ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు?
ఒక అప్రజాస్వామిక విధానానికి చంద్రబాబు తెరలేపారని చెప్పారు. కంచె చేను మేసినట్లుగా గవర్నర్ వ్యవహరించారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాల్సిన దౌర్భాగ్యమేమిటి అని నిలదీశారు. టీడీపీలో ఇక సమర్థులు లేరా అని విమర్శించారు. తలసానికి మంత్రి పదవి ఇచ్చినప్పుడు చంద్రబాబు ఏం మాట్లాడారని ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబుకు ఆ మాటలు, ఆయన చెప్పిన విలువలు ఎందుకు గుర్తు రావడం లేదని మండిపడ్డారు. చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలు ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. భవిష్యత్‌లో టీడీపీ, చంద్రబాబు, లోకేష్ మూల్యం చెల్లించక తప్పదని అంబటి హెచ్చరించారు.