వంగర, న్యూస్‌లైన్: జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకే అత్యధిక స్థానాలు వస్తాయని ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పాలవలస రాజశేఖరం అన్నారు. బుధవారం శివ్వాం గ్రామానికి చెందిన టీడీపీ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు, శివ్వాం సర్పంచ్ ఉదయాన మురళీకృష్ణ, కొవగాన స్వామినాయుడు, కలమట రామయ్య, కిమిడి తవిటినాయుడు, కర్రి తాతబాబు,కర్రి అప్పలనరసింహులు తదితరులు వైఎస్సార్‌సీపీలో చేరారు.
వారికి కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మండలంలోని ఎం.సీతారాంపురం గ్రామంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పాలవలస రాజశేఖరం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజశేఖరం మాట్లాడుతూ తలగాం నుంచి పోటీ చేస్తున్న కిమిడి కనకమహాలక్ష్మిని గెలిపించాలని కోరారు.
కార్యక్రమంలో రాజాం నియోజకవర్గ సమన్వయకర్త కంబాల జోగులు, జెడ్పీటీసీ అభ్యర్థి ఉత్తరావెల్లి సురేష్‌ముఖర్జీ, మండల కన్వీనర్ కె. సుదర్శనరావు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కె.ఉమామహేశ్వరరావు, పీఏసీఎస్ అధ్యక్షుడు మజ్జి వెంకటనాయుడు, సర్పంచ్‌లు కె.సన్యాసినాయుడు, గణేష్ బెనర్జీ, పి.రామకృష్ణ, జి.రామకృష్ణ,కె.గోవిందరావు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీకే అత్యధిక ‘ప్రాదేశిక’ స్థానాలు
Published Thu, Mar 27 2014 2:15 AM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM
Advertisement
Advertisement