అనంతపురం: అనంతపురం ఎన్పీకుంటలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చాంద్ బాషా కలెక్టర్ని కోరారు. ఈ సందర్భంగా ఎన్పీకుంటలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్లాంట్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. 50 ఏళ్లుగా భూములుసాగు చేసుకుంటున్న రైతులకు నష్ట పరిహారం దక్కలేదని కలెక్టర్ కి వివరించారు.
రాజకీయ ఒత్తిళ్లతో ప్రైవేట్ వ్యక్తులను జాబితాలో చేర్చి నిజమైన రైతుల పొట్టకొడుతున్నారన్నారు. భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.5లక్షల పరిహారం చెల్లించాలని చాంద్ బాషా కలెక్టర్ని కోరారు.