సాక్షి, అమరావతి: వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 100వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు కేకులు కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారి బాధలు వింటూ జననేత పాదయాత్రను ముందుకు సాగిస్తున్నారు. పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగాలని ఆలయాలలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. తమ నాయకుడి పాదయాత్ర వంద రోజులు పూర్తి కావడంతో సేవా కార్యక్రమాలు చేపట్టారు.
తూర్పుగోదావరి జిల్లా: పాదయాత్ర వంద రోజులు పూర్తయిన సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు పిఠాపురం పాదగయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా పూర్తి చెయ్యాలని కోరుతూ పురుహూతిక అమ్మవారికి 101 కొబ్బరి కాయాలు కొట్టారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు, మున్సిపల్ ప్లోర్ లీడర్ గండేపల్లి బాబి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ జిల్లా: కడప సంధ్య సర్కిల్‌లో కూడా నాయకులు కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేశారు. ఈ కార్యక్రమంలో కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ భాషా, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లి మల్లికార్జునరెడ్డి, కడప నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్ పాల్గొన్నారు. పాదయాత్ర 100 రోజుల సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. వైఎస్సార్ సీపీ యువజన కమిటీ ఆధ్వర్యంలో పాత కలెక్టర్ కార్యాలయం సమీపంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద విద్యార్ధులు 101 టెంకాయలు కొట్టారు.
కర్నూల్ జిల్లా: రాజన్న తనయుడి పాదయాత్ర వంద రోజులు పూర్తైన సందర్భంగా కర్నూల్ జిల్లా ఆదోనిలో యువ నాయకులు మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంజనేయ్య స్వామి దేవాలయంలో 100 టెంకాయాలు కొట్టి పూజలు నిర్వహించారు.
కృష్ణా జిల్లా: వైఎస్సార్ సీపీ విజయవాడ ఈస్ట్ నియోజకవర్గ సమన్వయకర్త బొప్పన భవకుమార్ ఆధ్వర్యంలో మాచవరం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కేక్ కట్ చేశారు.
నెల్లూరు జిల్లా: వైఎస్ఆర్‌సీపీ శ్రేణుల సంబరాలు చేసుకుంటున్నారు. పొదలకూరులో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతేకాక వారి సంతోషాన్ని ఎమ్మెల్యే కేక్ కట్ చేసి తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో వంద ప్రార్ధనాలయాలలో పూజలు చేశారు.
శ్రీకాకుళం జిల్లా: వైఎస్‌ఆర్‌సీపీ సీఇసీ మెంబర్ అందవరపు సూరిబాబు ఆద్వర్యంలో శ్రీకాకుళం కోటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక అభిషేకాలు చేయించారు. ఇందులో భాగంగా 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ కిట్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కార్యదర్శి పి. కామేశ్వరి, కార్యకర్తలు పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా: వైసీపీ నేత ఆకుల గజేంద్ర గంగవరం వినాయకుని ఆలయంలో 1001 టెంకాయలు కొట్టి వృద్ధాశ్రమంలో వృద్ధులకు బట్టలు, పండ్లు పంపిణీ చేశారు. ఐరాల కన్వీనర్ బుజ్జిరెడ్డి ఆధ్వర్యంలో కాణిపాకం వరసిద్ది వినాయకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు.
విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ శ్రీ వేంకటేశ్వస్వామి దేవాలయంలో 100 కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌టీయూసీ నాయకులు మస్తానప్ప తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లా: వైఎస్సార్ సీపీ రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి బూర సుమన్ నర్సంపేటలోని సంజీవని అనాథాశ్రమంలో విద్యార్ధుల మధ్య కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment