వైఎస్ఆర్సిపికి విప్ జారీ చేసే అధికారం | YSRCP have power to whip | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్సిపికి విప్ జారీ చేసే అధికారం

Published Thu, May 29 2014 6:15 PM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

వైఎస్ఆర్సిపికి విప్ జారీ చేసే అధికారం - Sakshi

వైఎస్ఆర్సిపికి విప్ జారీ చేసే అధికారం

హైదరాబాద్: మునిసిపల్, జిల్లా పరిషత్ ఎన్నికలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విప్ జారీ చేసే అధికారం ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కేంద్ర ఎన్నికల సంఘం వైఎస్ఆర్ సిపికి గుర్తింపు ఇచ్చిన నేపధ్యంలో ఈ  గుర్తింపు తక్షణమే అమలులోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.

వైఎస్ఆర్ సిపికి కేంద్ర ఎన్నికల సంఘం రెండు రోజుల క్రితమే గుర్తింపు ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు లభించే అన్ని అర్హతలు ఆ పార్టీకి లభించాయి. మునిసిపల్ చైర్మన్, జిల్లా పరిషత్ అధ్యక్షులను ఎన్నుకునేసమయంలో ఈ పార్టీకి విప్ జారీ చేసే అధికారం కూడా లభించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement