, బహుజన్ వికాస్ ఆఘాడి 3, సమాజ్‌వాదీ పార్టీ 2, స్వాభిమాని శేట్కారి పార్టీ 1, శేత్కరి కామ్‌గార్ పార్టీ 1, క్రాంతికారి శేత్కరీ పార్టీ 1, ఇతరులు, స్వతంత్రులు ఏడుగురు ఉన్నారు. ఏఐఎంఐఎంకు చెందిన ఇద్దరు, సీపీఎంకు చెందిన ఒకరు, రాజ్ ఠాక్రే పార్టీ మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్)ఎమ్మెల్యే తటస్థంగా ఉన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనే: బీజేపీ అంతకుముందు అసెంబ్లీలో సంభవించిన పరిణామాలు రాజ్యాంగ విరుద్ధమంటూ బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది. ప్రొటెం స్పీకర్‌గా ఉన్న బీజేపీకి చెందిన కాళిదాస్ కొలాంబ్కర్ స్థానంలో ఎన్సీపీ నేత దిలీప్ వల్సే పాటిల్‌ను నియమించడంపై బీజేపీ శాసనసభాపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ అభ్యంతరం తెలిపారు. అలాగైతే పార్లమెంట్ సగం ఖాళీ: ఎన్సీపీ నిర్ణీత ఫార్మాట్ ప్రకారం అధికార పక్షం సభ్యులు ప్రమాణ స్వీకారం చేయలేదన్న శివసేన ఆరోపణలపై ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ స్పందించారు. ‘పార్లమెంట్లో బీజేపీ సభ్యులు కూడా ఫార్మాట్‌ను పట్టించుకోకుండా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రకాంత్ పాటిల్ చెబుతున్న నియమాన్ని వారికి కూడా వర్తింపజేస్తే లోక్‌సభ సగం ఖాళీ అవుతుంది’అని పేర్కొన్నారు. అధికార కూటమి తరఫున నానా పటోలే, బీజేపీ నుంచి కిసాన్ కతోరే స్పీకర్ పదవికి పోటీ చేయనున్నారు. అసెంబ్లీలో బలాబలాలు.. మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 మంది సభ్యుల్లో అతిపెద్ద పార్టీ బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు 44 మంది సభ్యుల బలముంది. నవంబర్ 28వ తేదీన శివాజీ పార్క్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎంగా ఉద్ధవ్, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల నుంచి ఇద్దరేసి చొప్పున మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. -
సఫారీ కారు..సాధారణ పోలీసులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఒకప్పుడు ఇల్లు కదిలి బయటకు వస్తే రాణి వెడలె రవితేజములలరగా అన్నట్టుగా వాహనాల కాన్వాయ్, చుట్టూ పెద్దసంఖ్యలో కమాండోల రక్షణ వలయం ఉండేది. కానీ ఎస్పీజీ భద్రత తొలగించడంతో ఆమెకు ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకు బదులుగా పదేళ్ల క్రితం నాటి టాటా సఫారీ కారు కేటాయించారు. ఇంటి దగ్గర సాధారణ పోలీసుల రక్షణ మాత్రమే ఉంటుంది. జెడ్ ప్లస్ కేటగిరీ కింద 100 మంది సెక్యూరిటీ సిబ్బంది కాపలాగా ఉంటారు. 1991లో రాజీవ్ గాంధీ హత్యానంతరం గాంధీ కుటుంబ సభ్యులకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) భద్రత కల్పించారు. అప్పట్నుంచి సోనియా, ప్రియాంక బాలిస్టిక్ క్షిపణి దాడుల్నీ తట్టుకునేలా ఆధునీకరించిన రేంజ్ రోవర్ కార్లను వాడారు. ఇక రాహుల్ ఫార్చ్యూనర్ కారును వాడేవారు. ఇప్పడు భద్రత తొలగించి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కేటాయించడంతో ఆ వైభోగం అంతా తగ్గిపోయింది. వాయిదా తీర్మానం తిరస్కృతి, కాంగ్రెస్ వాకౌట్ గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత తొలగింపు అంశంపై పార్లమెంటులో దుమారం చెలరేగింది. కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి దీనిపై వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే రైతు సమస్యలు, ఢిల్లీ కాలుష్యం అంశాలు చర్చలు ఉన్నందున తీర్మానాన్ని స్పీకర్ బిర్లా తిరస్కరించారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ సభ్యులు వెల్లోనికి దూసుకుపోయారు. ఎస్పీజీ భద్రత ఎందుకు తొలగించాలో ప్రధాని వివరణ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. వాజ్‌పేయి హయాంలోనూ తొలగించలేదు కాంగ్రెస్ ఎంపీ రంజన్ చౌధరి మాట్లాడుతూ ‘‘సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సాధారణ వ్యక్తులు కాదు. గాంధీ కుటుంబానికి అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో ఎస్పీజీ భద్రత తొలగించలేదు. 1991 నుంచి వారికి ఎస్పీజీ భద్రత ఉంది. ఆ తర్వాత రెండు సార్లు ఎన్డీయే అధికారంలోకి వచ్చినా తొలగించలేదు. మరి ఇప్పుడు ఎందుకు తొలగించాల్సి వచ్చింది’ అని ప్రశ్నించారు. తిరిగి ప్రశ్నోత్తరాల సమయంలోనూ కాసేపు వాగ్వాదాలు నడిచాక కాంగ్రెస్, డీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. జేఎన్‌యూ వివాదంపై స్తంభించిన రాజ్యసభ ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న జేఎన్‌యూ విద్యార్థులపై పోలీసుల దాష్టీకం, కశ్మీర్లో రాజకీయ నేతల నిర్బంధం అంశాలపై రాజ్యసభ దద్దరిల్లింది. మంగళవారం సభ సమావేశం కాగానే విపక్షాలు ఈ అంశాన్ని లేవనెతాయి. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీనిపై వాయిదా తీర్మానాలు అందాయని, ఆ అంశాలు వచ్చినప్పుడు చర్చ చేపడదామని చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు పదే పదే చెప్పినప్పటికీ సభ్యులు వినిపించుకోలేదు. తమ స్థానాల్లో కూర్చొనే ఈ రెండు అంశాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో సభను చైర్మన్ వాయిదా వేశారు. సభకు రాహుల్ గైర్హాజరు లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నకు స్పీకర్ సమయం కేటాయించినప్పటికీ ఆయన సభలో కనిపించలేదు. రాహుల్ ప్రశ్న జాబితాలో ఉంది. సభలో రాహుల్ ఉంటే ఆయనకు అవకాశం వచ్చేది అని బిర్లా వ్యాఖ్యానించారు. రాహుల్ సీటులో కూర్చొని ఎంపీ సురేష్ మాట్లాడబోతే వద్దని వారించారు. కేరళలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనపై రాహుల్ ప్రశ్న అడగాల్సి ఉండేది. -
ప్రజాస్వామ్యం ఖూనీ : ఆజాద్
-
ఆర్టికల్ 370 రద్దు : విపక్షాల వాకౌట్
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. విపక్షాల నిరసనల నడుమే హోంమంత్రి అమిత్ షా సంచలన నిర్ణయం ప్రకటించారు. జమ్మూ కశ్మీర్‌ను మూడు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించారు. కేంద్రం నిర్ణయాన్ని కాంగ్రెస్, పీడీపీ సహా పలు విపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. బీజేపీ రాజ్యాంగాన్ని హత్య చేసిందని రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ ఆరోపించారు. ఆర్టికల్ 370 రద్దును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. కేంద్ర నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. భయాందోళనలు రేకెత్తించి కశ్మీర్‌ను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. దేశ రాజ్యాంగానికి తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. రాజ్యాంగ ప్రతులను చించివేసిన పీడీపీ సభ్యుల తీరును గులాం నబీ ఆజాద్ తప్పుపట్టారు. చొక్కాలు చించుకుని తీవ్ర ఆందోళన చేపట్టిన పీడీపీ సభ్యులను సభ నుంచి బయటకు పంపాలని ఛైర్మన్ మార్షల్స్‌ను ఆదేశించారు. మరోవైపు ఆర్టికల్ 370 రద్దును నిరసిస్తూ విపక్షాలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి. -
మీటూ : గూగుల్‌కు ఉద్యోగుల షాక్
-
మీటూ : గూగుల్ ఉద్యోగుల వాకౌట్
శాన్ఫ్రాన్సిస్కో : పనిప్రదేశంలో లైంగిక వేధింపులు, వివక్షకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ఉద్యోగులు గురువారం కార్యాలయాల నుంచి వాకౌట్ చేశారు. ఉద్యోగుల ప్రతినిధులను బోర్డులోకి తీసుకోవాలని, వేధింపుల ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి అనుగుణంగా మానవ వనరుల విధానాల్లో మార్పులు తీసుకురావాలని గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్‌ను ఆందోళన చేపట్టిన ఉద్యోగులు డిమాండ్ చేశారు. గూగుల్ ఉద్యోగులు తమ వాకౌట్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మీటూ ప్రకంపనల నేపథ్యంలో పనిప్రదేశంలో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా గూగుల్ ఉద్యోగులు పనికి విరామం ప్రకటించి ఆందోళన బాటపట్టారు. పలు బహిరంగ వేదికలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కాగా ఉద్యోగులు పలు నిర్మాణాత్మక సూచనలతో ముందుకొచ్చారని, వారి సూచనలను అమలు చేసేందుకు కంపెనీ సిద్ధంగా ఉందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు అల్ఫాబెట్‌కు చెందిన 94,000 మంది ఉద్యోగులు, వందలాది కాంట్రాక్టర్ల అసంతృప్తి కంపెనీ షేర్లపై ప్రభావం చూపకపోయినా తమ ఆందోళనను విస్మరిస్తే కంపెనీకి రిక్రూట్మెంట్, సిబ్బందిని నిలుపుకోవడంలో సమస్యలు ఎదురవుతాయని ఉద్యోగుల ప్రతినిధులు పేర్కొన్నారు. మరోవైపు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న కంపెనీ ఉన్నతాధికారులకు గూగుల్ భారీ ప్యాకేజీలతో వీడ్కోలు పలికిందన్న వార్తల నేపథ్యంలో కంపెనీ తీరుపై గూగుల్ ఉద్యోగులు మండిపడుతున్నారు. -
వెల్‌లో విజయసాయిరెడ్డి నిరసన
సాక్షి, న్యూఢిల్లీ : ఏపీ విభజన హామీలపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సరైన సమయం ఇవ్వలేదని పార్టీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. తమకు అతితక్కువ సమయం కేటాయించడం పట్ల చైర్మన్ తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. రాష్ట్రానికి సంబంధించి కీలక అంశంపై తమకు అతితక్కువ సమయం కేటాయించడంపై మండిపడ్డారు. అంతకుముందు ఏపీకి ప్రత్యేక హోదా ఎంత అవసరమనే అంశంతో పాటు పూర్వాపరాలను వివరించే క్రమంలోనే కేటాయించిన సమయం అయిపోయిందని, ప్రసంగం ముగించాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు విజయసాయి రెడ్డిపై ఒత్తిడి చేశారు. కీలక అంశంపై తనకు మరింత సమయం ఇవ్వాలని, కనీసం 15 నిమిషాలు మాట్లాడేందుకు అనుమతించాలని విజయసాయి రెడ్డి కోరారు. టీడీపీకి 27 నిమిషాలు సమయం ఇచ్చారని తనకు మరింత సమయం ఇవ్వాలని కోరినా వెంకయ్యనాయుడు నిరాకరించారు. -
ఉబెర్ ఒప్పందానికి డ్రైవర్ల సెగ
-
‘నోట్ల రద్దు’ నిరసనపై వాడీవేడి చర్చ
సాక్షి, హైదరాబాద్: ఏడాది కిందట జరిగిన పెద్ద నోట్లరద్దు అంశం శాసనసభలో కాసేపు వేడి పుట్టించింది. నోట్ల రద్దు, జీఎస్టీతో సామాన్య జనం, వ్యాపారులు, రైతులపై పడిన ప్రభావంపై చర్చించాలంటూ కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ మధుసూదనాచా రి తిరస్కరించారు. దీనిపై నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ విజ్ఞప్తి చేయడం, అందుకు బీజేపీ అభ్యంతరం తెలపడం, మధ్యలో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోవడం.. సభలో కొద్దిసేపు దుమారం రేపింది. ప్రశ్నోత్తరాలు, విద్యుత్‌పై సీఎం చేసిన ప్రకటన అనంతరం కాంగ్రెస్ వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. వెంటనే ప్రతిపక్షనేత జానారెడ్డి మాట్లాడుతూ, వాయిదా తీర్మానం తిరస్కరించినందున నిరసన తెలిపే అవకాశం ఇవ్వాలన్నారు. దీంతో సభా వ్యవహారాల మంత్రి హరీ శ్ రావు జోక్యం చేసుకొని, తిరస్కరణ తర్వాత అవకాశం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ సమయంలో బీజేపీ సభ్యులు జి.కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రరారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు నిరసనకు అవకాశం ఇవ్వవద్దం టూ స్పీకర్‌ను కోరారు. గందరగోళం మధ్యే కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి స్పీకర్ మైక్ ఇచ్చారు. ‘నోట్ల రద్దుతో సామాన్య ప్రజ లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనుక దీనిపై సభలో చర్చించాలి’ అని అనడంతో మళ్లీ బీజేపీ సభ్యులు అభ్యంతరం పెట్టారు. దీంతో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకున్నారు. ఆర్థిక పరిస్థితిపై చర్చిద్దాం: కేసీఆర్ సీఎం మాట్లాడుతూ, ‘ఈ విషయంపై ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అన్ని రాష్ట్రాలు, ప్రజలపై నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభా వం ఒక్కో రీతిగా ఉంది. దీనిపై బీఏసీలో చర్చించాలని జానారెడ్డి కోరారు. చర్చ పెట్టా లని మేము కోరుతున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నోట్లరద్దు, జీఎస్టీ ప్రభావంపై చర్చిద్దాం. దీనిపై జానారెడ్డి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించినందున నిరసన తెలుపుతా మంటున్నారు, తెలపనివ్వండి’ అని అన్నారు. దీంతో స్పీకర్ ఉత్తమ్‌కు అవకాశం ఇచ్చారు. ‘ప్రధాని నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థకు, తీవ్ర నష్టం జరిగింది. నోట్ల రద్దు ప్రభావం, తుగ్లక్ నిర్ణయంపై సభలో తీర్మానం చేద్దాం’ అంటూ ఉత్తమ్ కొనసాగిస్తుండగానే మైక్ కట్ చేశారు. నిరసన తెలపాలనుకుంటే అది చెప్పాలి కానీ, ఉపోద్ఘాతం ఎందుకంటూ సీఎం చురకలు అంటించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. కాగా, ‘నోట్ల రద్దు’ ప్రభావంపై చర్చించాలంటూ మండలిలో కాంగ్రెస్ సభ్యులు వాయిదా తీర్మానం ప్రతిపాదించారు. ప్రశ్నోత్తరాలకు ఆటంకం కలిగించవద్దని చెప్పి చైర్మన్ స్వామిగౌడ్ సభను నిర్వహించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. -
నీట్ రగడ
♦ సర్కారుపై ప్రతిపక్షాల ఫైర్ ♦ మంత్రులతో వాగ్వాదం ♦ వాకౌట్ ♦ కరుణకు వెసులుబాటు ♦ 8 ముసాయిదాలు ♦ ఇక, మరింతగా ముందుకు జాలర్లు రాష్ట్ర అసెంబ్లీలో మంగళవారం ‘నీట్’ వ్యవహారంపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఢీకొట్టాయి. నీట్ రూపంలో రాష్ట్రంలోని విద్యార్థులకు వైద్య కోర్సులు అందని ద్రాక్షగా మారినట్టు మండిపడ్డాయి. మంత్రులతో వాగ్వాదం హోరెత్తడం, స్పీకర్ సైతం పాలకులకు మద్దతుగా స్పందించడంతో సభనుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. ఇక, సభకు హాజరయ్యే విషయంలో డీఎంకే అధినేత ఎం.కరుణానిధికి వెసులుబాటు కల్పించారు. సభలో ఎనిమిది ముసాయిదాలను ప్రవేశ పెట్టారు. సాక్షి, చెన్నై : రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ముగియడంతో మంగళవారం మళ్లీ అసెంబ్లీ సమావేశం అయింది. ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ ‘నీట్’ రూపంలో విద్యార్థులు పడుతున్న పాట్లను ఏకరువు పెట్టారు. వైద్య కోర్సులు అందని ద్రాక్షగా మారాయని, విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని మండిపడ్డారు. అవకాశాలు కలిసివచ్చినా, నీట్ మినహాయింపు సాధనలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రపతి ఎన్నికల సమయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఉండాలని పేర్కొన్నారు. ఇకనైనా స్పందించాలని డిమాండ్‌చేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్ని పరిగణనలోకి తీసుకుని నీట్ మినహాయింపునకు కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని పట్టుబట్టారు. దీంతో ఆరోగ్య మంత్రి విజయభాస్కర్ స్పందిస్తూ, బుధవారం ఢిల్లీ వెళ్తున్నట్టు, కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు మొక్కుబడిగా సమాధానం ఇవ్వడం ప్రతిపక్షాల్లో ఆగ్రహం పెల్లుబికింది. బాధ్యత గల మంత్రి ఇకమీద చర్యలకు సిద్ధం కాబోతున్నట్టుగా స్పందించడం శోచనీయమని విమర్శలు గుప్పించాయి. ఈ క్రమంలో మంత్రులతో డీఎంకే సభ్యుల వాగ్వావాదం సభలో హోరెత్తింది. వీరిని బుజ్జగించే క్రమంలో స్పీకర్ ధనపాల్ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ, నీట్ చర్చ ఇక ముగిసినట్టు వ్యాఖ్యానించడాన్ని డీఎంకేతో పాటుగా, కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌లు తీవ్రంగా పరిగణించారు. సభ నుంచి ఒకరి తర్వాత మరొకరు వాకౌట్ చేశారు. కాగా, వాగ్వాద సమయంలో డీఎంకే ఎమ్మెల్యే పొన్ముడిని పలుమార్లు స్పీకర్ తీవ్రంగా మందలించడం గమనార్హం. మరింతగా ముందుకు జాలర్లు సాగరంలో చేపల వేట నిమిత్తం మరింత ముందుకు సాగేందుకు జాలర్లకు మార్గం సుగమం అయింది. ఇందుకు తగ్గ ముసాయిదా అసెంబ్లీలో దాఖలైంది. మత్స్యశాఖ మంత్రి జయకుమార్ దాఖలు చేసిన ముసాయిదాలతో సముద్రంలో చేపల వేటకు సరిహద్దును పొడిగిస్తూ తీర్మానం చేశారు. ఆ మేరకు ఇక, ఐదు నాటికల్ మైళ్ల దూరం వరకు సముద్రంలో చేపల వేటకు అవకాశం కల్పించారు. అలాగే, జాలర్ల హక్కులు, సంక్షేమం లక్ష్యంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే, క్రీడ, వ్యవసాయం, పశు వైద్య వర్సిటీల్లో వీసీల నియామకంపై ప్రత్యేక కమిటీలను రంగంలోకి దించే రీతిలో ఆయా శాఖల మంత్రులు ముసాయిదాలను అసెంబ్లీలో దాఖలు చేశారు. విద్యుత్, ఒప్పందాలు, ఉద్యోగుల చట్ట నిబంధనల విషయంలోనూ ముసాయిదాలు సభకు చేరాయి. కరుణకు వెసులు బాటు ప్రతి సభ్యుడు సమావేశ సమయాల్లో ఏదో ఒక్కసారైనా సభ లాబీలో ఉన్న పుస్తకంలో సంతకం చేయాల్సిన అవసరం ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఈ సమావేశాలకు డీఎంకే అధినేత కరుణానిధి పూర్తిగా దూరంగా ఉన్నారు. ఇందుకు కారణం అనారోగ్యం,వయోభారంతో ఆయన గోపాల పురం ఇంటికి పరిమితం కావడమే. దీంతో ఆయనకు సభకు హాజరయ్యే విషయంలో వెసులుబాటు , మినహాయింపు కల్పించాలని డీఎంకే తరఫున ప్రత్యేక తీర్మానం సభ దృష్టికి తెచ్చారు. దీనిని స్పీకర్ ధనపాల్ అంగీకరించారు. కరుణానిధి సభకు హాజరు కావాల్సిన అవసరం లేదని, సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాక హాజరు కావచ్చంటూ స్పీకర్ ప్రవేశపెట్టిన తీర్మానికి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడం విశేషం. సాయం పెంపు విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించే అగ్నిమాపక సిబ్బంది కుటుంబానికి సాయం పెంచుతూ అసెంబ్లీలో సీఎం పళని స్వామి ప్రకటించారు. కొడుంగైయూర్ ప్రమాదాన్ని పరిగణించి, ఎవరైనా సిబ్బంది మరణిస్తే, ఇక రూ.పది లక్షలు సాయంగా పేర్కొన్నారు. అలాగే, ఏదేని అవయవాలను కోల్పోయిన సిబ్బందికి రూ.నాలుగు లక్షలు, మంటల్లో గాయపడ్డ వారికి రూ.రెండు లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.లక్ష చొప్పున ప్రభుత్వ సాయం దక్కుతుందని ప్రకటించారు. ముందుగా ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యుల ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు సమాధానాలు ఇచ్చారు. -
‘లా’ కమిషన్ సిఫారసులపై నిరసన
కర్నూలు(లీగల్): ‘లా’ కమిషన్ (న్యాయవాదుల సవరణ బిల్లు 2017) సిఫారసులను వ్యతిరేకిస్తూ కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం శుక్రవారం మధ్యాహ్నం విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేసింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.చాంద్‌బాషా అధ్యక్షతన నా్యయవాదులు సవరణ బిల్లు ప్రతులను జిల్లా కోర్టు ఎదుట దహనం చేశారు. కొద్దిసేపు ‘లా’ కమిషన్ చైర్మన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బార్ కౌన్సిల్ సభ్యులు పి.రవిగువేరా మాట్లాడుతూ మే 2వ తేదీన న్యూఢిల్లీలో బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి జిల్లాలోని న్యాయవాదులు తరలిరావాలని పిలుపునిచ్చారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వాసు మాట్లాడుతూ ‘లా’ కమిషన్ ప్రతిపాదించిన సిఫారసులను వ్యతిరేకించాలని ఎంపీలను కలవనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ఓంకార్, పి.సుంకన్న, కోటేశ్వరరెడ్డి, రంగా రవికుమార్, శ్రీవత్స, జలందర్, బాలు, నాగరాజు, ఎ.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.