కోవూరు వైఎస్ఆర్సీపీ కన్వీర్ హఠాన్మరణం | YSRCP leader dies with heart attack | Sakshi
Sakshi News home page

కోవూరు వైఎస్ఆర్సీపీ కన్వీర్ హఠాన్మరణం

Published Tue, Jul 29 2014 12:05 PM | Last Updated on Tue, May 29 2018 4:15 PM

కోవూరు వైఎస్ఆర్సీపీ కన్వీర్ హఠాన్మరణం - Sakshi

కోవూరు వైఎస్ఆర్సీపీ కన్వీర్ హఠాన్మరణం

నెల్లూరు జిల్లా కోవూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ వినోద్ కుమార్ రెడ్డి (52) గుండెపోటుతో మరణించారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. సీనియర్ ఇంటర్ పూర్తి చేసిన కుమారుడిని మెడిసిన్ చదివించాలన్న ఆశ వినోద్ కుమార్ రెడ్డికి ఉండేది. ఉదయాన్నే పొలానికి వెళ్లి, పాలు పితుకుతూ ఉన్నట్టుండి వెనక్కి పడిపోయారు. నెల్లూరులో ఉన్న సింహపురి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే మార్గమధ్యంలోనే మరణించారు.

మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఈయన కుడిభుజంగా ఉండేవారు. వినోద్ మృతికి ప్రసన్న సంతాపం తెలిపారు. వినోద్ కుమార్ రెడ్డి తండ్రి ములుమూడి రామచంద్రారెడ్డి షుగర్ ఫ్యాక్టరీ మాజీ వైస్ ఛైర్మన్. మండలంలో అందరితో కలుపుగోలుగా ఉండేవారని, స్కూలు పిల్లలకు ఫీజులు కట్టడం దగ్గర్నుంచి అన్ని రకాలుగా ప్రజలకు అండదండలు అందించేవారని అంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా పార్టీ తరఫున కీలకంగా వ్యవహరించడంతో ఏడు పంచాయతీలు పార్టీకి వచ్చాయని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement