
'చంద్రబాబుకు అరెస్టు భయం పట్టుకుంది'
ఏలూరు (పశ్చిమ గోదావరి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు అరెస్టు భయం పట్టుకుందని వైఎస్సార్సీపీ నేతలు కొత్తపల్లి సుబ్బరాయుడు, మేకా శేషుబాబు ఆరోపించారు. అవినీతి ఆరోపణలపై చంద్రబాబు విచారణ జరిపించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓటుకు కోట్లు కేసులో సీఎం చంద్రబాబుకి అరెస్టు భయం పట్టుకుందన్నారు. ఆ వ్యవహారంలో రెండు రాష్ట్రాల ప్రజలకు ఎలాంటి సంబంధం లేదని వారు వాదించారు. అధికార తెలుగుదేశం పార్టీ ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని చూస్తోందని వారు ఆరోపించారు.