బాబుకు 23 ప్రశ్నలు | ysrcp been released to the media 23 quations to babu | Sakshi
Sakshi News home page

బాబుకు 23 ప్రశ్నలు

Published Sat, Jun 20 2015 1:27 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

బాబుకు 23 ప్రశ్నలు - Sakshi

బాబుకు 23 ప్రశ్నలు

మీడియాకు విడుదల చేసిన వైఎస్సార్‌సీపీ
సాక్షి, హైదరాబాద్: టీడీపీ ప్రభుత్వాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అస్థిరపరుస్తున్నారంటూ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ధ్వజమెత్తింది.
తమ పార్టీపై ప్రశ్నలను సంధిం చడానికి ప్రతిగా పలు ప్రశ్నలను మీడియాకు విడుదల చేసింది. చంద్రబాబుకు, టీడీపీకి వైఎస్సార్ కాంగ్రెస్ సూటి ప్రశ్నలు..

ఓటు, కోట్లు కేసులో మీరు కేసీఆర్ కాళ్లు పట్టుకునేందుకు సిద్ధం అయ్యారా?లేదా?
ఢిల్లీలో బేరం, రాయబారం కుదుర్చుకునేందుకు సుజనా చౌదరిని ఉపయోగించి కేటీఆర్ కాళ్లా వేళ్లా పడ్డారన్నది నిజం అవునా? కాదా?
ఢిల్లీలో మీ కేంద్ర మంత్రుల్ని, ఎంపీలను ఉపయోగించి ఎన్డీఏ పెద్దలందరినీ ప్రాధేయపడి గవర్నర్ ద్వారా కాంప్రమైజ్ ఫార్ములా పంపారా? లేదా?
ఆంబోతు, కీలుబొమ్మ వంటి మాటలు మాట్లాడవద్దని తాఖీదులు ఇచ్చారంటే ఇది మీ రాజీలో భాగం కాదా? గవర్నర్‌ను అప్పుడు ఎందుకు అవమానించారు? ఇప్పుడు ఎందుకు మంచి చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టారు?
గాంధీ అనే తాబేదారును ఫోరెన్సిక్ సాక్ష్యాలు తారుమారు చేసేందుకే ఇప్పటికిప్పుడు ఏపీ అడ్వైజర్‌గా వేసుకున్నది నిజం కాదా?
మీరు స్టీఫెన్‌సన్‌తో మాట్లాడింది నిజం అవునా? కాదా? ఆ వాయిస్ రికార్డింగ్‌లో ఉన్నది మీ గొంతు అవునా? కాదా?
మీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రూ. 50 లక్షలతో దొరికాడా?లేదా?
సెక్షన్-8 ప్రకారం గవర్నర్‌కు శాంతిభద్రతల విషయంలో, పోలీసు అంశాల్లో తుది అధికారం ఉంటుందన్న విషయం మీరు అడ్డంగా దొరికిపోయేవరకు గుర్తుకు రాలేదన్నది నిజం కాదా?
ఫోన్‌లో రికార్డు చేయటం తప్పు, ఎమ్మెల్యేకి రూ. 5 కోట్లు ఇచ్చి కొనటం ఒప్పు అన్నది మీ అభిప్రాయమా?
2008 అక్టోబర్ 18నే తెలంగాణను విడగొట్టండి అని మీ పార్టీలో ఉన్న ఆంధ్రా నాయకులు, రాయలసీమ నాయకులు కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయటం, ఆ తీర్మాణాన్ని ప్రణబ్ ముఖర్జీ కమిటీకి పంపటం నిజం అవునా? కాదా?
టీఆర్‌ఎస్ కంటే ముందే ఏపీని విడగొట్టండని తీర్మానం చేసి పంపింది మీ పార్టీ అవునా? కాదా?
2009లో మీరు, కేసీఆర్ ఒకరి కండువాలు ఒకరిమీద కప్పుకుని, ఒకరినొకరు కౌగిలించుకుని ఎన్నికల్లో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకుని పోటీ చేసింది నిజం అవునా? కాదా? అప్పుడు మీరు టీఆర్‌ఎస్‌కు ఎన్ని మూటలు సమర్పించుకున్నారో చెప్పే ధైర్యం మీకుందా?
2008 మొదలు ప్రతి మహానాడులోనూ తెలంగాణ రాష్ట్రాన్ని విడగొట్టండి అని మీరు తీర్మానాలు చేశారా? లేదా?
⇒  వైఎస్ మరణం తర్వాత కేసీఆర్ నిరాహార దీక్ష మొదలు పెట్టినప్పుడు ముఖ్యమంత్రిగా రోశయ్య పెట్టిన ఆల్ పార్టీ మీటిం గ్‌లో ఏపీని విడగొట్టండని టీఆర్‌ఎస్‌కు మద్దతు పలికింది మీరు అవునా? కాదా?
రాష్ట్ర విభజనకు పార్లమెంటులో మొదటి ఓటు వేసింది మీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు అవునా? కాదా?
మీరు ఏపీ సీఎం అయిన తర్వాత కూడా మహబూబ్‌నగర్, కరీంనగర్‌లలో మావల్లే తెలంగాణ వచ్చిందని చెప్పటం నిజం కాదా?
⇒  పోలవరం ప్రాజెక్టును కట్టొద్దు, కేవలం లిఫ్ట్‌లతో సరిపెట్టండి అన్న తెలంగాణవాదుల డిమాండ్‌ను పట్టిసీమ పేరిట అమలు చేయటంలో ఆంధ్రప్రదేశ్ వ్యతిరేక కుట్ర దాగి ఉండటం నిజం కాదా?
రేవంత్‌రెడ్డి మోసిన మూటలు పట్టిసీమ నుంచి మీరు కొట్టిన వందల కోట్ల సొమ్ము నుంచి బయటకు తీసినవి అవునా? కాదా?
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎలాంటి అనుమతులూ లేకుండా కేసీఆర్ ప్రారంభించినా మీరు కనీసం ఉత్తరం ముక్క కూడా రాయకపోవడం నిజం కాదా?
దొంగల్లా దొరికి కూడా దబాయిస్తున్నారంటే రాజీ కుదుర్చుకున్నారన్నది స్పష్టం కాదా?
నీ దొంగతనానికి, ఏపీ ప్రజలకు సంబంధం ఏమిటో చెప్పగలవా?
స్టీఫెన్‌సన్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని జగన్ ఉత్తరం రాశారని అంటున్నావు. ఈ ఆరోపణ చేయటానికి బుద్ధి, జ్ఞానం ఉండాలి. ఆ లేఖను బయటపెట్టగలవా?
మేము ఎమ్మెల్యేని ధారాదత్తం చేయలేదు. నువ్వే తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌కు ధారాదత్తం చేసింది నిజం అవునా? కాదా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement